సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors), ఇటీవలి కాలంలో అధునాత ఉత్పత్తులను తయారు చేస్తూ, ప్రపంచంలోనే అత్యుత్తమ కార్ కంపెనీలలో ఒకటిగా ఎదుగుతోంది. కియా భారతదేశంలో కూడా అతి తక్కువ సమయంలోనే అతిపెద్ద కార్ కంపెనీగా అవతరించింది. కియా తమ గ్లోబల్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో అనేక ఉత్తమమైన వాహనాలను కలిగి ఉండగా, తాజాగా మరో సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

కియా మోటార్స్ తమ సెకండ్ జనరేషన్ నీరో (Kia Niro) క్రాస్‌ఓవర్‌ను సరికొత్త మార్పులతో పరిచయం చేసింది. కియా తమ మొదటి తరం నీరో మోడల్ ను 2016 లో తొలిసారిగా ప్రవేశపెట్టింది, ఆ తర్వాత ఇప్పుడు పూర్తిస్థాయి మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. హబానీరో కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన, కియా నీరో మెస్మరైజింగ్ లుక్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, కొరియాలో జరుగుతున్న సియోల్ మొబిలిటీ షోలో కంపెనీ ఈ క్రాస్‌ఓవర్‌ను ఆవిష్కరించింది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

కియా తమ 2019 నాటి హబానీరో కాన్సెప్ట్ నుండి ప్రేరణ పొంది ఈ క్రాసోవర్ ను డిజైన్ చేసింది. ఈ కారు వెనుక వైపు ఉన్న సి పిల్లర్స్ (C Pillars) డ్యూయెల్ టోన్ ఫినిష్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ మోడల్ ను కూడా కియా యొక్క 'ఆపోజిట్స్ యునైటెడ్' డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించారు. ఇందులోని సిగ్నేచర్ 'టైగర్ నోస్' గ్రిల్ ను సరికొత్త నీరో కోసం పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇది ఇప్పుడు హుడ్ నుండి క్రింద ఉన్న రగ్గడ్ ఫెండర్ వరకు విస్తరించి ఉంటుంది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

ఇందులో 'హార్ట్‌బీట్' ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తంమీద, కియీ నీరో స్టైలిష్ మరియు బోల్డ్ క్రాస్ఓవర్ లుక్ తో హైటెక్ టూ టోన్ బాడీ కలర్ లో ఉంటుంది. అలాగే, ఈ ఎస్‌యూవీ వెనుకవైపు బూమరాంగ్ ఆకారంలో ఉండే టెయిల్‌లైట్‌ డిజైన్ ఉంటుంది. కొత్త తరం నీరో లోపలి భాగాన్ని కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇది కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును గుర్తుచేసే డాష్‌బోర్డ్ ను కలిగి ఉంటుంది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

కారు లోపల డ్యాష్ బోర్డులో రెండు విభాగాలుగా విభజించబడిన డ్యూయల్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఉపయోగించబడుతుంది. ఈ కారులో ఎలక్ట్రానిక్ గేర్‌షిఫ్ట్ నాబ్ ఉంటుంది, ఇది చూడటానికి గుండ్రటి వాల్యూమ్ కంట్రోల్ డయల్ మాదిరిగా ఉంటుంది. ఓవరాల్ గా క్యాబిన్ లేఅవుట్ చాలా షార్ప్ గా ఉండి, ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది. ఇంకా ఇందులో యాంబియెంట్ లైటింగ్ కూడా ఉంటుంది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

కియా నీరో డ్రైవింగ్ పరంగానే కాకుండా క్యాబిన్ లోపల కూడా పర్యావరణ సాన్నిహిత్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. కియా ఇందులో యూకలిప్టస్ ఆకులతో తయారు చేసిన ఆర్గానిక్ పాలియురేతేన్ మరియు టెక్స్‌టైల్ ఫైబర్‌లో హెడ్‌లైనర్ మరియు సీట్ల కోసం రీసైకిల్ చేసిన వాల్‌పేపర్‌ను లను ఉపయోగించింది. సరికొత్త కియా నీరో "గ్రీన్‌జోన్" డ్రైవింగ్ మోడ్‌ను కూడా పొందుతుంది. ఇది డ్రైవర్ కోరుకున్నప్పుడు స్వయంచాలకంగా హైబ్రిడ్ నుండి పూర్తి ఎలక్ట్రిక్‌ గా మారుతుంది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

కియా మోటార్స్ ఈ కొత్త నీరో క్రాసోవర్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. కానీ, కొత్త నీరో వచ్చే ఏడాది నుంచి BEV, PHEV మరియు Hybrid వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని మాత్రం తెలిపింది. ఈ క్రాస్ఓవర్ యొక్క ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ మరింత ఆసక్తిగా ఉండవచ్చు. ఎందుకంటే, ఇది సమీప భవిష్యత్తులో భారతదేశంలో కియా విడుదల చేయబోయే మోడళ్లలో ఇది కూడా ఒకటి.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

కియా నీరో భారతదేశంలో విక్రయించబడుతున్న హ్యుందాయ్ విక్రయిస్తున్న కోనా ఎలక్ట్రిక్‌కి చాలా దగ్గర పోలిక ఉంటుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఇది మార్కెట్లోకి రానుంది. కొత్త 2022 కియా నీరో 'సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్స్' గా మారడానికి బ్రాండ్ యొక్క వ్యూహంలో అంతర్భాగంగా ఉంటుంది. కొత్త తరం e-Nero మన దేశంలో Kia యొక్క మొదటి EV అవుతుందని భావిస్తున్నారు. దీనిని CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్ లో ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడే అసెంబుల్ చేయవచ్చని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

వచ్చే 2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: కియా మోటార్స్

ఇదిలా ఉంటే, కియా మోటార్స్ 2040 నాటికి అన్ని ప్రధాన మార్కెట్‌లలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించనున్నట్లు ప్రకటించింది. కియా ప్రపంచవ్యాప్తంగా 2045 నాటికి దాని సప్లయ్ చైన్ మరియు మ్యానుఫాక్చరింగ్ నెట్‌వర్క్‌ లో పూర్తిగా 100 శాతం కార్బన్ న్యూట్రాలిటీని (సున్నా కాలుష్య ఉద్ఘారాలను) సాధించాలనే ప్రణాళికలో భాగంగా ఈ ప్రకటన చేసింది.

సరికొత్త కియా నీరో (Kia Niro) క్రాసోవర్ ఆవిష్కరణ.. ఈసారి ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌తో..

అంటే, ఇకపై భవిష్యత్తులో కియా తయారు చేయబోయే మొత్తం కార్లలో ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండబోతున్నాయన్నమాట. రాబోయే ఇరవై ఏళ్ల తర్వాత కియా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తుంది. అంతేకాకుండా, 2040 నాటికి కియా యొక్క ఉత్పత్తి సౌకర్యాలన్నీ కూడా పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడుస్తాయని అలాగే, యూఎస్ఏ, కొరియా, చైనా మరియు భారతదేశంలోని కంపెనీ వ్యాపార విభాగాలు సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తికి మారుతాయని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే కియా తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ కారును అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Most Read Articles

English summary
All new kia niro crossover unveiled with electric powertrain details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X