కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ (Force Motors) గత ఏడాదిన్నర కాలంగా భారత ఆఫ్-రోడ్ వాహన ప్రియులను ఎంతగానో ఊరిస్తూ వచ్చిన కొత్త తరం ఫోర్స్ గుర్ఖా (2021 Force Gurkha) ని కంపెనీ నేడు (సెప్టెంబర్ 28) దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ హార్డ్ కోర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

కొత్తగా వచ్చిన ఫోర్-సీటర్ 2021 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ ఈ విభాగంలో నేరుగా మహీంద్రా థార్ (Mahindra Thar) తో పోటీ పడుతుంది. ఒకవేళ, థార్ కి ప్రత్యామ్నాయంగా మీరు ఈ కొత్త 2021 గుర్ఖా ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఓసారి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. మరి ఈ కొత్త తరం 2021 Force Gurkha యొక్క పూర్తి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

కొత్త తరం 2021 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ దాని మునుపటి తరం మోడళ్లతో పోల్చుకుంటే, చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. అయితే, దాని ఓవరాల్ బాక్సీ టైప్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ఎప్పటిలానే ఉంటుంది. కాకపోతే, ఎక్స్టీరియర్ డిజైన్ ఎలిమెంట్స్ మరియు ఇంటీరియర్ ఫీచర్లలో కంపెనీ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. డీజిల్ ఇంజన్‌ను కూడా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా రీట్యూన్ చేసింది.

కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

2021 Force Gurkha: ఒకే వేరియంట్, ఒకే ధర

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫోర్స్ మోటార్స్ తమ 2021 గుర్ఖా ఎస్‌యూవీని కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే విక్రయిస్తోంది. ఇది ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో సదుపాయాలు కావాలనుకునే వారి కోసం కంపెనీ అధికారిక ఉపకరణాలు (యాక్ససరీస్) ను కూడా విక్రయిస్తోంది. మార్కెట్లో కొత్త 2021 Force Gurkha ధర రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

అదే, మహీంద్రా థార్‌ ధరను గమనిస్తే, మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 12.78 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. థార్ కంటే గుర్ఖా ధర రూ. 81,000 ఎక్కువగా ఉంటుంది. అయితే, థార్ ఎస్‌యూవీలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు మరియు ఆటోమేటిక్, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ, గుర్ఖా విషయంలో పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

2021 Force Gurkha: ఆఫ్-రోడింగ్ సామర్థ్యం

కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా ఉత్తమమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ మెకానికల్ లాక్ డిఫరెన్షియల్ ఉంటుంది. దీని సాయంతో డ్రైవర్ నడిపే టెర్రైన్ ను బట్టి వాహనాన్ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది 35 డిగ్రీల గ్రేడబిలిటీని కూడా కలిగి ఉంటుంది. ఎత్తైన కొండలు, వాలుగా ఉండే రోడ్లను సునాయాసంగా అధిగమించడంలో ఇది సహాయపడుతుంది.

కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

నీటితో నుండి వాగులను దాటడంలో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది 700 మిమీ లోతు ఉండే నీటి ప్రవాహానాన్ని సులువుగా ఎదుర్కోగలదు. వాటర్ వాడింగ్ కోసం ఇందులో ముందు వైపు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ స్నోర్కెల్ కూడా ఉంటుంది. ఇది కంబషన్ లోకి ఫ్రెష్ ఎయిర్ ను పంపడంలో సహకరిస్తుంది. ఇంకా దీని టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కేవలం 5.65 మీటర్ల వ్యాసంలో దీనిని పూర్తిగా టర్న్ చేయవచ్చు.

కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

2021 Force Gurkha: సేఫ్టీ ఫీచర్లు

  • ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగులు (డ్రైవర్, కో-డ్రైవర్)
  • ఫాలో మి హోమ్ అండ్ లీడ్ మి టూ గుర్ఖా
  • ఏబిఎస్ విత్ ఈబిడి
  • రియర్ పార్కింగ్ సెన్సార్స్
  • వన్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్
  • కార్నర్ లైట్
  • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్
  • టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్
  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్
  • ఆల్ మెటల్ బాడీ
  • కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

    2021 Force Gurkha: కంఫర్ట్ ఫీచర్లు

    • టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ పవర్ స్టీరింగ్
    • ఆల్ బ్లాక్ ఇంటీరియర్ క్యాబిన్
    • ప్యాసింజర్స్ అందరి కోసం డెడికేటెడ్ చార్జింగ్ పాయింట్స్
    • ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ లైట్స్
    • 17.78 సె.మీ (7-ఇంచ్) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ
    • 4 స్పీకర్లు
    • నాలుగు కెప్టెన్ సీట్లు
    • రియర్ సీట్లపై ఆర్మ్ రెస్ట్స్
    • డార్క్ గ్రే థీమ్‌తో కూడిన డోర్ ట్రిమ్స్
    • బాటిల్ హోల్డర్లతో కూడిన సెంటర్ కన్సోల్
    • ఫ్రంట్ పవర్ విండోస్
    • 2021 Force Gurkha: సైజు, బ్రేకులు, టైర్లు

      • పొడవు: 4116 మిమీ
      • వెడల్పు: 1812 మిమీ
      • ఎత్తు: 2075 మిమీ
      • వీల్‌బేస్: 2400 మిమీ
      • బూట్ స్పేస్: 500 లీటర్లు
      • కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

        ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో స్టీల్ వీల్స్ మరియు 245/70 R16 ప్రొఫైల్ తో కూడిన ట్యూబ్‌లెస్ రేడియల్ టైర్లను ఉపయోగించారు. బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. ఇవి ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) ను సపోర్ట్ చేస్తాయి.

        కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

        2021 Force Gurkha: ఇంజన్

        ఇదివరకు చెప్పుకున్న కొత్త 2021 ఫోర్స్ గూర్ఖా కేవలం ఒకే ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుండి గ్రహించిన 2.6 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 91 హార్స్ పవర్ శక్తిని మరియు 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 63 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.

        కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

        2021 Force Gurkha: కలర్ ఆప్షన్స్

        కొత్త 2021 Force Gurkha మొత్తం 5 ఆకర్షణీయమైన ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో రెడ్, గ్రీన్, వైట్, ఆరెంజ్ మరియు గ్రే కలర్లు ఉన్నాయి. వీటిలోగ్రీన్ మరియు ఆరెంజ్ కలర్ ఆప్షన్లు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి.

        కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

        2021 Force Gurkha: వారంటీ

        ఫోర్స్ మోటార్స్ కొత్త 2021 గూర్ఖా ఎస్‌యూవీపై 3 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిమీ వారంటీని (ఏది ముందుగా ముగిస్తే అది) అందిస్తోంది. అయితే, దీని ఎక్స్‌టెండెడ్ వారంటీపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఈ ఎస్‌యూవీపై కంపెనీ రోడ్-సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని డీలర్ నుండి తెలుసుకోవచ్చు.

        కొత్త Force Gurkha కొంటున్నారా..? అయితే, ఒక్కసారి ఈ కథనం చదవండి..!

        2021 Force Gurkha: సర్వీస్

        ఈ ఎస్‌యూవీ యొక్క ఇంజన్ ఆయిల్ మొదటి 10,000 కిలోమీటర్లు లేదా వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి 150 రోజులలోపు మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 20,000 కిలోమీటర్లు లేదా 240 రోజులకు ఒక్కసారి ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. గేర్‌బాక్స్, ట్రాన్స్‌ఫర్ కేస్ మరియు ఫ్రంట్ మరియు రియర్ యాక్సిల్ ఆయిల్ విషయానికి వస్తే, ఇది 10,000 కిమీ లేదా 150 రోజుల తర్వాత మొదటిసారి మార్చబడుతుంది. ఆ తర్వాత ప్రతి 40,000 కిమీ లేదా 540 రోజులకు మార్చాల్సి ఉంటుంది.బడుతుంది.

Most Read Articles

English summary
All you need to know about 2021 force gurkha price specs feature safety engine colors warranty
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X