భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో ఆడి ఎ4 సెడాన్‌లో మూడవ ప్రీమియం వేరియంట్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సెడాన్ ధర ప్రారంభ ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త సెడాన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త లగ్జరీ సెడాన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఆడి ఎ4 ప్రీమియం వేరియంట్ ధర రూ. 39.99 లక్షలు కాగా, ప్రీమియం ప్లస్ మోడల్ ధర 43.69 లక్షలు. అయితే ఆడి A4 యొక్క టాప్-స్పెక్ మోడల్ టెక్నాలజీ వేరియంట్ ధర రూ. 47.61 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఆడి A4 సెడాన్ 5 విభిన్న కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మిథోస్ బ్లాక్ మెటాలిక్, నవర్రా బ్లూ మెటాలిక్, టెర్రా గ్రే మెటాలిక్, ఫ్లోరెట్ సిల్వర్ మెటాలిక్ మరియు ఐబిస్ వైట్ కలర్స్. అయితే ఇందులో రెండు ఇంటీరియర్ కలర్ ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఆడి A4 ప్రీమియమ్ సెడాన్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజిన్ 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 188 బిహెచ్‌పి పవర్ మరియు 1,450 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు శక్తిని పంపుతుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

కొత్త ఎంట్రీ-లెవల్ A4 ప్రీమియం లగ్జరీ సెడాన్‌లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు సిగ్నేచర్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఎల్ ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఆటో-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ సెడాన్ కి మంచి దూకుడు రూపాన్ని అందిస్తాయి.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఇక ఆడి A4 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఆడి సెలెక్ట్ ద్వారా ఆఫర్‌లో ఉన్న విభిన్న మోడ్‌ల మధ్య మార్చడానికి ఇది ఉపయోగించవచ్చు. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా అనుమతిస్తుంది. ఇవి వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఇందులో ప్రీమియం సౌండ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా 4-వే అడ్జస్టబుల్ లంబర్ సపోర్ట్‌తో ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రేమ్‌లెస్ మరియు యాంటీ-గ్లేర్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఆడి A4 ప్రీమియం చాలా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఆడి A4 ప్రీమియం అనేది ఆడి యొక్క A4 లగ్జరీ సెడాన్ యొక్క కొత్త ఎంట్రీ-లెవల్ వెర్షన్. A4 ప్రీమియం భారతదేశంలో ఆడికి విజయవంతమైన మరియు గొప్ప అమ్మకాలను అందిస్తుంది అని ఆశిస్తున్నాము. కంపెనీ యొక్క ఈ లగ్జరీ కారుకి దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో త్వరలో తెలుస్తుంది.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఇదిలా ఉండగా ఆడి కంపెనీ ఇటీవల కాలంలోనే ఆడి క్యూ5 ని దేశీయ మార్కెట్లో రూ. 58.93 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలచేసింది. కంపెనీ ఈ కారుని విడుదల చేసిన అతి తక్కువ కాలంలోనే బుకింగ్స్ ఏకంగా 100 యూనిట్లను దాటింది. అంటే మొత్తానికి ఈ SUV ఈ సంవత్సరానికి పూర్తిగా విక్రయించబడింది. కొత్త ఆడి క్యూ5 డెలివరీలు కూడా వెంటనే ప్రారంభమవుతాయి.

భారత్‌లో Audi కంపెనీ కొత్త కార్ లాంచ్ చేసింది.. ధర, వివరాలు ఇక్కడ చూడండి

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్‌ రెండు వేరియంట్‌లు మరియు 5 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి బ్యాచ్ డెలివరీలు పూర్తయిన తరువాత సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ బహుశా 2022 లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అమ్మకాలు తరువాత దశలో మరింత పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే 12 వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో అందించబడుతుంది. ఈ ఇంజన్ 245 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇది ఇంజిన్ యొక్క పవర్ దాని నాలుగు చక్రాలకు పంపుతుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi a4 premium variant launched in india price features details
Story first published: Monday, December 6, 2021, 18:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X