భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి బ్రాండ్ నుండి భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారు 'ఆడి ఇ-ట్రోన్' కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. ఆడి ఇ-ట్రోన్‌ను జులై 22, 2021వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

భారత మార్కెట్లో ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారును రెండు రూపాల్లో విక్రయించనున్నారు. ఇందులో మొదటిది స్టాండర్డ్ వెర్షన్ మరియు రెండవది స్పోర్ట్‌బ్యాక్ వెర్షన్. ఆడి ఇండియా ఈ ఎలక్ట్రిక్ కారును ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేయడం కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు ఆడి ఇండియా షోరూమ్‌లను సందర్శించి ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఆడి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు. రూ.5 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఆడి ఇ-ట్రోన్‌ను బుక్ చేసుకోవచ్చు. వాస్తవానకి ఈ ఏడాది ఆరంభంలోనే ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, దేశంలోని తిరగబెట్టిన కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా, ఈ ప్రయోగం ఆలస్యమైంది.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఆడి ఇ-ట్రోన్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతోంది. విదేశీ మార్కెట్లలో ఈ కారు ఇప్పటికే మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర సుమారు రూ.1.20 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి మరియు జాగ్వార్ ఐ-పేస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఆడి ఇ-ట్రోన్‌కు హైబ్రిడ్ కూప్ సెడాన్ లాంటి డిజైన్ ఇవ్వబడింది. చూడటానికి దీని డిజైన్ పోర్ష్ టేకాన్ మాదిరిగా అనిపిస్తుంది. అధిక వేగం వద్ద వాయు అవరోధాన్ని తగ్గించడానికి ఈ కారుకు ఏరోడైనమిక్ డిజైన్ ఇవ్వబడింది. ఈ కారును తొలిసారిగా 2018 లాస్ ఏంజిల్స్ మోటార్ షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. అప్పటి కాన్సెప్ట్ డిజైన్‌కి, ఇప్పటి ప్రొడక్షన్ వెర్షన్ డిజైన్‌కి పెద్దగా మార్పులు లేవు.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఎక్స్టీరియర్ డిజైన్ పరంగా చూస్తే, ఆడి ఇ-ట్రోన్‌లో ఆక్టాగన్ ఆకారంలో ఉండే పెద్ద సింగిల్ ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్లతో కూడిన షార్ప్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్ లైన్ మరియు రెండు టెయిల్ ల్యాంప్స్‌ను కలుపుతూ ఉన్నట్లుగా అనిపించే పూర్తి-వెడల్పుతో కూడిన ఎల్ఈడి లైట్‌బార్, పెద్ద అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు లోపల రెండు పెద్ద డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్లు ఉండనున్నాయి. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించబడుతాయి. అంతేకాకుండా, ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వాయిస్ కమాండ్ ఫీచర్‌, యాంబియంట్ లైటింగ్, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు సరౌండ్ వ్యూ కెమెరా మొదలైన ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఇక వేరియంట్స్ మరియు వాటి గణాంకాల విషయానికి వస్తే, ఆడి ఇ-ట్రోన్‌ను మూడు వేరియంట్లతో అందించనున్నారు. ఇందులో 50 క్వాట్రో వేరియంట్‌లో 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 312 బిహెచ్‌పి శక్తిని మరియు 540 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన 55 క్వాట్రో మరియు ఎస్ వేరియంట్లు రెండూ 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఎస్ వేరియంట్ గరిష్టంగా 435 బిహెచ్‌పి పవర్‌ను మరియు 808 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బూస్ట్ మోడ్ సాయంతో గరిష్టంగా 503 హెచ్‌పి పవర్‌ను మరియు 973 ఎన్ఎమ్‌ ట్రార్క్‌లను పొందవచ్చు. అలాగే, 55 క్వాట్రో గరిష్టంగా 360 హెచ్‌పి పవర్‌ను మరియు 561 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బూస్ట్ మోడ్ సాయంతో ఇది గరిష్టంగా 408 హెచ్‌పి పవర్ మరియు 664 ఎన్ఎమ్ టార్క్‌లను అందిస్తుంది.

భారత్‌లో ఆడి ఇ-ట్రోన్ బుకింగ్స్ ప్రారంభం, జులై 22న అధికారికంగా విడుదల

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఒకే ఛార్జీపై 441 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని, 150 కిలోవాట్ల డిసి ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో 0-80 శాతం వరకూ ఛార్జ్ చేయవచ్చని ఆడి ఇండియా పేర్కొంది. అదే 11 కిలోవాట్ల ఏసి ఛార్జర్‌ను ఉపయోగించినట్లయితే, 0-80 శాతం చార్జ్ దాదాపు 8.5 గంటలు పడుతుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi e-Tron Bookings Open, India Launch On 22nd July: Features, Specs, Range And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X