లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

భారతదేశంలో లగ్జరీ కార్లపై విధిస్తున్న అధిక పన్నుల కారణంగా, కార్ల విక్రయాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని లగ్జరీ కార్లపై విధించే పన్నుల తగ్గించాలని జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి పేర్కొంది. దేశంలోని లగ్జరీ కార్ల తయారీదారులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం టారిఫ్‌లను తగ్గించాలని కార్ల తయారీదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

లగ్జరీ కార్ల సెగ్మెంట్ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆడి ఇండియా, దేశంలో లగ్జరీ కార్ల వాటా రెండు శాతం కంటే తక్కువేనని, గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది. ఈ విషయంపై ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, "భారత్‌లో మా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. దేశంలో లగ్జరీ కార్ల సెగ్మెంట్ స్తబ్దుగా ఉంది" అని అన్నారు. భారతదేశంలో, ఇతర కార్ల సెగ్మెంట్లు శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, లగ్జరీ కార్ల వార్షిక విక్రయాలు మాత్రం 40,000 యూనిట్లకు మించి పెరగడం లేదని ఆయన అన్నారు.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

కరోనా మహమ్మారి ప్రభావం మరియు సెమీకండక్టర్ చిప్‌ల కొరత కారణంగా, ఈ సంవత్సరం అమ్మకాల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పన్నుల భారం వల్ల ఈ సెగ్మెంట్‌లోని వాహనాల ధరలు కూడా పెరిగి, సామాన్య వినియోగదారులకు అందకుండా పోతున్నాయి. ఫలితంగా, ఈ రకం కార్ల విక్రయాలు కూడా తగ్గముఖం పడుతున్నాయి.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

లగ్జరీ కార్లపై 28 శాతం జిఎస్‌టి

భారతదేశంలో లగ్జరీ కార్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) 28 శాతం వరకు విధించబడుతుంది. ఇదే కాకుండా, సెడాన్‌లపై 20 శాతం మరియు ఎస్‌యూవీ టైప్ కార్లపై 22 శాతం అదనపు సెస్ కూడా విధించబడుతుంది. ఈ విధంగా, లగ్జరీ కార్లపై విధించే వివిధ రకాల పన్నులు అన్నీ కలిపి, కారు అసలు ధరలో 50 శాతం వరకూ ఉంటున్నాయి. అందుకే, భారతదేశంలో లగ్జరీ కార్ల ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

ఈ లెక్క ప్రకారం, ఉదాహరణకు భారతదేశంలో ఏదైనా ఒక లగ్జరీ కారును తయారు చేసేందుకు అయ్యే ఖర్చు సుమారు రూ. 40 లక్షలు అవుతుందని అనుకుంటే, దానిపై ప్రభుత్వం విధించే పన్నులు అదనంగా రూ. 20 లక్షల వరకూ ఉంటున్నాయి. అంటే, ఈ కారు షోరూమ్ కి చేరుకునే సమయానికి దీని ధర రూ. 60 లక్షలు అయిపోతుంది. ఇక షోరూమ్ నుండి స్టమర్ చేతికి చేరే సరికి మరిన్ని పన్నులు కలుపుకొని తడిసి మోపెడైపోతుంది.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

ఈ నేపథ్యంలో, భారతదేశంలో లగ్జరీ కార్లపై ఏకరీతి పన్ను విధానాన్ని రూపొందించాలని ధిల్లాన్ భారత ప్రభుత్వాన్ని కోరారు. మనదేశంలో ఎక్కువ ధరకు విక్రయించబడుతున్న అనేక రకాల కార్లు ఇతర దేశాలలో చాలా తక్కువ ధరకే లభిస్తాయి. లగ్జరీ కార్లపై అత్యధిక పన్నులను విధించే దేశాల్లో మన దేశం కూడా ఒకటి. అధిక వాహన ధర కారణంగా, వినియోగదారులు తమ ప్రీమియం కార్ నుండి లగ్జరీ కారుకి అప్‌గ్రేడ్ చేయకుండా నిరుత్సాహపరుస్తుందని ఆయన చెప్పారు.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

భారతదేశంలో తయారైన లగ్జరీ కార్ల పరిస్థితే ఇలా ఉంటే, పూర్తిగా విదేశాల్లో తయారై భారతదేశానికి దిగుమతి చేసుకోబడుతున్న వాహనాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్ల తయారీ సంస్థలు పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను మనదేశంలో విక్రయించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం, అధిక దిగుమతి సుంఖాలే. మనదేశంలోకి దిగుమతి చేసుకునే విదేశీ కార్లపై 100 శాతనికి పైగా దిగుమతి సుంఖం ఉంటుంది.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

అంటే, విదేశాల్లో కేవలం రూ. 20 లక్షలకే లభించే కారు, మనదేశం చేరుకునే సరికి దాని ధర రూ. 40 లక్షలకు మించిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో లగ్జరీ కార్ తయారీదారులు మనుగడ సాధించడం కష్టంగా మారే అవకాశం ఉంది. మనదేశంలో ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ కంపెనీలు మరో ఫోర్డ్ కంపెనీలా మారి, దేశం విడిచి వెళ్లిపోక మునుపే భారత ప్రభుత్వం మేల్కొని పన్నులను తగ్గిస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

భారత్‌లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం

ఇదిలా ఉంటే, ఆడి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ క్యూ5 (Q5) లో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికే తమ కొత్త 2021 ఆడి క్యూ5 (2021 Audi Q5) ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్ లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆడి ఇండియా డీలర్‌షిప్ కేంద్రాలు మరియు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొత్త 2021 ఆడి క్యూ5 ఎస్‌యూవీ బుక్ చేసుకోవచ్చు.

లగ్జరీ కార్లపై పన్నులను తగ్గించండి మహాప్రభో..: ప్రభుత్వాన్ని కోరిన Audi India

కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ కారును ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు ట్రిమ్ లలో విడుదల చేయనున్నారు. ఈ కొత్త మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో రిఫ్రెష్డ్ స్టైలింగ్‌ని మరియు సరికొత్త ఫీచర్లను మనం ఆశించవచ్చు. ఈ కారును కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో అందించబడుతుందని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi india requests government to reduce taxes on luxury cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X