Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో తిరుగులేని వాహన తయారీ సంస్థగా నిలిచింది. ఈ కంపెనీ ఇప్పటికే అనేక కార్లను విడుదల చేసి మంచి ఆదరణ పొందుతోంది. ఇటీవల కాలంలోనే కంపెనీ ఆడి క్యూ5 కారుని విడుదల చేసింది. అయితే కంపెనీ భారతీయ మార్కెట్లో మరో కొత్త మోడల్‌ ప్రవేశపెట్టనుంది. కంపెనీ ప్రవేశపెట్టనున్న ఈ కొత్త లగ్జరీ కారు గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టే మరో కొత్త మోడల్ ఆడి క్యూ7. ఇది కంపెనీ ప్రవేశపెట్టనున్న తదుపరి మోడల్ కానుంది. ఇప్పుడు కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిని కంపెనీ యొక్క ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ కారు బుకింగ్‌లను ప్రారంభిస్తుంది. అయితే కంపెనీ ఈ కొత్త ఆడి క్యూ7 డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించింది.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

ఆడి క్యూ7 వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ తన ఉనికిని మరింత విస్తరాయించడానికి ఈ కొత్త SUV ని విడుదల చేస్తుంది. కొత్త ఆడి క్యూ7 కారు గ్లోబల్ మార్కెట్‌లో ఆరు విభిన్న వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

ఆడి క్యూ7 యొక్క డిజైన్ మరియు అప్‌డేట్‌ల విషయానికి వస్తే, ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన అప్డేట్స్ లేవనే చెప్పాలి. కానీ ఇందులో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్లిమ్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్, విండోస్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రోమ్ లైన్డ్ డోర్‌లను పొందుతుంది. అంతే కాకూండా ఇందులో మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వెనుక బంపర్‌కు క్రోమ్-టిప్డ్ ఎగ్జాస్ట్ మరియు స్కిడ్ ప్లేట్ కూడా ఉన్నాయి.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

ఇక ఈ ఆడి క్యూ7 యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,063 మిమీ, వెడల్పు 1,970 మిమీ, ఎత్తు 1,741 మిమీ మరియు దీని వీల్ బేస్ 2,995 మిమీ వరకు ఉంటుంది. అయితే ఇది 865 లీటర్ల భారీ బూట్‌స్పేస్‌ను పొందుతుంది. కానీ వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా 2,050 లీటర్ల వరకు విస్తరించవచ్చు.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

సరికొత్త ఆడి క్యూ7 అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే అమ్మకానికి ఉంది, అయితే ఇది స్టాండర్డ్‌గా అనేక కొత్త ఫీచర్లను పొందింది. ఇందులో వెనుక వైపు ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ ORVMలు, అప్‌డేటెడ్ టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

ఇవి మాత్రమే కాకుండా క్యాబిన్ లైటింగ్, 12-వే పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్‌తో సహా మరికొన్ని ఫీచర్లు కూడా అందించబడ్డాయి. అంతే కాకూండా పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్, యాంబియంట్ లైటింగ్‌ను ప్రామాణికంగా పొందుతుంది.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

గ్లోబల్ మార్కెట్‌లో, ఇది ఐదు మరియు ఏడు సీట్ల లేఅవుట్‌లలో అందుబాటులో ఉంది, అయితే రెండు వేరియంట్‌లు భారతదేశంలో అందుబాటులోకి వస్తాయా.. లేదా అనే విషయం ఖచ్చితంగా తెలియదు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో తెలుస్తుంది.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

ఆడి క్యూ7 మోడల్ భారతదేశంలో విడుదలైతే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ SUV 8 స్పీడ్ టిప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. అంతే కాకూండా ఈ SUV క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. దీనికి సంబంధించినా సమాచారం కూడా కంపెనీ అధికారికంగా విడుదల చేయలేదు. ఇది కూడా త్వరలో అందుబాటులో ఉటుంది.

Audi కంపెనీ నుంచి భారత్‌కు రానున్న కొత్త కార్.. ఇదే; చూసారా..?

ఆడి కంపెనీ యొక్క క్యూ7 కారు ప్రపంచ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందింది. ఇది మంచి అమ్మకాలతో మార్కెట్లో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైతే ఎలాంటి ఆదరణ పొందుతుంది, మరియు ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయాలు కంపెనీ ఈ కొత్త SUV ని లాంచ్ చేసిన తరువాత తెలుస్తాయి. అంతే కాకుండా దీని ధర కూడా విడుదల సమయంలోనే తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi q7 production starts india launch soon details
Story first published: Friday, December 10, 2021, 18:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X