భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 లకు చేరువలో ఉంది. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

ప్రస్తుతం మన మార్కెట్లో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండి, సిఎన్‌జి ఇంధనంతో నడిచే కార్లు చాలానే ఉన్నాయి. సిఎన్‌జి ఇంధనం తక్కువ ధరకు లభించడమే కాకుండా, పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే అత్యధిక మైలేజీని కూడా అందిస్తాయి. అంతేకాదు, సిఎన్‌జి ఇంధనంతో నడిచే కార్లు పర్యావరణానికి సురక్షితమైనవి. మరి మన మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ సిఎన్‌జి కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

మారుతి సుజుకి ఆల్టో 800:

మారుతి సుజుకి ఆల్టో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు. కంపెనీ ఈ కారును పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడా విక్రయిస్తోంది. ఈ చిన్న కారు 1 కిలో సిఎన్‌జితో 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్-సిఎన్‌జి ధరలు రూ.4.56 లక్షల నుంచి రూ.4.60 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. మారుతి ఆల్టో సిఎన్‌జిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, కీలెస్ ఎంట్రీ, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో:

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో లభిస్తున్న మరొక చిన్న సిఎన్‌జి కారు ఎస్-ప్రెస్సో. ఇది కంపెనీ లైనప్‌లో కొత్తగా వచ్చి చేరిన మోడల్. ఈ కారు పెట్రోల్‌తో పాటుగా సిఎన్‌జి ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 1 కిలో సిఎన్‌జితో 31.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మారుతి ఎస్-ప్రెస్సో ఆల్టో కంటే కాస్తంత పెద్దగా, స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

ఈ కారు చూడటానికి మైక్రో ఎస్‌యూవీ మాదిరిగా అనిపిస్తుంది మరియు అనేక ఫీచర్లతో లభిస్తుంది. ఈ మోడల్‌లో నాలుగు సిఎన్‌జి వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో వీటి ధరలు రూ.4.96 లక్షల నుండి రూ.5.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

మారుతి సుజుకి సెలెరియో:

మారుతి సుజుకి నుండి లభిస్తున్న మూడవ ఎంట్రీ లెవల్ సిఎన్‌జి కారు ఈ సెలెరియో. మారుతి సుజుకి సెలెరియో పైన పేర్కొన్న రెండు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని సిఎన్‌జ వెర్షన్ కేజీకి 30.47 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. మారుతి సెలెరియో సిఎన్‌జి వేరియంట్‌లో కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి ధరలు రూ.5.84 లక్షల నుంచి రూ.5.90 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)లో ఉంటాయి. ఇందులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసి, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, సింగిల్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

హ్యుందాయ్ శాంత్రో:

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ శాంత్రోలో కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను అందిస్తుంది. ఈ కారు కేజీకి 30 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ శాంత్రా సిఎన్‌జి మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రెండు వేరియంట్లలో లభిస్తుంది.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

మార్కెట్లో హ్యుందాయ్ శాంత్రో ధరలు రూ.5.92 లక్షల నుండి రూ.6.06 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, రియర్ పార్కింగ్ కెమెరా మరియు ఫీచర్లు లభిస్తాయి. ఇంకా ఇందులో సింగిల్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్:

మారుతి సుజుకి నుండి అత్యంత పాపులర్ అయిన వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కూడా పెట్రోల్‌తో పాటుగా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో లభిస్తుంది. మార్కెట్లో ఈ టాల్ బాయ్ కారు యొక్క సిఎన్‌జి వేరియంట్ల ధరలు రూ.5.60 లక్షల నుంచి రూ.5.67 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ కారు కేజీ సిఎన్‌జికి 32.52 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో లభించే స్టాండర్డ్ ఫీచర్లలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఏసి, నాలుగు పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ విత్ ఈబిడి మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

హ్యుందాయ్ ఔరా:

హ్యుందాయ్ నుండి లభిస్తున్న మరొక సిఎన్‌జి మోడల్ ఔరా. హ్యుందాయ్ ఔరా ఒక 5-సీటర్ సెడాన్. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో లభిస్తుంది. మార్కెట్లో హ్యుందాయ్ ఔరా సిఎన్‌జి ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.52 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే టాప్ సిఎన్‌జి కార్లు

ఈ కారులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ ఏసి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉంటాయి.

Most Read Articles

English summary
Best Affordable CNG Cars In India; Maruti Alto, S-presso, Wagonr, Hyundai Santro And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X