మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, ప్రారంభ దశలో మారుతి సుజుకి తయారు చేయబోయే ఎలక్ట్రిక్ కార్లు కేవలం వాణిజ్య వినియోగం కోసం మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, తాజాగా మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్లకు ఓ జాక్‌పాట్ ఆఫర్ వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ రైడ్ హెయిలింగ్ కంపెనీ అయిన బ్లూస్మార్ట్ మొబిలిటీ (BluSmart Mobility) రాబోయే సంవత్సరాల్లో భారీ ప్రాజెక్ట్‌ల శ్రేణిని ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ వచ్చే 2025 నాటికి, తన ఫ్లీట్ మరియు కార్యకలాపాలను విస్తరించడానికి సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ వద్ద ప్రస్తుతం ఉన్న 685 కార్లను రాబోయే సంవత్సరాల్లో 1 లక్షకు పైగా వాహనాలకు అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

ప్రస్తుతం, భారతదేశంలో ఈవీ ఫోర్-వీలర్ విభాగం శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో బ్లూస్మార్ట్ మొబిలిటీ కూడా ఈ విభాగంలో తన పాదముద్రను బలంగా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, మారుతి సుజుకి సంస్థ నుండి దాదాపు 10,000 యూనిట్ల వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది. అయితే, కంపెనీ ఇందులో షరతు విధించింది.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

బ్లూస్మార్ట్ మొబిలిటీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అన్మోల్ సింగ్ జగ్గీ తమ ఫ్లీట్ కోసం సరసమైన మరియు ఆమోదయోగ్యమైన ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారు. మారుతి సుజుకి యొక్క వ్యాగన్ఆర్ వంటి మోడళ్ల కోసం కంపెనీ వెతుకుతున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.6 లక్షల రేంజ్ లభిస్తే దాదాపు 10,000 యూనిట్లకు చెక్కు రాసేందుకు కూడా సిద్ధమని జగ్గీ తెలిపారు.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

మారుతి సుజుకి గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలో తమ వ్యాగన్ఆర్ ఈవీ (ఎలక్ట్రిక్ వెర్షన్ వ్యాగన్ఆర్) కారును పరీక్షిస్తోంది. అయితే, మారుతి సుజుకి 2025 లోపు తమ వ్యాగన్ఆర్ ఈవీని విడుదల చేయాలని యోచిస్తోందని, వీటి కంటే ముందుగా CNG మరియు ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుందని కంపెనీ ఇటీవల ప్రకటించింది. మరోవైపు బ్లూస్మార్ట్ 2021 ఆర్థిక సంవత్సరాన్ని భారీ ప్రణాళికలతో ముగించాలని చూస్తోంది.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

ఇందులో భాగంగా, కంపెనీ టాటా మోటార్స్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ భాగంగా, టాటా మోటార్స్ నుండి బ్లూస్మార్ట్ మొబిలిటీ దాదాపు 3,500 ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం, భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లుగా ఉన్న టిగోర్ (Tigor EV) మరియు నెక్సాన్ ఈవీ (Nexon EV) లను బ్లూస్మార్ట్ కొనుగోలు చేయాలని చూస్తోంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కార్ల ధరలు సుమారు రూ. 12 లక్షల నుండి రూ.14 లక్షల రేంజ్ లో ఉన్నాయి.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్లీట్ విభాగంలో తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్లూస్మార్ట్ మొబిలిటీ మరింత సరసమైన లేదా పైన తెలిపిన వాటి కంటే సగం ధర కిలగిన ఎలక్ట్రిక్ వాహనాల కోసం వెతుకుతోంది. బ్లూస్మార్ట్ మొబిలిటీ దేశంలోని మరిన్ని నగరాల్లో తమ ఈవీ సేవలను అందించేందుకు భారీ నిధుల సేకరణ ప్రణాళికను చేపట్టింది. రాబోయే కొద్ది నెలల్లో, బ్లూస్మార్ట్ మరో రెండు టైర్ 1 నగరాల్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

ప్రస్తుతం, సాంప్రదాయ ఫ్లీట్ కార్ మార్కెట్ పెద్ద సంఖ్యలో సరసమైన కంబషన్ ఇంజిన్ ఆధారిత వాహనాలను కలిగి ఉంది, వీటిలో ఎక్కువ భాగం CNGతో నడిచే వాహనాలను ఉన్నాయి. టైర్ 1 నగరాల్లో సిఎన్‌జిల లభ్యత దృష్ట్యా వీటిని ఆపరేట్ చేయడం సులభం. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పరిస్థితి మరోలా ఉంటుంది. దేశంలో ఈవీల కోసం తగినంత ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మరియు ఈవీలు ఆఫర్ చేసే రేంజ్ పట్ల ఆందోళన కలిగి ఉండటం ఇప్పటికీ ఒక ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

అయితే, వ్యాపార సంభావ్యత పరంగా, ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లను దాదాపు రూ. 6 లక్షల ధర వద్ద కొనుగోలు చేయగలిగితే, బ్లూస్మార్ట్ తన వినియోగదారుల నుండి కిమీకి 10 నుండి 12 రూపాయల వరకు వసూలు చేస్తుంది. అదే EVని దాదాపు రూ. 12 లక్షలకు కొనుగోలు చేస్తే, కిలోమీటరుకు రూ. 17 నుండి రూ. 19 వరకూ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇది క్యాబ్ అగ్రిగేటర్‌లు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలకు వసూలు చేసే దానికంటే సమానం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

అంతేకాకుండా, ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయటం వలన వాటికి చెల్లించే EMIలు ఎక్కువగా ఉంటాయి మరియు ఇది వారి వ్యాపారానికి ఆటంకం కలిగిస్తుంది. ఢిల్లీ వంటి నగరాల్లో బ్లూస్మార్ట్ మొబిలిటీకి విశేష ఆదరణ లభిస్తోంది. పర్యావరణ వ్యవస్థను మరింత పునరుద్ధరించడంతోపాటు పర్యావరణాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు బ్లూస్మార్ట్ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. పర్యావరణ కోసం పాటు పడటంలో తమ వంతు కృషిగా కంపెనీ గత సంవత్సరం ఓ రిఫరల్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది.

మారుతి సుజుకి నుండి 10,000 యూనిట్ల WagonR ఎలక్ట్రిక్ కార్లు కొంటాం.. కానీ ఒక్క షరతు: BluSmart

ఈ రిఫరల్ ప్రోగ్రామ్‌లో బ్లూస్మార్ట్ కస్టమర్లు అందుకున్న ప్రతి రిఫరల్ కోసం కంపెనీ ఒక చెట్టును నాటింది. కంపెనీ యొక్క ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లీట్ సాదారణ ICE వాహనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్, పిఎమ్ 2.5 మరియు పిఎమ్ 5 వంటి ఉద్గారాలను నిరోధిస్తుంది. దేశంలో మహిళల కోసం కంపెనీ ఇటీవల మహిళా డ్రైవర్లను కూడా చేర్చుకుంది. అయితే, వారి భద్రతా కారణాల దృష్ట్యా, కంపెనీ వారికి పగటిపూట మాత్రమే ఎనిమిది గంటల అద్దె వ్యవధిని అందిస్తుంది. బ్లూస్మార్ట్ తన మొదటి సంవత్సరంలో 500 మంది మహిళా డ్రైవర్లను జోడించాలని యోచిస్తోందని మరియు మొత్తం డ్రైవర్-పార్టనర్ బేస్‌లో 50 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Blusmart is ready to buy 10000 wagonr evs from maruti suzuki but on one condition details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X