BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో రోజురోజుకి అప్డేటెడ్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఎక్కువ అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్న వాహనాలనే కొనుగోలుదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ BMW దేశీయ మార్కెట్లో కొత్త కారుని విడుదల చేసింది. ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW India దేశీయ విపణిలో BMW 3 Series Gran Limousine Iconic Edition(బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఐకానిక్ ఎడిషన్) విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి 330Li మరియు 320Ld వెర్షన్స్. వీటి ధరలు వరుసగా రూ. 53.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 54.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ వీటి కోసం బుకింగ్స్ ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు BMW ఇండియా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోచ్చు.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW ఈ కొత్త ఎడిషన్ స్థానికంగా చెన్నైలోని BMW గ్రూప్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడుతుంది. లాంగ్-వీల్‌బేస్ గ్రాన్ లిమోసిన్ ఐకానిక్ ఎడిషన్ పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఎడిషన్‌గా BMW 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ శ్రేణిలో చేర్చబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW 3 Series Gran Limousine Iconic Edition దాని విభాగంలో పొడవైన, అతిపెద్ద మరియు అత్యంత సౌకర్యవంతమైన కారుగా ఉండబోతోందని మరియు ఇది కేవలం భారతీయ మార్కెట్ కోసం మాత్రమే ప్రవేశపెట్టబడిందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఎడిషన్ అద్భుతమైన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

3 Series Gran Limousine Iconic Edition యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఐకానిక్ గ్లో కిడ్నీ షేప్ గ్రిల్ ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్ ఫిలమెంట్ కూడా ఒకటి ఉంటుంది. ఇది కాకుండా, LED హెడ్‌లైట్లు, L- ఆకారపు LED టెయిల్‌లైట్‌లు మరియు రెండు పెద్ద ఎగ్జాస్ట్‌లు వంటి ఇతర అంశాలు దాని ప్రామాణిక మోడల్ నుండి తీసుకోబడ్డాయి.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో వెర్నాస్కా లెదర్ అపోల్స్ట్రే, రివర్స్ అసిస్ట్ మరియు యాంబియంట్ లైటింగ్‌తో పార్కింగ్ అసిస్ట్ ఫీచర్లను కూడా పొందుతుంది. అంతే కాకుండా ఇందులో క్రిస్టల్ గేర్ షిఫ్ట్ నాబ్ మరియు రియర్ సీట్ హెడ్‌రెస్ట్ కుషన్ ఫీచర్ కూడా దాని ఇంటీరియర్‌లో ఇవ్వబడింది.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఈ కొత్త BMW కారు స్టీరింగ్ వీల్ వెనుక 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, మరియు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో డాష్‌బోర్డ్‌లోని సెంటర్ కన్సోల్ కోసం 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW 3 Series Gran Limousine ఐకానిక్ ఎడిషన్ (330Li వేరియంట్) 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 258 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును కేవలం 6.2 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇక రెండవ వేరియంట్ అయిన BMW 320Ld గ్రాన్ లిమోసిన్ ఐకానిక్ ఎడిషన్ వేరియంట్ 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.6 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ రెండు వేరియంట్లని రెండు ఇంజిన్లు 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

BMW నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW 3 Series Gran Limousine Iconic Edition దాని విభాగంలో Audi A4, Mercedes-Benz C-class, Volvo S60 మరియు Jaguar XE వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో విడుదలైన కొత్త BMW ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Bmw 3 series gran limousine iconic edition launched price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X