Just In
- 27 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 48 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
BMW నుంచి మరో కొత్త సెడాన్ వచ్చేసింది.. ధర రూ. 66.30 లక్షలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ BMW (బీఎండబ్ల్యూ) భారతీయ మార్కెట్లో కొత్త BMW 530i M Sport 'Carbon Edition' (బీఎండబ్ల్యూ 530ఐ ఎమ్ స్పోర్ట్ 'కార్బన్ ఎడిషన్') ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త సెడాన్ ధర రూ. 66.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ కొత్త సెడాన్ కోసం బుకింగ్‌లను 2021 అక్టోబర్ 21 నుంచి ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ఈ సెడాన్ ని అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త BMW కారుని కంపెనీ చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడుతోంది. కొత్త BMW 530i M స్పోర్ట్ 'కార్బన్ ఎడిషన్' చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది డార్క్ బ్లాక్ కార్బన్ ఫైబర్ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్, స్లిమ్ ఎయిర్‌డ్యామ్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మొదలైనవి ఇవ్వబడ్డాయి.
బీఎండబ్ల్యూ 530ఐ ఎమ్ స్పోర్ట్ 'కార్బన్ ఎడిషన్' డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, హుడ్ మరియు డోర్ ప్యానెల్‌లపై క్రీజ్‌లు ఇవ్వబడ్డాయి. కారు యొక్క ORVM మిర్రర్ క్యాప్ మరియు రియర్ స్పాయిలర్ కార్బన్ ఫైబర్ మెటీరియల్ నుండి తయారు చేయబడ్డాయి. అంతే కాకుండా ఈ సెడాన్ 18 ఇంచెస్ జెట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. కావున ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
కొత్త BMW కార్బన్ ఎడిషన్ అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ కూడా పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ పుల్లీ డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో 3D నావిగేషన్‌తో కూడిన BMW ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వబడింది.
ఇక ఈ కొత్త సెడాన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీతో 2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 252 బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగవంతం అవుతుంది.
BMW 5 సిరీస్ భారతదేశంలో మొత్తం మూడు ట్రిమ్‌లలో అందించబడుతోంది. ఇందులో 530ఐ ఎమ్ స్పోర్ట్, BMW 530d M స్పోర్ట్ మరియు BMW 520d లగ్జరీ లైన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.
ఈ కొత్త సెడాన్ అత్యాధునిక సాంకేతికత రిమోట్-కంట్రోల్ పార్కింగ్, రివర్సింగ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్, BMW వర్చువల్ అసిస్టెంట్, BMW సిగ్నెల్ కంట్రోల్ మరియు 360 ° సరౌండ్-వ్యూ కెమెరా వంటి మల్టిపుల్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
అంతే కాకుండా ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అనేక ఫంక్షన్లను యాక్సెస్ చేయడానికి స్మార్ట్‌ఫోన్ కనెక్షన్ పొందుతుంది. ఇందులో వూఫర్లతో కూడిన హై-ఎండ్ 16 స్పీకర్ సిస్టమ్ అన్ని సీట్లలో ఆకట్టుకునే ఆడియో అనుభవాన్ని అందించే విధంగా ఉంటాయి.
BMW 530i M స్పోర్ట్ 'కార్బన్ ఎడిషన్' కోసం కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నాలుగు సంవత్సరాల తర్వాత హామీతో కూడిన బైబ్యాక్ మరియు సౌకర్యవంతమైన ఎండ్-ఆఫ్-టర్మ్ ఆప్సన్ కూడా అందిస్తుంది. ఇవన్నీ కూడా సౌకర్యవంతమైన ఆర్థిక పరిష్కారాలను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రూపొందించవచ్చు
ఈ కొత్త సెడాన్ మరింత డ్రైవింగ్ ఆనందం కోసం, స్టీరింగ్ వీల్ ప్యాడిల్ షిఫ్టర్లు మరియు బ్రేకింగ్ ఫంక్షన్‌తో క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ స్విచ్‌తో ఎంచుకున్న మోడ్‌ను బట్టి డ్యాంపర్ రెస్పాన్స్ సెట్టింగ్‌లు మారుతూ ఉంటాయి, ఇది డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా డ్రైవర్ వివిధ మోడ్ల మధ్య ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇందులో స్పోర్ట్, స్పోర్ట్+, కంఫర్ట్, ఎకో ప్రో మరియు అడాప్టివ్ అనే డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి.
కొత్త BMW సెడాన్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్ మరియు కార్నర్ బ్రేక్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ మరియు క్రాష్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంటు కూడా ఉన్నాయి.