బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

ప్రముఖ వాహన తయారీదారులందరూ ఇప్పటికీ మార్కెట్లో తమ బ్రాండ్ యొక్క వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన లైనప్‌లో ఎంచుకున్న మోడళ్ల ధరలను పెంచినట్లు అధికారికంగా తెలిపింది.

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

బిఎండబ్ల్యు కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, కంపెనీ తన 3 సిరీస్, 2 సిరీస్ గ్రాన్ కూపే, ఎక్స్ 1, ఎక్స్ 3, ఎక్స్ 4, ఎక్స్ 5 మరియు ఎక్స్ 7 ధరలను పెంచినట్లు తెలిసింది. ఈ ధరలు త్వరలో అమల్లోకి వస్తాయి. ఇప్పుడు కంపెనీ యొక్క ఈ సిరీస్ కార్ల ధరలు కింద గమనించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

బవేరియన్ కార్ల తయారీ సంస్థ యొక్క బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ సెడాన్, మొదటిసారిగా కంపెనీ దీని ధరను పెంచింది. ఈ సిరీస్ లో దాని 220 డి స్పోర్ట్‌లైన్ మరియు 220 ఐఎమ్ స్పోర్ట్ ధరలను వరుసగా రూ. 80,000 మరియు రూ. 60,000 పెంచింది.

MOST READ:కరోనా కాటుకు బలైపోయిన మహిళను బైక్‌పై తరలించిన హృదయ విషాద గాథ.. ఎక్కడంటే?

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

అది మాత్రమే కాకుండా కంపెనీ ఇటీవల ప్రారంభించిన 220i స్పోర్ట్ ట్రిమ్‌ను దాని పరిచయ ధర వద్దనే ఉంచారు. అయితే దీని ధరను పెంచలేదు. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ అప్షన్లలో విక్రయించబడుతుంది. ఇందులో దాని పెట్రోల్ వేరియంట్లయిన 330ఐ స్పోర్ట్ మరియు 330ఐఎమ్ స్పోర్ట్ ధరలను వరుసగా 1,00,000 మరియు 60,000 రూపాయలు పెంచారు.

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

అదే సమయంలో, దాని 320 డి లగ్జరీ వేరియంట్ ధరను ఇప్పుడు రూ. 60,000 పెంచారు. ఈ సంవత్సరం ప్రారంభంలో 320 డి స్పోర్ట్ ట్రిమ్ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి తొలగించబడింది. బీఎండబ్ల్యూ కంపెనీ బేబీ ఎస్‌యూవీ అని పిలువబడే బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1, దాని ఎస్‌డ్రైవ్ 20 ఐ స్పోర్ట్ఎక్స్ మరియు ఎస్‌డ్రైవ్ 20 ఐ ఎక్స్‌ఎల్ ధరలను రూ .1,30,000 మరియు రూ .90,000 పెంచింది.

MOST READ: సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్‌లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

ఇందులో దాని డీజిల్ ఇంజిన్ వేరియంట్ SRD20i Xline ధరను 1,10,000 రూపాయలు పెంచగా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3 యొక్క ఎక్స్‌డ్రైవ్ 30 ఐ స్పోర్ట్ఎక్స్ ధరను రూ. 1,00,000, ఎక్స్‌డ్రైవ్ 30 ఐ లగ్జరీ లైన్ ధరను రూ. 90,000 వరకు పెంచారు. ఇందులోని ఎక్స్‌డ్రైవ్ 20 డి లగ్జరీ లైన్ ధరను 1,20,000 రూపాయలు పెంచారు.

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

ఇప్పుడు కంపెనీ యొక్క మరో ఎస్‌యూవీ అయిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 4 విషయానికి వస్తే, దాని ఎక్స్‌డ్రైవ్ 30 ఐ స్పోర్ట్ ఎక్స్ వేరియంట్ ధరను రూ. 80,000 కు పెంచారు మరియు ఎక్స్‌డ్రైవ్ 30 డిఎం స్పోర్ట్ ఎక్స్ వేరియంట్ ధరను రూ. 1,00,000 పెంచారు.

MOST READ:రూ. 10 కోట్ల విలువైన కారులో ప్రయాణించిన యూట్యూబర్ ఏం చెప్పాడంటే?

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ 5 ఎస్‌యూవీ యొక్క రెండు డీజిల్ వేరియంట్ల ధరను రూ .1,00,000 వరకు పెంచగా, ఎక్స్‌డ్రైవ్ 40 ఐ స్పోర్ట్ ధర రూ .60,000 పెంచారు. ఇవన్నీ ధరల విషయంలో కొంత పెరుగుదల కనిపించినప్పటికీ, కంపెనీ యొక్క ఎక్స్7 ధర భారీగా పెరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ కార్ల కొత్త ధరలు వచ్చేశాయ్.. చూసారా..!

బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఎక్స్ ధర విషయానికి వస్తే, ఇందులో ఎక్స్‌డ్రైవ్ 40 ఐఎం స్పోర్ట్ ధరను రూ. 2.5 లక్షలకు పెంచగా, డిపిఇ, డిపిఇ సిగ్నేచర్ డీజిల్ వేరియంట్ల ధరలను వరుసగా రూ. 2.90 లక్షలు, రూ. 3.80 లక్షలు పెంచారు. ధరల పెరుగుదల తరువాత కంపెనీ యొక్క అమ్మకాలు ఏవిధంగా ఉంటాయో వేచి చూడాలి.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

Most Read Articles

English summary
BMW Cars Price Hiked For India. Read in Telugu.
Story first published: Thursday, April 29, 2021, 16:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X