భారత్‌లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్ లాంచ్; ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్‌ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 33.90 లక్షలు. బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్ కంపెనీ యొక్క 2 సిరీస్ గ్రాన్ కూపే యొక్క స్పోర్ట్ పెట్రోల్ వెర్షన్. ఈ కొత్త 220ఐ స్పోర్ట్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం..

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్ ట్విన్-టర్బో 2.0-లీటర్ ఫోర్ సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 1350 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 188 బిహెచ్‌పి పవర్ మరియు 4600 ఆర్‌పిఎమ్ వద్ద 280ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది. ఈ కారు కేవలం 7.1 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్ లో ఎకో ప్రో, కంఫర్ట్ మరియు స్పోర్ట్‌తో సహా మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో పాడిల్ షిఫ్టర్స్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా కంపెనీ ఉపయోగించింది. ఈ కారు వాహనదారునికి చాలా సమర్థవంతమైన కారు, ఎందుకంటే ఇది చాలా ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 150 కి.మీ మైలేజ్ అందించే టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెహికల్.. వివరాలు

ఈ సెడాన్ యొక్క బాహ్య రూపకల్పన విషయానికి వస్తే, ఇందులో నాలుగు ఫ్రేమ్‌లెస్ డోర్స్, పుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, బ్రాండ్ యొక్క సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, ఎల్‌ఈడీ టైల్ లైట్స్ మరియు 10-స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైట్, మెల్బోర్న్ రెడ్, మరియు స్టార్మ్ బే వంటి నాలుగు కలర్స్ లో లభిస్తుంది. వినియోగదారులు సెన్సాటెక్ ఓస్టెర్ బ్లాక్ మరియు సెన్సాటెక్ బ్లాక్ వంటి రెండు అపోల్స్ట్రే ఆప్సన్స్ నుంచి ఎంచుకోవచ్చు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డి లగ్జరీ సెడాన్ రివ్యూ.. లేటెస్ట్ ఫీచర్స్ & వివరాలు

ఇక ఈ కొత్త సెడాన్ యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, బిఎమ్‌డబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ ప్లస్ టెక్నాలజీతో 5.1 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 220 ఐలో ఆరు ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

MOST READ:నువ్వా నేనా అంటూ జరిగిన 2021 రెడ్ బుల్ ఏస్ రేస్ హైలెట్స్ & ఫలితాలు.. వచ్చేశాయ్

బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ ఆఫర్. ఈ సెడాన్ లోపల అనేక ఫీచర్స్ ఉన్నాయి. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220 ఐ స్పోర్ట్స్ భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ మరియు రాబోయే ఆడి ఎ 3 లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
BMW 220i Sport Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X