భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. అదేంటో తెలుసా?

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థల్లో ఒకటి బిఎండబ్ల్యు (BMW). బిఎండబ్ల్యు కంపెనీ దేశీయ మార్కెట్లో అనేక ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టి మంచి అమ్మకాలతో మంచి ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడానికి భారతదేశంలో వచ్చే 6 నెలల్లో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

బిఎండబ్ల్యు కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఆల్-ఎలక్ట్రిక్ SUV అయిన iX ని వచ్చే ఒక నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 నెలల కాలంలో ఆల్-ఎలక్ట్రిక్ మినీ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విడుదల చేస్తుంది. దీని తరువాత, ఎలక్ట్రిక్ సెడాన్ BMW i4 ఆరు నెలల్లో విడుదల చేయబడుతుంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ సంవత్సరం భారతదేశంలో 25 కొత్త ఉత్పత్తులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

దీని గురించి బిఎండబ్ల్యు గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ మరియు సీఈఓ, విక్రమ్ పవా మాట్లాడుతూ, రాబోయే 180 రోజుల్లో (6 నెలల్లో) మేము భారతదేశంలో పూర్తి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తాము. దీనికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. రానున్న 30 రోజుల్లో మేము పూర్తి ఎలక్ట్రిక్ SUV అయిన BMW iX ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాము.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

అదే విధంగా రానున్న మరో మూడు నెలల కాలంలో మేము మినీ ఎలక్ట్రిక్‌ను లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నాము. అంతే కాకుండా 6 నెలల్లో మేము మా మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ i4 ని విడుదల చేస్తాము. కంపెనీ ఇంతకు ముందు తెలిపిన విధంగానే రానున్న రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే భారతీయ మార్కెట్ కి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, అన్నారు.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

కంపెనీ మొదట విడుదల చేయనున్న iX అనేది కంపెనీ ఫ్లాగ్‌షిప్ యొక్క ఎలక్ట్రిక్ SUV. ఇది పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరుల నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌ను ఉపయోగించి తయారు చేయబడింది. రీసైకిల్ వస్తువులతో తయారు చేయబడిన ఈ కారులో ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

బిఎండబ్ల్యు iX ముందు మరియు వెనుక చాసిస్ ల కోసం రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చింది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 6.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు వినియోగాన్ని మరింత సులభతరం చేయడానికి, కంపెనీ ప్రతి కారుతో హోమ్ ఛార్జర్ కిట్‌ను కూడా అందిస్తుంది.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

కంపెనీ అందించే ఈ హోమ్ ఛార్జింగ్ కిట్ 11 kW AC ఛార్జర్ అవుతుంది. ఇది కారు బ్యాటరీని సుమారు 7 గంటల్లో 100 శాతానికి ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జర్‌ని ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కడైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కావున వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

ఇది మాత్రమే కాకుండా, కంపెనీ భారతదేశంలోని మరో 35 నగరాల్లో విస్తరించి ఉన్న తన డీలర్‌షిప్ మరియు సర్వీస్ నెట్‌వర్క్‌లో ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. కంపెనీ డీలర్‌షిప్‌లలో వినియోగదారులకు 50kW DC ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంచబడుతుంది. దేశంలోని ప్రతి నగరంలో BMW యొక్క ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు ఛార్జింగ్ సౌకర్యాలను అందించడానికి భారతదేశంలోని ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లతో BMW భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

BMW యొక్క i4 సెడాన్ ఉత్పత్తి ఇప్పటికే, గత నెల చివరి వారం నుండి జర్మనీలోని మ్యూనిచ్ ప్లాంట్‌లో ప్రారంభమయ్యింది. BMW యొక్క ఈ ప్లాంట్ 100 సంవత్సరాల కంటే పాతది మరియు ఇది 3 సిరీస్ సెడాన్ మరియు టూరింగ్, M3 మరియు 4 సిరీస్ గ్రాన్ కూపేలను కూడా ఉత్పత్తి చేస్తుంది.

నివేదికల ప్రకారం BMW i4 సెడాన్ మూడు పవర్ వేరియంట్‌లలో అందించబడుతుంది. ఇందులో eDrive35, eDrive40 మరియు M50 వేరియంట్‌లు ఉంటాయి. బిఎమ్‌డబ్ల్యూ i4 ఎలక్ట్రిక్ సెడాన్ ఒక ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 590 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఇది 530 బిహెచ్‌పి పవర్ అందించగలదు. ఈ కారు కేవలం 4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం అరకు వేగవంతం అవుతుంది.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

ఇటీవల కాలంలో BMW చాలా వేగంగా తన ఉనికిని విస్తరిస్తుంది. ఇందులో భాగంగానే మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ భారతదేశంలో 25 కార్లను విడుదల చేసే ప్రణాళికలో భాగంగా కంపెనీ ఈ నెలలో BMW 220i M స్పోర్ట్ బ్లాక్ షాడో ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ సెడాన్ భారతదేశంలో రూ. 43.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయబడింది. కంపెనీ ఈ కొత్త BMW 220i M స్పోర్ట్ బ్లాక్ షాడోను ఆల్పైన్ వైట్ (నాన్-మెటాలిక్) మరియు బ్లాక్ సఫైర్ (మెటాలిక్) అనే రెండు రంగుల ఎంపికలలో విడుదల చేసింది.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

కొత్త BMW 220i M స్పోర్ట్ బ్లాక్ షాడో అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో హై-గ్లోస్ బ్లాక్ మెష్ ప్యాటర్న్ M ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ వింగ్ మిర్రర్స్ మరియు స్పోర్టీ హై గ్లోస్ రియర్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్లలో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 220ఐ బ్లాక్ షాడో ఎడిషన్ లో ఎలక్ట్రికల్ మెమరీ ఫంక్షన్ తో కూడిన స్పోర్ట్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్, ఇల్యూమినేటెడ్ ట్రిమ్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు సంజ్ఞ నియంత్రణ (గెశ్చర్ కంట్రోల్) తో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ వ్యూ కెమెరాతో కూడిన పార్కింగ్ అసిస్టెంట్‌ మరియు రివర్సింగ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్ కోసం BMW మైండ్ బ్లాయిన్ ప్లాన్.. అదేంటో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ 220ఐ బ్లాక్ షాడో ఎడిషన్ కారులో 2.0 లీటర్, 4 సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 189 బిహెచ్‌పి శక్తిని మరియు 1350-4600 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 7.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

Most Read Articles

English summary
Bmw india to launch 3 electric vehicles in next six months details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X