భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎండబ్ల్యు (BMW) నిన్న (2021 డిసెంబర్ 13) భారతీయ మార్కెట్లో తన కొత్త బీఎండబ్ల్యూ ఐఎక్స్ (BMW iX) ఎలక్ట్రిక్ కారుని రూ. 1.15 లక్షల ధర వద్ద అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ కారు దేశీయ మార్కెట్లో విడుదలైన మొదటి రోజే మొత్తం యూనిట్లు అమ్ముడైపోయాయి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా గా మన దేశానికి దిగుమతి చేయబడుతుంది. కావున దీని డెలివరీలు 2022 ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క బుకింగ్స్ 2022 ఏప్రిల్ నెల తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కంపెనీ వెల్లడించలేదు.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

దేశీయ మార్కెట్లో BMW iX మొదటి బ్యాచ్‌కి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మరియు డీలర్‌షిప్‌ల నుండి గొప్ప స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఇది కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, దీని కారణంగా BMW ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేకంగా లోన్, ఇన్సూరెన్స్ మరియు వెహికల్ సర్వీస్ కోసం పూర్తి ప్యాకేజీని అందిస్తోంది. కావున ఇవన్నీ కూడా కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారణం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడింది.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

ఈ సందర్భంగా, కంపెనీ మాట్లాడుతూ.. మా కొత్త ఆధునిక ఎలక్ట్రిక్ కారు దేశీయ విఫణిలో విడుదలైన మొదటి రోజే ఇంతటి గొప్ప స్పందన రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. అంతే కాకుండా మా కస్టమర్లు మా మీద పెట్టుకున్న నమ్మాకాన్ని నిలబెట్టుకోవడానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని తెలిపింది.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

ప్రస్తుతం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేసే వారికి ప్రారంభ ఆఫర్‌లో భాగంగా, BMW వాల్ ఛార్జర్ అందిస్తుంది. కావున దీనిని ఇంట్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, ఇది 11kW వరకు ఛార్జ్ చేస్తుంది. ఇది కూడా ఇప్పుడు కొనుగోలు చేసినవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌ ఉంటుంది మరియు ఇది ఫ్రంట్ డిజైన్ లో ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇంకా ఇందులో సన్నటి సొగసైన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, దీర్ఘచతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, 21 ఇంచ్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌, ఫ్రేమ్‌లెస్ విండోస్, పెద్ద పనోరమిక్ రూఫ్, ఈ ఎలక్ట్రిక్ కారును హైలైట్ చేసే బ్లూ డీటేలింగ్స్ మరియు సొగసైన సింగిల్-పీస్ టెయిల్‌లైట్‌లు వంటిఐ ఉన్నాయి.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, దీని డ్యాష్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు డ్రైవర్ కాక్‌పిట్ కోసం ట్విన్ డిస్‌ప్లే సెటప్‌ ఉంటుంది. ఇందులో హెక్సాగనల్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ సీట్లు, 500 లీటర్ల బూట్ స్పేస్, 14.9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, హెడ్‌స్ అప్ డిస్‌ప్లే, సరౌండ్-వ్యూ కెమెరా మరియు 18-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఇతర ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

భారత మార్కెట్లో BMW iX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే విడుదల చేయబడింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని xDrive40 రూపంలో అందింస్తోంది. కొత్త BMW iX xDrive40 ఎలక్ట్రిక్ కారులో 76.6kWh సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ సెటప్ ఉంటుంది. ఇది రెండు యాక్సిల్స్ లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తిని పంపిణీ చేస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 322 బిహెచ్‌పి పవర్ మరియు 630Nm టార్క్‌ ని ఉత్పత్తి చేస్తాయి.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

ఇందులోని సింగిల్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ యొక్క ఎక్స్‌డ్రైవ్ (xDrive) ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్ల నుండి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్లు.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక ఫుల్ చార్జిపై గరిష్టంగా 425 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కారు చార్జింగ్ విషయానికి వస్తే, స్టాండర్డ్ వాల్ ప్లగ్‌ల కోసం 2.3kW సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ ను అందిస్తుండగా, ఫాస్ట్ చార్జింగ్ కోరుకునే వారి కోసం 11kW AC వాల్ బాక్స్ ఛార్జర్‌ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ కారులో 76.6kWh సామర్థ్యంతో కూడిన ట్విన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయడానికి స్టాండర్డ్ 2.3kW సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ ద్వారా అయితే 36 గంటల సమయం పడుతుంది. అదే 11kW AC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే కేవలం 7 గంటల వ్యవధిలోనే బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎళక్ట్రిక్ కారు మరింత వేగవంతమైన DC ఛార్జింగ్‌ కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిని 50kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో చార్జ్ చేస్తే, కేవలం ఒక గంట 13 నిమిషాల్లోనే దాని బ్యాటరీని 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చార్జింగ్ సమయం కూడా ఎక్కువ అనిపిస్తే, మరింత శక్తివంతమైన మరియు వేగవంతమైన 150kW DC ఛార్జర్‌ను కొనుగోలుచేయవ్చచు, దీని సాయంతో కేవలం 31 నిమిషాల్లోనే కారు బ్యాటరీని అదే 10 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో అడుగెట్టిన మొదటి రోజే అన్నీ అమ్ముడైపోయాయి.. ఇక మాటల్లేవ్

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు స్టెబిలిటీ కంట్రోల్ వంటి అనేక ఇతర భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో యాక్టివ్ రిటర్న్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ మరియు ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్‌, లేన్ చేంజ్ అసిస్ట్‌ వంటి అనేక ఇతర డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి BMW యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుకి మార్కెట్లో మంచి స్పందన వచ్చింది. ఇది నిజంగా కంపెనీకి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో శుభ సూచికం.

Most Read Articles

English summary
Bmw ix electric car sold out on launch day details
Story first published: Tuesday, December 14, 2021, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X