కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV: ఒక్క ఛార్జ్.. 561 కిమీ రేంజ్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్‌ (BMW iX) అనే కొత్త ఎలక్ట్రిక్ SUV విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ధర రూ. 1.15 కోట్లు. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ SUV ని విడుదల చేసిన సమయంలో దీని రేంజ్ గురించి వెల్లడించలేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు యొక్క రేంజ్ గురించి వెల్లడించింది. దీని గురించి మరింత సంచరిం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 521 కిమీ పరిధిని అందిస్తుందని తెలిపింది. ఈ పరిధి నిజంగా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

BMW కంపెనీ ఈ ఎలక్ట్రిక్ SUV ని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి BMW xDrive40 మరియు BMW xDrive50 వేరియంట్లు. BMW iX ఎలక్ట్రిక్ SUV దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి, ఆడి ఈ-ట్రాన్ మరియు జాగ్వార్ ఐపేస్ వంటి ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) అనేది ఎలక్ట్రిక్ కార్ల శక్తి సామర్థ్యాన్ని అంచనా వేసే US సంస్థ. ఈ సంస్థ BMW iX ఎలక్ట్రిక్ SUV యొక్క xDrive40 వేరియంట్ ఒక్క ఫుల్ ఛార్జ్‌పై గరిష్టంగా 425 కిమీల పరిధిని అందిస్తుందని తెలిపింది. అయితే ఇందులోని హై-స్పెక్ BMW xDrive50 వేరియంట్ ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 521 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

BMW ఇంతకు ముందు క్లెయిమ్ చేసిన 611 కిమీల కంటే సర్టిఫైడ్ పరిధి చాలా తక్కువగా ఉందని దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది. EPA రేటింగ్ ప్రకారం, BMW iX XDrive50 కార్ 20 ఇంచెస్ వీల్ సెట్‌తో అమర్చబడి ఉంది. కావున ఇది ప్రయాణంలో 324 మైళ్ల (521 కి.మీ) కిలోమీటర్ల పరిధిని కవర్ చేయగలదు. అయితే దాని చక్రాల పరిమాణాన్ని 21 ఇంచెస్ లేదా 22 ఇంచెస్ కి మార్చినట్లయితే, దాని పరిధి 491 కిమీ నుంచి 507 కిమీ మధ్య వరకు ఉంటుంది. ఈ కారు అందించే పరిధి దాని వీల్ సెట్ యూ బట్టి ఉంటుంది.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

BMW iX లో కంపెనీ రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చింది. కావున ఈ రెండూ దానికి పవర్ అందిస్తాయి. ఈ రెండు మోటార్లు ముందు మరియు వెనుక ఇరుసులపై అమర్చబడి ఉంటాయి. అంతే కాకూండా కంపెనీ 111.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కూడా ఉపయోగించింది. ఇది డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌కు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV కేవలం 6 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 200 కిమీ.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

BMW iX xDrive 40 గరిష్టంగా 326 బిహెచ్‌పి పవర్‌ మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేయగలదు. అదే సమయంలో BMW xDrive 50 విషయానికి వస్తే, ఇది 523 బిహెచ్‌పి పవర్‌ మరియు 765 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ అందిస్తుంది. మొత్తానికి ఈ రెండూ కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌ ఉంటుంది మరియు ఇది ఫ్రంట్ డిజైన్ లో ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇంకా ఇందులో సన్నటి సొగసైన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, దీర్ఘచతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, 21 ఇంచ్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌, ఫ్రేమ్‌లెస్ విండోస్, పెద్ద పనోరమిక్ రూఫ్, ఈ ఎలక్ట్రిక్ కారును హైలైట్ చేసే బ్లూ డీటేలింగ్స్ మరియు సొగసైన సింగిల్-పీస్ టెయిల్‌లైట్‌లు వంటిఐ ఉన్నాయి.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, దీని డ్యాష్‌బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు డ్రైవర్ కాక్‌పిట్ కోసం ట్విన్ డిస్‌ప్లే సెటప్‌ ఉంటుంది. ఇందులో హెక్సాగనల్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ సీట్లు, 500 లీటర్ల బూట్ స్పేస్, 14.9 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, హెడ్‌స్ అప్ డిస్‌ప్లే, సరౌండ్-వ్యూ కెమెరా మరియు 18-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మొదలైన ఇతర ఫీచర్లు ఉన్నాయి.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ ఎక్స్‌డ్రైవ్40 ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయడానికి స్టాండర్డ్ 2.3 kW సింగిల్-ఫేజ్ ఛార్జర్‌ ద్వారా అయితే 36 గంటల సమయం పడుతుంది. అదే 11 kW AC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో అయితే కేవలం 7 గంటల వ్యవధిలోనే బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

కొత్త BMW iX ఎలక్ట్రిక్ SUV రేంజ్ ఎంతో తెలుసా..?

ఈ ఎలక్ట్రిక్ కారు మరింత వేగవంతమైన DC ఛార్జింగ్‌ కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిని 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో చార్జ్ చేస్తే, కేవలం ఒక గంట 13 నిమిషాల్లోనే దాని బ్యాటరీని 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చార్జింగ్ సమయం కూడా ఎక్కువ అనిపిస్తే, మరింత శక్తివంతమైన మరియు వేగవంతమైన 150kW DC ఛార్జర్‌ను కొనుగోలుచేయవ్చచు, దీని సాయంతో కేవలం 31 నిమిషాల్లోనే కారు బ్యాటరీని అదే 10 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Bmw ix electric suv official range revealed up to 521 km details
Story first published: Friday, December 24, 2021, 18:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X