బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, మరో కొత్త ఎమ్ సిరీస్ పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ పేరుతో కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.62.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అవి: ద్రవిట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ మరియు టాంజానిట్ బ్లూ. ఇంటీరియర్స్‌లో కాంట్రాస్ట్ బ్లూ స్టిచింగ్‌తో బ్లాక్‌లో ఆల్కాంటారా / సెన్సాటెక్ కాంబినేషన్ అప్‌హోలెస్ట్రీని కూడా ఆఫర్ చేస్తున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ స్పోర్ట్స్ సెడాన్‌లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు, బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, రెండు చివర్లలో అగ్రెసివ్‌గా కనిపించే బంపర్లు, రియర్ స్పాయిలర్ మరియు స్టైలిష్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ దాని డ్రైవింగ్ డైనమిక్స్‌కి చాలా ప్రసిద్ధి చెందిన మోడల్. ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో శక్తివంతమైన 3.0-లీటర్ ఇన్-లైన్, 6-సిలిండర్ ట్విన్-స్క్రోల్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5800 ఆర్‌పిఎమ్ వద్ద 385 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1850-5000 ఆర్‌పిఎమ్ మధ్యలో 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ కారు కేవలం 4.4 సెకన్లలోనే గంటకు సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారులో ఎకో ప్రో, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. డ్రైవర్ ఎంచుకునే డ్రైవింగ్ మోడ్‌లను బట్టి కారులోని సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సర్దుబాటు అవుతుంది. మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేసింది - పూర్తి సమీక్ష కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కారులో లభించబోయే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, ఇది సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ-డ్రైవ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో జెస్చర్ కంట్రోల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, త్రీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ మోడల్‌ను పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఈ కారుని లక్ష రూపాయల టోకెన్ అడ్వాన్స్‌ను చెల్లించి బిఎమ్‌డబ్ల్యూ ఆన్‌లైన్ షాప్ నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ కారును ముందుగా కొనుగోలు చేసే మొదటి 40 మంది కస్టమర్లు భారతదేశంలోని ఐకానిక్ రేస్ ట్రాక్‌పై కంపెనీ ప్రత్యేక డ్రైవర్ శిక్షణను కూడా అందించబోతోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త కస్టమర్లు బిఎమ్‌డబ్ల్యూ యొక్క సర్టిఫైడ్ ట్రైనర్ నుండి రేస్ లైన్ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ఈ శిక్షణ సహాయంతో, కస్టమర్లు తమ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారుని పూర్తిస్థాయిలో ఆస్వాదించగలుగుతారని కంపెనీ పేర్కొంది. అధిక ఇంజిన్ పనితీరు, ఎమ్-స్పెసిఫిక్ ఛాస్సిస్ ట్యూనింగ్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ మరియు ఎమ్ స్పోర్ట్ రియర్ డిఫరెన్షియల్ వంటి లక్షణాలతో రూపుదిద్దుకున్న ఈ కారు గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

MOST READ:పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

Most Read Articles

English summary
BMW M340i xDrive Launched In India; Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X