మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తన భవిష్యత్ కార్ల కోసం సరికొత్త ఐడ్రైవ్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించిన కొన్ని రోజులకే కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారును ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

మార్చి 17, 2021వ తేదీన కంపెనీ తమ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. ఈ కొత్త 2022 బిఎమ్‌డబ్ల్యూ ఐ4 బ్రాండ్ నుండి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సెడాన్ కానుంది.

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

బిఎమ్‌బ్ల్యూ ఇప్పటికే తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో పలు ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉన్నప్పటికీ, స్పోర్ట్ సెడాన్ రూపంలో వస్తున్న మొదటి కార్ మాత్రం ఈ సరికొత్త 2022 ఐ4 కావటం విశేషం. అంతేకాకుండా, ఈ కొత్త ఐడ్రైవ్ 8 టెక్నాలజీని కలిగిన మొట్టమొదటి కారు కూడా బిఎమ్‌బ్ల్యూ ఐ4 కానుంది.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కారు ఈ విభాగంలో టెస్లా మోడల్ 3 పెర్ఫార్మెన్స్ మరియు ఆడి ఇ-ట్రోన్ జిటి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. బిఎమ్‌డబ్ల్యూ గతేడాది మార్చి నెలలో తమ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు యొక్క కాన్సెప్ట్ వెర్షన్‌ను ప్రదర్శించింది.

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ 390 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించనున్నారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 600 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని సమాచారం. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ కేవలం 4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ గతంలో ప్రదర్శించిన కాన్సెప్ట్ వెర్షన్‌లోని అనేక డిజైన్ అంశాలు ఈ కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఐ4లో కూడా కనిపిస్తాయని తెలుస్తోంది.

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

ఈ కాన్సెప్ట్ వెర్షన్‌లో లాంగ్ వీల్‌బేస్, ఫాస్ట్‌బ్యాక్ రూఫ్‌లైన్ మరియు షార్ట్ ఓవర్‌హాంగ్‌లతో ఇది చాలా ఆధునికంగా కనిపించింది. ప్రొడక్షన్ వెర్షన్ కూడా ఇదే తరహా డిజైన్ క్యూలను ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. అయితే, కాన్సెప్ట్ మోడల్‌లో కనిపించిన లైట్ కాపర్ కలర్ స్కీమ్‌ను ప్రొక్షన్ వెర్షన్ నిలుపుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

కాన్సెప్ట్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఐ4 మోడల్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, ఇది చూడటానికి బక్‌టూత్ (కుందేలు ముందు రెండు పళ్లు) లాగా కనిపిస్తుంది. ఇది సాధారణ బిఎమ్‌డబ్ల్యూ కార్లలో కనిపించే సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్‌కు విరుద్ధంగా ఉన్నట్లుగా ఉంటుంది. ప్రొడక్షన్ వెర్షన్‌లో ఇది మారుతుందో లేదో వేచి చూడాలి.

మార్చి 17న బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ ఆవిష్కరణ; వివరాలు

కాగా, ఈ కొత్త 2022 బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ స్పోర్ట్ సెడాన్ కోర్, స్పోర్ట్ మరియు ఎఫిషియంట్ అనే మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ4 కోసం అభివృద్ధి చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 530 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని సమాచారం. ఇది సాధారణ కంబస్టియన్ ఇంజన్‌తో పోలిస్తే, ప్రస్తుత బిఎమ్‌డబ్ల్యూ వి8 కారులో ఉపయోగిస్తున్న పెట్రోల్ ఇంజన్‌తో సమానంగా ఉంటుంది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

Most Read Articles

English summary
BMW To Reveal i4 Electric Sport Sedan On March 17, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X