బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ ఇకపై భవిష్యత్తులో తమ కార్లలో ఉపయోగించే ప్రామాణిక టైర్ల స్థానంలో అధునాతన ఎకో ఫ్రెండ్లీ టైర్లను ఉపయోగించనున్నట్లు పేర్కొంది. ఎక్కువ కాలం మన్నేలా మరియు పర్యావరణంపై తక్కువ దష్ప్రాభావం చూపేలా ఈ టైర్లను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

టైర్ల తయారీలో పేరు గాంచిన పీరెల్లి సంస్థ బిఎమ్‌డబ్ల్యూ కోసం న్యాచురల్ రబ్బర్‌తో ఎకో ఫ్రెండ్లీ టైర్లను రూపొందించింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి మార్కెట్లోకి రానున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్45ఈ ప్లగ్-ఇన్-హైబ్రిడ్ కారులో ఈ పీరెల్లీ 22 ఇంచ్ ఎకో ఫ్రెండ్లీ టైర్లను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

అంతేకాదు, పరిశ్రమలో ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ టైర్లను ఉపయోగిస్తున్న మొట్టమొదటి కంపెనీ కూడా బిఎమ్‌డబ్ల్యూ కావటం విశేషం. సర్టిఫైడ్ నేచురల్ రబ్బరుతో తయారు చేసిన టైర్ల వాడకం మన పరిశ్రమకు ప్రముఖ విజయమని కంపెనీ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

ఈ విధంగా తాము వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి జీవవైవిధ్యం మరియు అడవులను సంరక్షించడానికి తమ వంతు సహాయం చేస్తున్నామని బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది. ఈ కొత్త 22 ఇంచ్ పి జీరో టైర్లు ఇప్పుడు ఫారెస్ట్ స్టీవార్డ్ షిప్ కౌన్సిల్ (ఎఫ్ఎస్‌సి) లేబుల్ అందుకున్న ప్రపంచంలోనే మొదటి టైర్లుగా మారాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

ఎఫ్ఎస్‌సి అనేది సహజ రబ్బరుతో తయారైన ఉత్పత్తులకు ధృవీకరణ ప్రమాణాలను అందించే స్వతంత్ర సంస్థ. ఈ ధృవీకరణ సాధించడానికి, పీరెల్లి తమ అమెరికన్ ప్లాంట్లో ఎఫ్‌ఎస్‌సి సర్టిఫైడ్ నేచురల్ రబ్బరు మరియు రేయాన్‌ను ఉపయోగించి ఈ టైర్లను తయారు చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

బిఎమ్‌డబ్ల్యూ కోసం పీరెల్లి పంపిణీ చేసిన ఈ టైర్లు, కంపెనీ యొక్క కఠినమైన పనితీరు అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా ఇవి తక్కువ రోలింగ్ నిరోధకతను మరియు తక్కువ స్థాయిలో శబ్ధాన్ని విడుదల చేస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

ఈ సంస్థ చాలా సంవత్సరాలుగా ఎఫ్‌ఎస్‌సి సంస్థతో కలిసి పనిచేస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ ఐ3 లో కూడా ఎఫ్‌ఎస్‌సి-సర్టిఫైడ్ కలపను ఉపయోగించారు. ఇది మొదటిసారి 2013లో మార్కెట్లో ప్రారంభించబడింది. ఈ సర్టిఫైడ్ కలప రాబోయే బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్ కారులో కూడా ఉపయోగించబడుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎకో ఫ్రెండ్లీ టైర్స్: ఎక్కువ మన్నిక మరియు పర్యావరణానికి కూడా సేఫ్!

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 విషయానికి వస్తే, కంపెనీ ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్45ఈ కోసం పూర్తి జీవితచక్ర సిఓ2 ధృవీకరణను పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ రోజుల్లో ప్రతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ కుడా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా విభిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇదే బాటను ఇప్పుడు చిన్న కంపెనీలు కూడా అనుసరిస్తున్నాయి.

Most Read Articles

English summary
All You Need To Know About BMW's Sustainable Eco Friendly Tyres, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X