ప్రపంచంలో అతిచిన్న క్యాంపర్ వ్యాన్.. ఇదే.. మీకు తెలుసా!!

వాహన ప్రియులు తమకు నచ్చిన వాహనాలను తమకు నచ్చిన రీతిలో మార్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడతారు. ఇలాంటి నేపథ్యంలో మాడిఫైడ్ అయిన బైకులు మరియు కార్లను గురించి మనం ఇదివరకటి కథనాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇదే రీతిలో ఒక చిన్న కారు ఒక చిన్న రూమ్ గా మారింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

సాధారణంగా ఫియట్ 500 అనేది చిన్న కారు మోడళ్లలో ఒకటి. ఇటువంటి చిన్న తరహా కార్లను చిన్న చిన్న సొంత అవసరాలను వినియోగించడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఫియట్ 500 కారును ఇంగ్లాండ్‌కు చెందిన ఒక యువతి తనకు నచ్చిన విధంగా ఎంతో అనుకూలంగా మాడిఫైడ్ చేసుకుంది.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

ఇంగ్లాండ్ యువతి మాడిఫైడ్ చేసుకున్న ఈ కారు ప్రపంచంలోనే అతి చిన్న క్యాంపర్ మోడల్ వాహనంగా మారిపోయింది. ఇంగ్లాండ్‌లోని సోలిహుల్‌కి చెందిన హన్నా అనే యువతి ఫియట్ 500 ను ఒక చిన్న రూమ్ గా మార్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

మాడిఫైడ్ చేసిన తరువాత ఈ చిన్న కారు ఒక క్యాంపర్-స్టైల్ వెహికల్ గా మారిపోయింది. ఈ కారులో దాదాపు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ క్యాంపర్ వెహికల్ ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్ కి మరియు ట్రెక్కింగ్ కోసం ఉపయోగించబడుతుంది.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

హన్నా ఇంతకుముందే తానూ ఒక క్యాంపర్ లాంటి వాహనం కొనుగోలుచేయాలనుకుంది. అయితే దీనికి కావాల్సిన డబ్బు ఆమె వద్ద లేకపోవడం వల్ల తన వద్ద ఉన్న ఈ కారుని తనకు నచ్చిన క్యాంపర్ వెహికల్ గా మార్చుకుని తన కల నిజం చేసుకుంది. అయితే తనకు ఎంతగానో ఇష్టమైన ఈ క్యాంపర్ వెహికల్ లో తన ప్రియునికి సైతం స్థానం లేదని చెప్పింది.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

హన్నా హ్యూస్ తన ఫియట్ 500 కారును క్యాంపర్‌ వెహికల్ గా మార్చుకోవడానికి £ 150 ఖర్చు చేశారు. అంటే దీని విలువ భారత కరెన్సీ ప్రకారం 15,483 రూపాయలు. హన్నా తన ఫియట్ 500 కారుని తనకు నచినకారుగా మార్చుకోవడానికి ఇంత తక్కువ మొత్తంలో ఖర్చు కావడంతో మరింత సంతోషించింది.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

ఈ కారులో సౌకర్యవంతమైన బెడ్, వస్తువులను నిల్వ చేయడానికి స్టోరేజ్ సిస్టమ్‌తో సహా అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్‌లో క్యాంపర్ తరహా వాహనాల సంస్కృతి చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలామంది వాహన దారులు క్యాంపర్ తరహా వాహనాల కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

క్యాంపర్ వాహనాలు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటాయి కావున వీటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీటికయ్యే ఖర్చు దాదాపు 3 వేల పౌండ్ల నుండి 10 వేల పౌండ్ల మధ్య ఉంటుంది. సాధారణ వాహనాల కంటే క్యాంపర్ వాహనాల కోసం ఎక్కువ ఖర్చు చేసే వారు కూడా ఉన్నారు.

మీకు తెలుసా..ప్రపంచంలో అతిచిన్న క్యాంప్ వెహికల్.. ఇదే

ఇలాంటి సమయంలో అతితక్కువ ఖర్చుతో తనకు నచ్చిన ఎంతగానో ఇష్టమైన క్యాంపర్ తయారు కావడం చ;ఆ అదృష్టం అని హన్నా తెలిపింది. హన్నా తన ఫియట్ 500 కారును చిన్న క్యాంపర్‌గా మార్చడానికి నాలుగు వారాల సమయం పట్టింది. క్యాంపర్ సిద్ధమైన తర్వాత ఆమె ఇంగ్లాండ్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన వేల్స్‌కు కూడా వెళ్ళింది.

Image Courtesy: Kennedy News and Media

Most Read Articles

English summary
Woman Converts Fiat 500 Into World's Smallest Camp Van. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X