స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ఆదరణ పెరుగుతోంది. ఈ సమయంలో దాదాపు అన్ని వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. మరికొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను నిరంతరం టెస్ట్ చేస్తున్నాయి.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ఇటీవల బివైడి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి భారతదేశంలో మరోసారి టెస్ట్ చేయడం జరిగింది. ఈ6 ఎంపివిని ప్రస్తుతం సింగపూర్ మార్కెట్లో విడుదల చేశారు. అయితే భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి ముందే బెంగళూరు-చెన్నై హైవేలో ఈ ఎలక్ట్రిక్ ఎంపివిని గుర్తించడం జరిగింది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

బివైడి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి యొక్క డిజైన్అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని డిజైన్ విషయానికి వస్తే, ఇది వాలుగా ఉన్న ఒక రూప్ తో పాటు రూప్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, అల్లాయ్ వీల్స్ మరియు క్రోమ్ ఫినిషెడ్ విండో లైన్‌ను కలిగి ఉంది. ఇక్కడ ఉన్న క్లోజ్డ్ గ్రిల్ ఈ కారుని ఎలక్ట్రిక్ వెహికల్ అని నిర్దారిస్తుంది.

MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ఈ ఎంపివిలో ఉన్న క్లోస్డ్ గ్రిల్‌తో పాటు, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌తో ప్రొజెక్టర్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, మధ్యలో ఉంచిన పెద్ద బివైడి లోగో, మరియు ఫ్రంట్ బంపర్, ట్రైయాంగిల్ ఫాగ్ లాంప్ హౌసింగ్‌లు మరియు లెవల్ 1 అటానమస్ ఫీచర్‌కు మద్దతుగా సెన్సార్ మాడ్యూల్‌తో ఎయిర్ డ్యామ్ వంటివి ఉన్నాయి.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

బివైడి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి యొక్క వెనుక భాగంలో, ర్యాప్-చుట్టూ ఎల్‌ఇడి టైల్ లాంప్స్, బూట్ లిడ్ పొడవునా విస్తరించిన క్రోమ్ స్ట్రిప్ ఉంది. అంతే కాకుండా ఇందులో రియర్ బంపర్‌లపై రిఫ్లెక్టర్లను కూడా కలిగి ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రియర్ క్వార్టర్ ప్యానెల్‌లో ‘స్పేస్' బ్యాడ్జ్ ఉన్నాయి.

MOST READ:అలెర్ట్.. అక్కడ కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ బంద్; కొత్త సిస్టమ్ స్టార్ట్

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ఇక్కడ టెస్టింగ్ దశలో ఉన్న బివైడి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి యొక్క ఇంటీరియర్ కొంతవరకు గుర్తించబడింది. ఇది దాదాపుగా సింగపూర్ మార్కెట్‌లో అమ్మిన ఎమ్‌పివి మాదిరిగానే కనిపిస్తుంది. ఇది 6 వే సర్దుబాటు డ్రైవర్ సీటు, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

వీటితోపాటు వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు రియర్ ఎసి వెంట్స్ మరియు సన్‌రూఫ్‌ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

MOST READ:కరోనా టైమ్‌లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ఈ బివైడి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి యొక్క పవర్ట్రెయిన్ విషయానికి, ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివిలో 71.7 కిలోవాట్ల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 94 బిహెచ్‌పి మరియు 180 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎంపివి ఒక సారి ఫుల్ ఛార్జ్ చేసిన తరువాత గరిష్టంగా 522 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ కేవలం 1.5 గంటల సమయంలో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

బివైడి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 4,695 మి.మీ పొడవు, వెడల్పు 1,810 మిమీ, ఎత్తు 1,670 మిమీ మరియు వీల్‌బేస్‌లో 2,800 మిమీ వరకు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఎంపివిలో 580 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

MOST READ:శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ ఎంపివిలోని ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 4 ఎయిర్‌బ్యాగులు, రియర్ వ్యూ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటివి ఉన్నాయి.

స్పాట్ టెస్ట్ లో కనిపించిన బివైడి ఈ6 ఎలక్ట్రిక్; వివరాలు

బివైడి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి యొక్క టెస్టింగ్ జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఇది భారతమార్కెట్లో ప్రవేశపెట్టే అడుగుపెట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈ6 ఎలక్ట్రిక్ ఎంపివి మంచి పర్ఫామెన్స్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. బివైడి భారత మార్కెట్లో అందించే మొదటి ఎలక్ట్రిక్ ఎంపివి ఈ ఈ6 ఎలక్ట్రిక్ అవుతుంది.

Most Read Articles

English summary
BYD e6 Electric MPV Spot Test. Read in Telugu.
Story first published: Saturday, April 24, 2021, 18:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X