ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

భారతదేశంలో పండుగ సీజన్ సెంటిమెంట్ చాలా బలమైనది. ప్రత్యేకించి కస్టమర్లు, కొత్త వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ సీజన్ కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు తమ కొత్త వాహనాలను సరిగ్గా ఇదే సమయంలో విడుదల చేస్తుంటాయి.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న కొత్త కార్లన్నీ కూడా ఈ ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఎంతో కాలంగా వేచి చూస్తున్న కొన్ని అద్భుతమైన కార్లు ఈ ఆగస్ట్ 2021 నెలలో మార్కెట్లోకి రానున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

1. టాటా టియాగో ఎన్ఆర్‌జి

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ స్పోర్టీయర్ వేరియంట్‌ను ఆగస్టు 4, 2021వ తేదీన విడుదల చేయనుంది. టాటా టియాగో ఎన్‌ఆర్‌జి పేరుతో రానున్న ఈ స్పెషల్ వేరియంట్ ప్రస్తుతం లభిస్తున్న టియాగో కన్నా మరింత రగ్గడ్‌గా, స్పోర్టీ అవతార్‌లో కనిపించనుంది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

టాటా మోటార్స్ ఇప్పటికే టియాగో ఎన్‌ఆర్‌జి వేరియంట్ యొక్క టీజర్ ఇమేజ్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో స్పోర్టీ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, బ్లాక్ కలర్ రూఫ్, పియానో బ్లాక్ సైడ్ మిర్రర్స్ మొదలైన కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇంజన్ పరంగా ఈ కొత్త వేరియంట్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

2. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్

జపనీస్ కార్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆగస్టు 17, 2021వ తేదీన దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఇందులో డిజైన్ అప్‌డేట్స్‌తో పాటు, కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉంటాయని సమాచారం.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

కొత్త 2021 హోండా అమేజ్‌లో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ వంటి మార్పులను ఆశించవచ్చు. ఇంటీరియర్స్‌లో కొత్త ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ మరియు కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది. ఇవే కాకుండా, కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌ను కూడా అందించవచ్చని తెలుస్తోంది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

3. స్కోడా కుషాక్ 1.5-లీటర్ పెట్రోల్

చెక్ రిపబ్లిక్ కార్ స్కోడా ఆటో, గత జూన్ 28న తమ సరికొత్త 5-సీటర్ ఎస్‌యూవీ స్కోడా కుషక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం స్కోడా కుషాక్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఈ ఎస్‌యూవీని పెద్ద 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఆగస్ట్ 11వ తేదీన మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

ప్రస్తుత వేరియంట్ల కన్నా మరింత శక్తివంతమైన ఇంజన్‌తో రానున్న స్కోడా కుషాక్‌లో 1.5-లీటర్ టిఎస్ఐ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

4. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఆవిష్కరణ

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మాహింద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ700' కారును కంపెనీ ఈ ఆగస్ట్ నెలలో అధికారికంగా ఆవిష్కరించవచ్చని సమాచారం. కంపెనీ ఇప్పటికే, ఈ కారులో అందించే ఫీచర్లను ఒక్కొక్కటిగా టీజర్ల రూపంలో వెల్లడి చేస్తూ వస్తోంది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

ఇటీవల విడుదలైన టీజర్లలో కంపెనీ తమ ఎక్స్‌యూవీ700 లోని ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, వైడ్ పానోరమిక్ సన్‌రూఫ్ (స్కైరూఫ్), పర్సనలైజ్డ్ హై స్పీడ్ అలెర్ట్స్, డ్రైవర్ ఫెటిగ్ అలెర్ట్ వంటి పలు ఫీచర్లను హైలైట్ చేసింది. మహీంద్రా ఈ ఎస్‌యూవీలో లెవల్ 1 అటానమస్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

మనదేశంలో ఇప్పటికే ఈ తరహా ఫీచర్లు ఎమ్‌జి గ్లోస్టర్ వంటి ప్రీమియం కార్లలో లభిస్తున్నాయి. ఈ లెవల్ 1 అటానమస్ ఫీచర్లలో ఆటోమేటిక్ పార్కింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక అధునాత సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

5. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్

ఇక ఈ జాబితాలో చివరిగా, బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎఫ్-పేస్ మోడల్‌లో ఓ స్పోర్టీ మరియు పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ను కంపెనీ వచ్చే నెలలో విడుదల చేయనుంది. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ పేరుతో రానున్న కొత్త వేరియంట్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

ఆగస్ట్‌లో విడుదల కానున్న కొత్త కార్లు: టియాగో ఎన్ఆర్‌జి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మరెన్నో..

జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ మునుపెన్నడూ లేనంత వేగంగా మరియు మోటార్‌స్పోర్ట్-ప్రేరేపిత ఎక్స్టీరియర్ డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్స్ మరియు సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీతో ఇది అందుబాటులోకి రానుంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ కారులో కొత్త స్టీరింగ్ వీల్, కొత్త గేర్ సెలెక్టర్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్యాబిన్ ఎయిర్ ఐయోనైజర్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండనున్నాయి.

Most Read Articles

English summary
Car Launches Scheduled In August 2021: Tiago NRG, New Amaze, XUV700 And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X