రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ బాగుండాలి. ఎందుకంటే ఎగుమతులు మరియు దిగుమతులు మొదలైనవాటి కోసం సరైన రోడ్డు వ్యవస్థ చాలా అవసరం. ఇందులో భాగంగానే దేశంలో రోడ్డు నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో మరింత పటిష్టమైన రోడ్డు నిర్మాణానానికి వచ్చే రెండేళ్లలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

దేశంలో రోడ్డు నిర్మాణానానికి 100% విదేశీ పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో, విదేశీ కంపెనీలు భారతదేశంలో రోడ్డు నిర్మాణంపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా రాబోయే తరాలకు చాలా ఉపయోగపడేవిధంగా కొత్త టెక్నాలజీలతో నాణ్యమైన రహదారులను నిర్మించాలని చూస్తున్నాయి.

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

రోడ్డు నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఒక్క రోజులో దాదాపు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరిగేలా చూడటానికి సరైన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు కూడా మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. దీని గురించి ఇండో-అమెరికన్ పార్టనర్ షిప్ విజన్ సమ్మిట్‌లో నితిన్ గడ్కరీ ప్రసంగించారు.

MOST READ:రూ.80,000 మేర పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

భారతదేశంలో సరైన మౌలిక సదుపాయాల రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. దాని సహాయంతో, దేశ పౌరులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందించబడతాయి. కావున ప్రజల అవసరాలను అనుకూలంగా రోడ్లు, ఓడరేవులు వంటివాటిని మెరుగుపరచబడతాయి.

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

దీనితో పాటు విద్యుత్ మౌలిక సదుపాయాల రంగంలో దేశం ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐతే కాకుండా విమానాశ్రయం, మెట్రో ట్రైన్ మరియు రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాలలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది.

MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

దేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రజా రవాణాలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. విమానాశ్రయం, మెట్రో ట్రైన్స్, రైల్వే స్టేషన్లతో పాటు ప్రజా రవాణా, విద్యుత్ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని కూడా గడ్కరీ అన్నారు.

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతిరోజూ 37 కిలోమీటర్ల రహదారి నిర్మాణం నిరాఘాటంగా జరుగుతోంది. ఇటీవల కాలంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేవలం 24 గంటల్లో 2,580 మీటర్ల పొడవైన నాలుగు లేన్ల రహదారిని నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

MOST READ:కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఆక్సిజన్ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

అధికారికంగా వెలువడిన అధికారిక గణాంకాల ప్రకారం, 2014 వ సంవత్సరంలో 91,287 కిలోమీటర్ల రహదారులు, 2020 సంవత్సరం మార్చి నాటికి 1,37,625 కిలోమీటర్ల రహదారులు నిర్మించబడ్డాయి. భారతదేశంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులలో పాల్గొన్న ఫైనాన్స్ ఏజెన్సీలకు మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీ ఇటీవల డిమాండ్ చేశారు.

రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

ఇండియన్ రైల్వేలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సి), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్సి) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీని నుండి నిధులను సమకూర్చవచ్చని ఆయన అన్నారు. వీటన్నిటి సహకారంతో శరవేగంగా రోడ్డు నిర్మాణ పనులు సాగనున్నాయి. ఇవి భవిష్యత్ లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

MOST READ:విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి

Most Read Articles

English summary
Central Government To Invest Rs 15 Lakh Crore In Next Two Years For Road Construction. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X