డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి డ్రైవింగ్ వచ్చి ఉండి, ఓ అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోయేది. అయితే, ఇది ఒకప్పటి మాట, ఇక నుంచి ఆ ప్రాంతంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మరింత కష్టతరం కానుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకునే వారు ఇప్పుడు 'క్యారెక్టర్ సర్టిఫికెట్'ను కూడా చూపించాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

ఈ ఆదేశాలను మధ్యప్రదేశ్‌లో కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన సూచనల మేరకు, ఆ రాష్ట్ర రవాణా శాఖ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. సదరు ఉత్తర్వుల ప్రకారం, మధ్యప్రదేశ్‌లో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు క్యారెక్టర్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

రాష్ట్రంలో మాఫియా మరియు మహిళలపై నేరాలకు పాల్పడేవారిని గుర్తించడమే ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్రంలో మాఫియా మరియు మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ ఉత్తర్వులు తెరపైకి వచ్చాయి.

MOST READ:పరుగులు తీస్తున్న యమహా సేల్స్.. 2021 జనవరి అమ్మకాలు ఇవే

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్ ద్వారా గతంలో ఎవరైనా మహిళలపై నేరాలకు పాల్పడినట్లు తెలిస్తే, వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను మధ్యప్రదేశ్‌లో రద్దు చేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నట్లు రాష్ట్ర రవాణా కమిషనర్ ఎంకే జైన్ తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

ఈ ఉత్తర్వుల ప్రకారం, "పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు శిక్షణ మరియు పరిశోధనా సంస్థ (పిటిఆర్ఐ) నుండి వచ్చిన సూచనల ప్రకారం, ప్రాంతీయ మరియు జిల్లా రవాణా అధికారులందరికీ పోలీసు శాఖ నుండి సమాచారం వచ్చిన తరువాత మహిళలపై నేరాలకు పాల్పడిన నిందితుల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించడమైనది."

MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకునేవారు వారికి సంబంధించిన క్యారెక్టర్ సర్టిఫికెట్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ నుండి పొందాల్సి ఉంటుంది. పోలీసు రికార్డులో వారిపై పాత కేసులు ఏమైనా ఉంటే, వాటిని క్యారెక్టర్ సర్టిఫికెట్‌లో నమోదు చేస్తారు మరియు వారికి లైసెన్స్ రాకుండా చేస్తారు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

ఈ నిర్ణం వలన ఖచ్చితంగా మహిళలపై నేరాలను తగ్గుతాయని, ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్ ద్వారా ఇకపై అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధృవీకరించబడుతుందని మరియు ఇది మహిళలకు ప్రజా రవాణాలో ప్రయాణాన్ని సురక్షితంగా చేస్తుందని మధ్యప్రదేశ్ రవాణా మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ అన్నారు.

MOST READ:2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

కాగా, మధ్యప్రదేశ్ రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర మహిళా సంఘాలు స్వాగతించాయి. ఈ నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఇది మహిళలపై నేరాలను తగ్గించడంలో ఎక్కువ ప్రభావాన్ని చూపగలదని అన్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

అయితే భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి పోలీసుల ద్వారా జారీ చేయబడే క్యారెక్టర్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి పత్రంగా మార్చడం ఇదే మొదటిసారి. ఈ పరిణామం వలన భారతదేశంలోని నేరస్థులకు డ్రైవింగ్ లైసెన్సులను మంజూరు చేయటం నివారించవచ్చు.

MOST READ:రేసు గుర్రం వంటి కొత్త నిస్సాన్ పాత్‌ఫైండర్ టీజర్ వీడియో

Most Read Articles

English summary
Character Certificate Is Now Mandatory To Get Driving License In MP. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X