భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

ప్రముఖ ప్రెంచ్ కార్ తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారతీయ మార్కెట్లో ఇప్పటికే సిట్రోయెన్ సి5 (Citroen C5) SUV ని విక్రయిస్తూ మంచి ఆదరణ పొందుతోంది. అయితే కంపెనీ త్వరలో మరో SUV అయిన సిట్రోయెన్ సి3 (Citroen C3) ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇది 2022 లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త SUV గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త సిట్రోయెన్ సి3 (Citroen C3) కంపెనీ యొక్క తదుపరి మోడల్ కానుంది. ఈ చిన్న మరియు ఆధునిక SUV 2022 ప్రథమార్ధంలో విడుదల కానుంది. అంతే కాకుండా కంపెనీ డిజిటల్ కస్టమర్ సర్వీస్ కూడా అందిస్తుంది.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

ఇటీవల సిట్రోయెన్ కంపెనీ కొత్త సిట్రోయెన్ సి3 యొక్క టీజర్ కూడా విడుదల చేసింది. ఇందులో కారు యొక్క డిజైన్ వంటి విషయాలు తెలుస్తాయి. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది, కావున ఇది కూడా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

నిజానికి సిట్రోయెన్ కంపెనీ సోషల్ మీడియాలో ఒక వినియోగదారుకు రిప్లై ఇస్తూ C3 కారు 2022 ప్రథమార్థంలో ప్రారంభించబడుతుందని తెలిపింది. Citroen C3 భారతదేశం మరియు దక్షిణ అమెరికా మార్కెట్ల కోసం ఉత్పత్తి చేయబడుతుంది. ఇది కంపెనీ యొక్క మొట్టమొదటి లేటెస్ట్ కారు.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

ఇది సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లోకి తీసుకురానుంది. కావున ధర కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ SUV విభాగంలోకి ప్రవేశించనుంది.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

Citroen C3 మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క ముందు భాగంలో బ్రాండ్ లోగో క్రోమ్‌లో ఉంటుంది, కావున ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కారులోని స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్‌కు అనుగుణంగా ఉంటుంది. ఇందులోని హెడ్‌లైట్, DRL మరియు లోగో SUV ముందు భాగంలో X-ఆకారపు డిజైన్‌ను ఏర్పరుస్తాయి.

ఈ కొత్త కారులోని ఫాగ్ లైట్లు బంపర్ దిగువన ఉన్నాయి. అంతే కాకుండా C3 సిట్రోయెన్ C5 వలె అదే యాక్సెంట్స్ కలిగి ఉంటుంది. దీనితోపాటు కంపెనీ కొత్త C3 తో 78 విభిన్న యాక్ససరీస్ అందిస్తోంది. ఇందులో భాగంగానే రూప్ మరియు బాడీ కలర్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చు.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

కొత్త సిట్రోయెన్ C3 లో 1-లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు మరియు వెనుక రెండు 2-లీటర్ డోర్ పాకెట్‌లు ఉన్నాయి. దీనితో పాటు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్, వెనుక భాగంలో రెండు కప్ హోల్డర్‌లు ఇవ్వబడ్డాయి, ఇది స్మార్ట్‌ఫోన్ హోల్డర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, యుఎస్‌బి సాకెట్, స్టీరింగ్‌పై కంట్రోల్ బటన్లు, కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఇందులో ఉన్నాయి.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

ఈ కొత్త C3 కారులో 315 లీటర్ల బూట్ స్పేస్‌ అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇది 653 మిమీ లెగ్‌రూమ్‌ కలిగి ఉంటుంది. ఇది ఈ విభాగంలో అతి పెద్దది అని చెప్పవచ్చు. ఇందులో 991 మిమీ హెడ్‌రూమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

సిట్రోయెన్ కంపెనీ తన కొత్త సి3 కారు యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి అధికారిక సమాచారం అందివ్వలేదు. కానీ ఈ SUV ని 1.2-లీటర్ టర్బో-ఛార్జ్డ్ ఇంజన్‌తో అందించే అవకాశం ఉంటుంది. కావున ఈ ఇంజిన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

కంపెనీ తన కొత్త SUV ని సాధారణ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా సిట్రోయెన్ మరియు ప్యుగోట్ యొక్క అనేక ఉత్పత్తులు రూపొందించబడ్డాయి. కంపెనీ ఇప్పటికి ప్రకటించిన విధంగా రాబోయే అన్ని మోడళ్లను పెట్రోల్ ఇంజిన్‌కు మాత్రమే తీసుకురానుంది. అయితే భవిష్యత్తులో కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

భారత్‌లో C3 SUV లాంచ్ ఎప్పుడో చెప్పేసిన Citroen.. పూర్తి వివరాలు

సిట్రోయెన్ సి3 SUV ఐస్ వైట్, ప్లాటినం గ్రే, ఆర్టెన్స్ గ్రే మరియు జెస్టీ ఆరంజ్ వంటి బాడీ కలర్స్ మరియు ఆర్టెన్స్ గ్రే మరియు జెస్టీ ఆరంజ్ అనే రెండు రూప్ కలర్స్ లో అందుబాటులోకి రానుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కంపెనీ దీనిని త్వరలో దేశీయ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. కావున ఇది భారత మార్కెట్లో వేగంగా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Citroen c3 to launch in india on first half of 2022 details
Story first published: Thursday, December 16, 2021, 13:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X