సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

ఫ్రెంచ్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ భారత మార్కెట్లో తన మొదటి మోడల్ అయిన సి 5 ఎయిర్‌క్రాస్ ను ఏప్రిల్ 7 న విడుదలచేయనున్నట్లు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క బుకింగ్స్ గత నెల నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కారును రూ .50 వేల టోకెన్ మొత్తంతో బుక్ చేస్తున్నారు.

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఏప్రిల్ 7, మధ్యాహ్నం 3 గంటలకు భారతదేశంలో అధికారికంగా విడుదలచేయనుంది. ప్రీ-లాంచ్ బుకింగ్ చేసే వినియోగదారులకు బహుమతిగా 5 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల మెయింటెనెన్స్ ప్యాకేజీని ఇస్తున్నట్లు కంపెనీ ఇది వర్క్ తెలిపింది.

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

ఏప్రిల్ 6 వరకు చేసిన బుకింగ్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఆ తర్వాత బుక్ చేసుకున్న వాటికీ వర్తించదని కంపెనీ తెలిపింది. ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ లాంచ్ అవుతుంది.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ విడుదలకు ముందే డీలర్‌షిప్‌కు అందజేయడం ప్రారంభించింది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ సిట్రోయెన్ యొక్క పిఎస్‌ఎ ఇఎమ్‌పి 2 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. ఈ కారు ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ అవుతుంది.

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

రెండు వేరియంట్ల యొక్క ఫీచర్స్ కంపెనీ ఇదివరకే వెల్లడించింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని చాలా ఫీచర్లు మరియు పరికరాలతో అందించబోతోంది. ఈ ఎస్‌యూవీని నాలుగు మోనో టోన్లు, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్‌లో ఫుట్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి.

MOST READ:రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

ఇది ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, ఫ్రంట్ విండో గ్లాసెస్, 3 పర్సనల్, రిక్లైనింగ్, అడ్జస్టబుల్ మరియు మాడ్యులర్ రియర్ సీట్లు కలిగి ఉంది. బూట్ స్థలాన్ని పెంచడానికి వాటిని కూడా ఫోల్డ్ చేయవచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్ ఈ ఎస్‌యూవీ టాప్ ఎండ్ వేరియంట్‌లో లభిస్తుంది.

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 176 బిహెచ్‌పి పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల సిట్రోయెన్ ఇండియా కొత్త షోరూమ్‌ను ప్రారంభించిందని, దీనికి కంపెనీ 'సిట్రాన్ నోమాడిక్ షోరూమ్' అని పేరు పెట్టింది.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

సిట్రాన్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్ షోరూమ్ దేశంలో ప్రారంభించిన మొదటి షోరూమ్. అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గురుగ్రామ్‌లతో సహా దేశంలోని 10 పెద్ద నగరాల్లో కంపెనీ డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది.

సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మేము సి 5 ఎయిర్‌క్రాస్‌ను భారతీయ మార్కెట్లో ప్రారంభించటానికి ముందే డ్రైవ్ చేసాము. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క ఫస్ట్ డ్రైవ్ రివ్యూ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

MOST READ:యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

Most Read Articles

English summary
Citroen C5 Aircross India Launch On 7th April. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X