భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) తన సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ (Citroen C5 Aircross) ధరను ఇప్పుడు ఏకంగా రూ. 1.40 లక్షల వరకు పెంచేసింది. కంపెనీ యొక్క భారతీయ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక కారు సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్. కంపెనీ భారతదేశంలో తన C5 ఎయిర్‌క్రాస్ SUV ను రూ. 29.90 లక్షల ధరకు విడుదల చేయబడింది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే ధరల పెరుగుదల తరువాత ఈ SUV ఇప్పుడు రూ. 31.30 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

Citroen C5 Aircross భారతదేశంలో 2021 ఏప్రిల్ 07 న ప్రారంభించబడింది. ఇది కంపెనీ యొక్క ప్రీమియం SUV, ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ 'ఫీల్ మరియు షైన్' అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

Citroen C5 Aircross సంస్థ యొక్క పిఎస్‌ఎ ఇఎమ్‌పి 2 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. Citroen C5 Aircross క్రాస్ఓవర్ డిజైన్‌ను కలిగి ఉండేలా రూపొందించబడింది. ఇందులో డ్యూయల్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ట్విన్ స్లాట్ స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, స్ప్లిట్ టెయిల్ లాంప్‌ కలిగి ఉంటుంది.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

Citroen C5 Aircross యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఫుట్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

ఈ C5 Aircross లో పనోరమిక్ సన్‌రూఫ్, స్ప్లిట్ ఎసి వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, మూడ్ లైటింగ్, ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, ఫ్రంట్ విండో గ్లాసెస్, 3 పర్సనల్, రిక్లైనింగ్, అడ్జస్టబుల్ అండ్ మాడ్యులర్ రియర్ సీట్లు ఇవ్వబడ్డాయి. బూట్ స్పేస్ మరింత అవసరమైనప్పుడు వాటిని ఫోల్డ్ చేయవచ్చు.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

C5 Aircross యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ విత్ ఇబిడి, బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రివర్స్ కెమెరా, 5 మోడ్ ఆప్షన్లతో గ్రిప్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ దీనికి అనేక యాక్ససరీస్ ఆప్సన్స్ కూడా అందుబాటలోకి తీసుకురానుంది.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

Citroen C5 Aircross లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 174 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 18.60 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న Citroen C5 Aircross (సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్) చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా వరకు అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఎక్కువమందిని ఆకర్శించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

ఈ ఎస్‌యూవీని నాలుగు మోనో టోన్, మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచారు. సిట్రోయెన్ తన మొదటి కారుని లాంచ్ చేయడానికి ముందే దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు గురుగ్రామ్‌లలో వంటి ప్రాంతాలలో 10 షోరూమ్‌లను ఓపెన్ చేసింది. మొత్తానికి ధరల పెరుగుదల తరువాత అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా.. లేదా అనే విషయం త్వరలో తెలుస్తుంది.

భారత్‍లో రూ. 1.40 లక్షలు పెరిగిన Citroen C5 Aircross ధర: వివరాలు

సిట్రోయెన్ (Citroen) ప్రస్తుతం భారతదేశంలో సి5 ప్రీమియం ఎస్‌యూవీని విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు కంపెనీ తమ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ సి3 ని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సిట్రోయెన్ సి5 తర్వాత భారత మార్కెట్లో కంపెనీ అందించే రెండవ కారు సి3 అవుతుంది. సిట్రోయెన్ సి3 ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ నుండి రానున్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి సిట్రోయెన్ సి3 ప్రవేశించబోతోంది.

Most Read Articles

English summary
Citroen c5 aircross price hiked by rs 1 40 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X