సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ ఈనెల ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మరియు మొట్టమొదటి మోడల్ 'సి5 ఎయిర్‌క్రాస్' ఎస్‌యూవీ డెలివరీలను ప్రారంభించింది. ఈ కారును ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ సర్‌ప్రైజ్ డెలివరీలు చేసింది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని కంపెనీ ఏప్రిల్ 7, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ కోసం అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించిన మొదటి రోజునే 1,000 మందికి పైగా కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

భారత మార్కెట్లో కొత్త సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.29.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇధి ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ రెండు వేరియంట్లను దాదాపుగా ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో విక్రయిస్తోంది.

MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

సిట్రోయెన్ ఇప్పటివరకు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 10 షోరూమ్‌లను తెరిచింది. కాగా, త్వరలోనే ఈ కంపెనీ దేశవ్యాప్తంగా మరిన్ని కొత్త డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించాలని చూస్తోంది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో కానీ లేదా డీలర్‌షిప్‌లో కానీ రూ.50,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క పిఎస్‌ఎ ఇఎమ్‌పి 2 ప్లాట్‌ఫాంపై తయారు చేశారు. క్రాస్ఓవర్ డిజైన్‌ను కలిగి ఉండేలా రూపొందించబడిన ఈ కారులో డ్యూయల్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ట్విన్ స్లాట్ స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:అలెర్ట్.. అక్కడ కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ బంద్; కొత్త సిస్టమ్ స్టార్ట్

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన షైన్‌లో ఫుట్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

అంతేకాకుండా, ఇందులో ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, రిక్లైనింగ్ రియర్ సీట్స్, హైడ్రాలిక్ కుషన్ సస్పెన్షన్ సిస్టమ్, పానరోమిక్ సన్‌రూఫ్, ప్రత్యేకమైన గ్రిప్ కంట్రోల్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా లభించనున్నాయి. ఈ రెండు వేరియంట్లు ఒకే రకమైన డీజిల్ ఇంజన్‌తో లభిస్తాయి.

MOST READ:కరోనా టైమ్‌లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారును మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - ఈ కారు యొక్క పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం

హైదరాబాద్‌లో సిట్రోయెనో షోరూమ్‌ను బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంది. దీని చిరునామా 8-2-686/బి12 ఎ & బి, రోడ్ నెం. 12, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500034 గా ఉంది. త్వరలోనే ఈ కంపెనీ మరొక కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయాలి ప్లాన్ చేస్తోంది మరియు ఇది 35 ఎయిర్‌క్రాస్ కన్నా దిగువన ఉంచబడుతుంది.

MOST READ:శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

Most Read Articles

English summary
Citroen C5 Aircross SUV Deliveries Commenced In India. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X