సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ భారత మార్కెట్లో తమ మొట్టమొదటి మోడల్ సి5 ఎయిర్‌క్రాస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసినదే. మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రానున్న ఈ ఎస్‌యూవీని కంపెనీ ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనుంది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..

ఈ నేపథ్యంలో, ఈ రెండు వేరియంట్లకు సంబంధించిన ఫీచర్లు మరియు ఇతర వివరాలు వెల్లడయ్యాయి. సిట్రోయెన్ ఇప్పటికే తమ చెన్నై ప్లాంట్‌లో సి5 ఎయిర్‌క్రాస్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ ఎస్‌యూవీ నాలుగు మోనో టోన్, మూడు టూ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..

సి5 ఎయిర్‌క్రాస్ కారులో సింగిల్ టోన్ పార్లా నేరా బ్లాక్, టిజుకా బ్లూ, పెరల్ వైట్ మరియు కోలామస్ గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా, టిజుకా బ్లూ, పెరల్ వైట్ మరియు క్యుములస్ గ్రే కలర్ ఆప్షన్లలో డ్యూయల్ టోన్ విత్ బ్లాక్ రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్‌రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం ఒకే ఒక ఇంజన్ ఆప్షన్‌తో రానుంది. ఇందులోని డీజిల్ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ 'ఫీల్' వేరియంట్

  • 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్
  • ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
  • హ్యాలోజన్ హెడ్‌ల్యాంప్స్
  • సైడ్ మిర్రర్స్‌పై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్
  • కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో
  • సిక్స్ స్పీకర్ స్టీరియో సిస్టమ్
  • 6-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
  • కీలెస్ ఎంట్రీ
  • MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

    సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..
    • డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
    • పార్క్ అసిస్ట్
    • పడల్ ల్యాంప్స్
    • ఎయిర్ ప్యూరిఫైయర్
    • క్రూయిజ్ కంట్రోల్
    • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
    • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్
    • వన్ టచ్ ఫ్రంట్ మరియు రియర్ విండో
    • ఫాలో మి హోమ్ హెడ్‌ల్యాంప్స్
      • 12.3-ఇంచ్ కస్టమైజబల్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే
      • గేర్ షిఫ్ట్ ఇండికేటర్
      • డ్రైవ్ మోడ్స్ - ఎకో అండ్ స్పోర్ట్
      • గ్రిప్ కంట్రోల్ - స్టాండర్డ్, స్నో, ఆల్-టెర్రైన్ మరియు శాండ్
      • బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
      • ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
      • ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు
      • రివర్స్ పార్కింగ్ సెన్సార్
      • ఫ్రంట్ ప్యాసింజర్ మరియు వెనుక సీటుపై ఐసోఫిక్స్ మౌంట్
      • సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..
        • సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ 'ఫీల్' వేరియంట్
        • ఇందులో ఫీల్ వేరియంట్‌లలో లభించే ఫీచర్లతో పాటుగా, క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి.
        • పానోరోమిక్ సన్‌రూఫ్
        • ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు
        • హ్యాండ్స్ ఫ్రీ ఎలక్ట్రిక్ టెయిల్ లైట్స్
        • MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

          సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు..

          సిట్రోయెన్ ఇటీవలే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తమ మొట్టమొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా, కంపెనీ అధికారి ఒకరు మాట్లాడుతూ రాబోయే వారాల్లో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో లా మేసన్ సిట్రాన్ డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని చెప్పారు. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ జీప్ కంపాస్, హ్యుందాయ్ టూసాన్ మరియు హోండా సిఆర్-వి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Citroen C5 Aircross Variant Wise Explained. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X