స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

భారతదేశంలో రోజు రోజుకి వాహన తయారీ కంపెనీలు కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా కంపెనీలు తమ బ్రాండ్స్ నుంచి కొత్త వాహనాలను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించాయి. ఇప్పుడు ప్రముఖ ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా తన సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరో వాహనాన్ని తన బ్రాండ్ నుంచి విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన సిసి 21 మార్కెట్లోకి త్వరలో తీసుకురానుంది. ఈ కొత్త వెర్షన్ టెస్టింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఇటీవల ఇది టెస్ట్ చేసే సమయంలో కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించి సమాచారం ప్రకారం, సిట్రోయెన్ సిసి 21 ఎస్‌యూవీని 2021 సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టిన తరువాత ఈ ఎస్‌యూవీని కంపెనీ భారతీయ మార్కెట్లో కూడా విడుదల చేస్తుంది. ఇదే సమయంలో, కంపెనీ తన ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా పనిచేస్తోంది, దీనిని 2022 లో ప్రారంభించవచ్చు. సిట్రోయెన్ సిసి 21 ఎస్‌యూవీ కంపెనీ యొక్క సాధారణ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది ప్యుగోట్ 208 డిజైన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

సిట్రోయెన్ కంపెనీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో పాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లకు కూడా తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. మనకు అందుబాటులో ఉన్న ఈ ఫోటోల ప్రకారం సిట్రోయెన్ సిసి21 డిజైన్ సి3 ఎయిర్‌క్రాస్ మరియు సి5 ఎయిర్‌క్రాస్‌ల మాదిరిగానే ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

హై గ్రౌండ్ క్లియరెన్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు,అండర్ బాడీ క్లాడింగ్ వంటివి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఇవ్వబడ్డాయి. కారు యొక్క ఎల్‌ఈడీ హెడ్‌లైట్ బంపర్‌పై ఉంచగా, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్ దాని పైన అమర్చబడి ఉంటుంది. మొత్తానికి ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

త్వరలో రానున్న ఈ ఎస్‌యూవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకూండా ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా ఉంటాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

సిట్రోయెన్ సిసి21 యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 130 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీ సంస్థ యొక్క ఫ్లెక్స్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ కలిగి ఉన్న మొదటి మోడల్ ఈ ఎస్‌యూవీ అవుతుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

ఫ్లెక్స్ ఇంజిన్ అనేది పెట్రోల్ మరియు ఇథనాల్ మిశ్రమం మీద పనిచేసే ఇంజిన్. ఈ ఇంజిన్‌ పూర్తిగా ఇథనాల్‌తో కూడా నడపవచ్చు. రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరల వల్ల మరియు బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఈ విధమైన వ్యవస్థా ఇందులో ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ సిస్టం ఉన్న వెహికల్స్ ఎక్కువగా అందుబాటులోకి రానున్నాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన సిట్రోయెన్ కొత్త బ్రాండ్: వివరాలు

సిట్రోయెన్ సిసి21 భారతదేశంలో అత్యంత పోటీతత్వ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రానుంది. కావున ఈ ఎస్‌యూవీ మార్కెట్లో ఉండే హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Citroen CC21 Spy Pics Bangalore Spotted Testing. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X