భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

భారత్‌లోకి మరొక కొత్త కార్ బ్రాండ్ ప్రవేశించింది. ఫ్రాన్స్‌కి చెందిన సిట్రోయెన్, భారతదేశంలో తన మొట్టమొదటి కార్ షోరూమ్‌ను ప్రారంభించింది. అంతేకాదు, సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఈ కంపెనీ అతి త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

ఫ్రాన్స్‌లోని పిఎస్‌ఎ గ్రూప్ కింద పనిచేస్తున్న సిట్రోయెన్, భారతదేశంలో తమ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందే, అందుకు తగిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులోభాగంగానే, భారతదేశంలో తమ మొట్టమొదటి కార్ షోరూమ్‌ను అహ్మదాబాద్‌లో ప్రారంభించింది.

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి నుంచి మార్చ్ 2021) నాటికి తమ మొట్టమొదటి కారు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ కారును ఫిబ్రవరి 1వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఆ సమయంలోనే దీని బుకింగ్స్, ధర మరియు ఇతర వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

MOST READ:భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ మోడల్‌ని సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్‌గా భారతదేశానికి విడిభాగాల రూపంలో దిగుమతి చేసుకొని, చెన్నై సమీపంలో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. మార్కెట్ అంచనా ప్రకారం, దేశీయ మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

సిట్రోయెన్ తమ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఒకే ఒక వేరియంట్ రూపంలో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందించనున్నట్లు సమాచారం. ఇందులో శక్తివంతమైన 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. దీని పవర్ మరియు టార్క్ గణాంకాలు ఇంకా తెలియాల్సి ఉంది.

MOST READ:ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఈ సి5 ఎయిర్‌క్రాస్ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే పెద్ద 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానరోమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉండొచ్చని అంచనా.

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

ఇక సిట్రోయెన్ భారతదేశంలో కొత్తగా ప్రారంభిస్తున్న డీలర్‌షిప్‌ విషయానికి వస్తే, వీటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీ తీర్చిదిద్దింది. గ్లోబల్ మార్కెట్లలో ఈ షోరూమ్‌లను 'లా మైసన్'పేరుతో నిర్వహిస్తోంది. ఫ్రెంచ్‌లో లా మైసన్ అంటే 'ఇళ్లు' అని అర్ధం. అక్కడి మాదిరిగా మనదేశంలో కూడా వీటిని 'సిట్రోయెన్ యొక్క ఇళ్లు'గా కంపెనీ నిర్వహించనుంది.

MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

ఈ అధునాతన కార్ షోరూమ్‌లలో 3డి కాన్ఫిగరేటర్, వర్చువల్ మ్యూజియం, పాతకాలపు కార్ల ప్రదర్శన మరియు సిట్రోయెనిస్ట్ కేఫ్ మొదలైన సదుపాయాలు ఉండొచ్చని ఆశిస్తున్నారు. ఇవన్నీ కలిపి వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందిస్తాయని భావిస్తున్నారు.

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

సిట్రోయెన్ లా మైసన్ షోరూమ్‌లను ముందుగా దేశంలోని పది ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నారు. వీటిలో ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్ మరియు కొచ్చి నగరాలు ఉన్నాయి. ఇందులో తొలి లా మైసన్ డీలర్‌షిప్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభించారు.

MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల

సిట్రోయెన్ తన భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, భారత మార్కెట్ కోసం అధునాతన కార్లను పరిచయం చేయనుంది. సిట్రోయెన్ తన సి-క్యూబ్డ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ప్రతి సంవత్సరం ఓ కొత్త మోడల్‌ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై సి5 ఎయిర్‌క్రాస్‌ను కూడా తయారు చేస్తున్నారు.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌ ఇది ఈవిభాగంలో హ్యుందాయ్ టూసాన్, స్కొడా కొడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ వంటి మోడళ్లతో పోటీపడే అవకాశం ఉంది. రానున్న సంవత్సరాల్లో సిట్రోయెన్, భారతదేశంలో తమ కార్లను పూర్తిగా 100 శాతం స్థానికంగానే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

English summary
Citroen Opens Its First Dealership In India In Ahmedabad, Plans To Launch C5 Aircross Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X