హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ భారత మార్కెట్లోకి అధికారికంగా తమ మొట్టమొదటి కారు సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి ముందే, దేశవ్యాప్తంగా తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో కంపెనీ బిజీగా ఉంది.

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

సిట్రోయెన్ ఇండియా కొత్తగా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో తమ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్లను ఓపెన్ చేసింది. సిట్రోయెన్ తమ మొట్టమొదటి షోరూమ్‌ను అహ్మదాబాద్‌లో ప్రారంభించింది. కంపెనీ ఇప్పుడు పూణే, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, కొచ్చి, గురుగ్రామ్ వంటి ఆరు కొత్త నగరాల్లో కూడా తమ డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించింది.

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

హైదరాబాద్‌లో సిట్రోయెనో తమ షోరూమ్‌ను బంజారాహిల్స్ ప్రాంతంలో ప్రారంభించింది. దీని చిరునామా 8-2-686/బి12 ఎ & బి, రోడ్ నెం. 12, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500034 గా ఉంది. ఏప్రిల్ 7వ తేదీన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని కంపెనీ దేశవ్యాప్తంగా విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ మోడల్ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

MOST READ:బాబూ నీ తెలివికి జోహార్లు: మద్యం అక్రమ రవాణాపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

ఫ్రాన్స్‌లో పాపులర్ అయిన ఈ కార్ బ్రాండ్ భారతదేశంలో తమ షోరూమ్‌లను లా మైసన్ (సిట్రోయెన్ యొక్క ఇళ్లు) అని అర్ధం వచ్చే థీమ్‌తో నిర్వహిస్తోంది. ఈ షోరూమ్‌లను సందర్శించే కస్టమర్లకు కంపెనీ ఫిజిటల్ (ఫిజికల్ + డిజిటల్) కొనుగోలు అనుభవాన్ని అందించనుంది. ఈ షోరూమ్‌లు పూర్తి ఆధునిక టెక్నాలజీతో, కొనుగోలుదారుకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి.

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

ఇక కంపెనీ విడుదల చేయబోయే సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, దీనిని పిఎస్‌ఏ ఈఎమ్‌పి2 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఇది 4,500 మి.మీ పొడవును, 2,099 మి.మీ వెడల్పును, 1,710 మి.మీ ఎత్తును మరియు 2,730 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:విరాట్ కోహ్లీ గిఫ్ట్‌గా పొందిన 'హ్యుందాయ్ ఐ 20' ; పూర్తి వివరాలు

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే విక్రయించనున్నారు. ఎక్కువ వేరియంట్లను ప్రవేశపెట్టి కస్టమర్లను గందరగోళానికి గురిచేయకుండా, కంపెనీ ఈ మోడల్‌ను ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందించనుంది.

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ టాప్ ఎండ్ (షైన్) వేరియంట్లలో ఫుట్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

అంతేకాకుండా, ఇందులో ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, వెనుక వరుసలో 3 పర్సనల్ అండ్ రిక్లైనింగ్ అడ్జస్టబల్ మాడ్యులర్ సీట్స్ మరియు బూట్ స్థలాన్ని పెంచడానికి వీలుగా వెనుక సీట్లను పూర్తిగా మడుచుకునే సౌకర్యం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌లో హైడ్రాలిక్ కుషన్ అమర్చిన సస్పెన్షన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇది కఠినమైన భూభాగాలపై కూడా సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకా ఇందులో పానరోమిక్ సన్‌రూఫ్, ప్రత్యేకమైన గ్రిప్ కంట్రోల్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా లభించనున్నాయి.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

హైదరాబాద్‌లో సిట్రోయెన్ కార్ షోరూమ్ ఎక్కడుందో తెలుసా? అడ్రస్, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారును మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Citroen Opens Six New Dealership Centers In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X