సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

స్టెలాంటిస్ సంస్థలో భాగమైన ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి కారు 'సి5 ఎయిర్‌క్రాస్'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త కారు విడుదలతో పాటుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కంపెనీ తమ "లా మైనస్" థీమ్ షోరూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది.

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

భారత ప్యాసింజ్ కార్ మార్కెట్లో మంచి పట్టు సాధించేందుకు గానూ సిట్రోయెన్ భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. రానున్న మూడేళ్ళలో భారత మార్కెట్లో కొత్తగా మరో నాలుగు కార్లను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త పోర్ట్‌ఫోలియోలో ఓ ఎలక్ట్రిక్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

అయితే, సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ తర్వాత ఈ ఫ్రెంచ్ బ్రాండ్ నుండి భారత్‌కు రానున్న మరొక కొత్త ఉత్పత్తి 'సిసి26' సెడాన్‌గా తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో దీనిని హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ మరియు టొయోటా యారిస్ వంటి మిడ్-సెగ్మెంట్ సెడాన్లకు పోటీగా ప్రవేశపెట్టనున్నారు.

MOST READ:మళ్ళీ వివాదంలో చిక్కుకున్న దుల్కర్ సల్మాన్.. అసలు విషయం ఏంటంటే?

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సిట్రోయెన్ సిసి26 సెడాన్‌ను కంపెనీ అంబాసిడర్ బ్రాండ్‌తో ప్రమోట్ చేయవచ్చని సమాచారం. ఇందుకు ప్రధాన కారణం, ప్రస్తుతం స్టెలాంటిస్‌లో భాగమైన పూర్వపు పిఎన్ఏ గ్రూప్, కొన్ని సంవత్సరాల క్రితం హిందూస్తాన్ మోటార్స్ నుండి అంబాసిడర్ బ్రాండ్ పేరును సుమారు రూ.80 కోట్లకు కొనుగోలు చేసింది.

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

ఈ నేపథ్యంలో, సిట్రోయెన్ నుండి రాబోయే కొత్త సిసి26 సెడాన్‌కు, భారతదేశంలో దశాబ్దాల కాలంగా మన రహదారులను పాలించిన ఐకానిక్ అంబాసిడర్ కారు పేరును పెట్టొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ అంబాసిడర్ పేరును ఉపయోగించుకొని సిట్రోయెన్ దేశ ప్రజలకు మరింత చేరువ కావాలని ప్లాన్ చేస్తోంది.

MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

భారత్ కోసం సిట్రోయెన్ ప్లాన్ చేస్తున్న ఈ మిడ్-సైజ్ సెడాన్ సుమారు రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉంటుందని అంచనా. హిందుస్థాన్ మోటార్స్ వారి అంబాసిడర్ బ్రాండ్ ఖచ్చితంగా భారత మార్కెట్లో చాలా మంచి విలువ కలిగినది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకూ కార్ అంటే ఇది, అనే భావనను కలిగించింది మన అంబాసిడర్ కారు.

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

భారతదేశంలో అంబాసిడర్ కారుకు చాలా పెద్ద చరిత్రే ఉంది. మన దేశంలో తయారు చేసిన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కారు ఇది. అంతేకాదు, దేశంలోనే ఎక్కువ కాలం ఉత్పత్తిలో ఉన్న కారు కూడా ఇదే. ఈ నేపథ్యంలో, సిట్రోయెన్ ఈ అంబాసిడర్ బ్రాండ్ విలువను పరిగణలోకి తీసుకొని, తమ కొత్త కారుకు ఈ బ్యాడ్జ్‌ను తెలివిగా మరియు జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

ఇక భారతదేశంలోని సిట్రోయెన్ నుండి రాబోయే ఇతర కార్ల విషయానికి వస్తే, కంపెనీ విడుదల చేసిన సి5 ఎయిర్‌క్రాస్ ప్రీమియం ఉత్పత్తి కాబట్టి ఇది మాస్-మార్కెట్‌ను లక్ష్యంగా చేయదు. ఈ నేపథ్యంలో సరసమైన ధరకే ఓ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ప్లాన్ చేస్తోంది. సిట్రోయెన్ సిసి21 అని కోడ్‌నేమ్‌తో ఈ కారును డెవలప్ చేస్తున్నారు.

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

సిట్రోయెన్ ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న సి3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ఆధారంగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసే అవకాశం ఉంది. సిట్రోయెన్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆగస్టు-సెప్టెంబరు 2021 నాటికి విడుదల చేయవచ్చని అంచనా. ఈ మోడల్‌లో పెట్రోల్/డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా పూర్తి ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా ఉంటుందని సమాచారం.

MOST READ:భారత్‌లో విడుదలైన జపనీస్ లగ్జరీ కార్.. ఇది చాలా కాస్ట్లీ గురూ.!!

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

సిసి21 కారును పిఎస్ఓ గ్రూప్ యొక్క కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫాం (సిఎమ్‌పి) ఆధారంగా తయారు చేసే అవకాశం ఉంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ తయారు చేస్తున్న విస్తృత శ్రేణి మోడళ్లలోని భాగాలను సిసి21లో కూడా ఉపయోగించవచ్చని సమాచారం. సిట్రోయెన్ సిసి21 మూడు వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

సిట్రోయెన్ సిసి21 కారులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ మోడల్ తయారీని పూర్తిగా 100 స్థానికీకరించడం ద్వారా కంపెనీ దీని ధరను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. సిట్రోయెన్ నుండి రాబోయే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో కియా సోనెట్, రెనో కైగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

సర్‌ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్‌ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కూడా సిట్రోయెన్ ఓ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. సిసి24 కోడ్‌నేమ్‌తో ఈ కారును డెవలప్ చేస్తున్నారు. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టో వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది. ఇది జూన్ 2022 నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా.

Most Read Articles

English summary
Citroen Plans To Relaunch The Iconic Ambassador Brand Through CC26 Sedan, Details. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X