2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఇటీవల అన్ని కంపెనీలు తమ ఏప్రిల్ 2021 అమ్మకాల నివేదికను విడుదల చేశాయి. అయితే, ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుతం ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్‌లో కార్లు మరియు ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగా పడిపోయాయి.

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

కార్లు మరియు బైకుల అమ్మకాలు మాత్రమే కాదు, ప్రస్తుతం కమర్షియల్ అమ్మకాలు కూడా బాగా పడిపోయాయి. ఇప్పుడు 2021 ఏప్రిల్ నెలలో జరిగిన కమర్షియల్ వెహికల్ అమ్మకాలు గణాంకాలను పరిశీలిస్తే, చాలా వరకు తగ్గుముఖం పట్టాయని స్పష్టంగా అర్థమవుతుంది.

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

ప్రస్తుతం కరోనా మహమ్మరి కారణంగా 2020 లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే, ఈ లాక్ డౌన్ కారణంగా 2020 ఏప్రిల్‌లో ఏ ఒక్క కంపెనీ కూడా ఒక్క వాహనాన్ని విక్రయించలేదు. అయితే ఇటీవల వెలువడిన నివేదికల ప్రకారం, అన్ని వాణిజ్య వాహనాల తయారీదారులు 2021 ఏప్రిల్ నెలలో 38,104 యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది.

MOST READ:కరోనా నివారణ కోసం ఫస్ట్ డ్రైవ్-ఇన్ వ్యాక్సిన్ క్యాంప్ స్టార్ట్ చేసిన BMC

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

ఈ ఏడాది మార్చిలో 76,053 యూనిట్ల కమర్షియల్ వాహనాల విక్రయం జరిగింది. గత నెలలో కమర్షియల్ వాహన అమ్మకాలు దాదాపు 49.90% పడిపోయాయని తెలుస్తోంది. ఈ విధంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ సంక్రమణ.

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే
Commercial Vehicle Apr-21 Mar-21 MOM %
Tata 14,435 36,955 -60.94
Mahindra 14,104 17,116 -17.60
Ashok Leyland 7,961 15,761 -49.49
VECV 1,604 6,221 -74.22
Total 38,104 76,053 -49.90

MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్‌తో అక్రమాలకు చెక్..

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రకారం, 2021 ఏప్రిల్ నెలలో 14,435 యూనిట్ల వాణిజ్య వాహనాలను విక్రయించి ఈ జాబితాలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇదే 2021 మార్చిలో కంపెనీ 36,955 యూనిట్లను విక్రయించింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కంపెనీ అమ్మకాలు 60.94% పడిపోయాయి.

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

ఈ జాబితాలో మహీంద్రా & మహీంద్రా రెండవ స్థానంలో ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం, మహీంద్రా అండ్ మహీంద్రా ఏప్రిల్ నెలలో 14,104 యూనిట్ల కమర్షియల్ వాహనాలను విక్రయించింది. ఇదే మార్చిలో కంపెనీ 17,116 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే మహీంద్రా అమ్మకాలు 17.60 శాతం తగ్గాయి.

MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

కమర్షియల్ వాహనాల జాబితాలో అశోక్ లేలాండ్ మూడవ స్థానంలో ఉంది. అశోక్ లేలాండ్ వాణిజ్య వాహన అమ్మకాలు గత నెలలో 49.49% పడిపోయాయి. అశోక్ లేలాండ్ ఏప్రిల్‌లో 7,961 యూనిట్లను మాత్రమే విక్రయించింది, గత ఏడాది ఇదే నెలలో 15,761 యూనిట్లను విక్రయించింది.

2021 ఏప్రిల్‌లో భారీగా తగ్గిన కమర్షియల్ వెహికల్ సేల్స్; కారణం ఇదే

వోల్వో-ఐషర్ కమర్షియల్ వెహికల్ గ్రూప్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. ఈ కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 ఏప్రిల్‌లో మొత్తం 1,604 యూనిట్లను విక్రయించింది. మార్చిలో కంపెనీ మొత్తం 6,221 యూనిట్లను విక్రయించింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కంపెనీ అమ్మకాల పరిమాణం 74.22% తగ్గింది.

MOST READ:రోడ్డు నిర్మాణంలో రూ. 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్న కేంద్రం

Most Read Articles

English summary
Commercial Vehicle Sales Declines In April 2021. Read in Telugu.
Story first published: Wednesday, May 5, 2021, 17:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X