రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇండియా తమ కార్ల కోసం ఓ సరికొత్త యాక్ససరీని విడుదల చేసింది. కారులోని బ్యాటరీ నిర్వీర్యం అయినప్పుడు, సులువుగా కారును స్టార్ట్ చేసేందుకు వీలుగా మారుతి సుజుకి ఓ కాంపాక్ట్ రీచార్జబల్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసింది.

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఈ జంప్ స్టార్ట్ కిట్‌లో పవర్ బ్యాంక్, చార్జింగ్ కేబుల్ మరియు కారు బ్యాటరీని కనెక్ట్ చేయడానికి జంపర్ కేబుల్సు ఉంటాయి. ఈ పవర్ బ్యాంక్ పరిమాణంలో చిన్నదిగా ఉండి, జేబులో సరిపోయేంతలా ఉంటుంది. కాబట్టి మీతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు.

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఈ పవర్ బ్యాంక్‌ను కేవలం కారును స్టార్ట్ చేయటం కోసం మాత్రమే కాకుండా, మొబైల్ ఫోన్ వంటి గ్యాడ్జెట్లను కూడా దీని సాయంతో చార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌లో ఎల్‌ఈడీ లైట్ కూడా ఉంటుంది. కార్ బ్రేక్ డౌన్ సమయంలో ఇది అత్యవసర లైట్‌గా ఉపయోగపడుతుంది.

MOST READ:రతన్ టాటా వెహికల్ నెంబర్ వాడుతూ పట్టుబడ్డ యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఇంకా ఇది యుఎస్‌బి ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జర్‌ను సపోర్ట్ చేసే గ్యాడ్జెట్లను దీని సాయంతో సులువుగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌లో 14.8 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. కారును స్టార్ట్ చేయడానికి కావల్సిన పవర్ ఇందులో ఉంటుంది.

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఈ కాంపాక్ట్ రీచార్జబల్ జంప్ స్టార్ట్ కిట్ తమ ఉద్ద ఉంటే, కస్టమర్లు తమ కారును స్టార్ట్ చేయటం కోసం వేరే కారు సాయాన్ని కోరాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే, పొడవైన జంపర్స్ కేబుల్స్‌తో కూడా పని ఉండదు.

MOST READ:గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్‌లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఈ జంప్ స్టార్టర్ కిట్‌ను మారుతి సుజుకి అధికారిక షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లు మరియు జెన్యూన్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ అవుట్‌లెట్ల ద్వారా కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి, ప్రొద్దుపొద్దున్నే కార్లు స్టార్ట్ కాకుండా మొండికేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ కిట్ చాలా చక్కగా పనిచేస్తుంది.

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఇక మారుతి సుజుకి ఇండియాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ అందిస్తున్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో తాజాగా చిన్న కార్లను జోడించి, సరసమైన ధరకే ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.

MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇప్పటికే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ మరియు ఎక్స్‌ఎల్6 వంటి ప్రీమియం కార్లను అందిస్తోంది. కాగా, ఈ ప్లాన్‌లో కొత్తగా ఎస్-క్రాస్, ఇగ్నిస్ మరియు వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్లను జోడించింది.

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

కొత్త వాహనాల విషయంలో లాంగ్ టెర్మ్ కమిట్‌మెంట్ లేకుండా, కొంత కాలం వరకూ వాటిని ఉపయోగించి ఆ తర్వాత మరో కొత్త కారును నడపాలనుకునే వారికి ఈ సబ్‌స్క్రిప్షన్ (చందా) ప్లాన్ అనువుగా ఉంటుంది.

MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఈ సబ్‌స్క్రిప్షన్ విధానం ద్వారా కారును లీజుకు తీసుకోవటం వలన కస్టమర్లు డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఇందులో ఫుల్ కార్ మెయింటినెన్స్, కంప్లీట్ ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

రీచార్జబల్ కాంపాక్ట్ జంప్ స్టార్ట్ కిట్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఇదిలా ఉంటే, గడచిన డిసెంబర్ 2020లో మారుతి సుజుకి ఇందియా దేశీయ మార్కెట్లో 1,50,288 కార్లను విక్రయించి, డిసెంబర్ 2019తో అమ్మకాలతో (1,25,735 యూనిట్లతో) పోల్చుకుంటే 19.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Source: Team BHP

Most Read Articles

English summary
Maruti Suzuki launches compact rechargeable jump start kit. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X