Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!
ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీలే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఈ విభాగాల్లో పోటీ ఎక్కువగా ఉంటే, కొత్తగా వచ్చిన సోనెట్, మాగ్నైట్ మరియు కైగర్ వంటి మోడళ్లతో ఈ పోటీ మరింత అధికమైంది.

తాజాగా, గడచిన ఫిబ్రవరి 2021 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీల వివరాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో సరికొత్త అవతార్‌లో వచ్చిన 2020 క్రెటా అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానంలో విటారా బ్రెజ్జా నిలిచింది.

గడచిన ఫిబ్రవరి 2021 నెలలో హ్యుందాయ్ క్రెటా గరిష్టంగా 12,428 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య కేవలం 700 యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ సమయంలో క్రెటా అమ్మకాలు అత్యధికంగా 1675 శాతం వృద్ధిని సాధించాయి.
MOST READ:జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!

మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రెజ్జా గడచిన నెలలో 11,585 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఈ మోడల్ అమ్మకాలు 6,866 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బ్రెజ్జా అమ్మకాలు 69 శాతం పెరిగాయి.

హ్యుందాయ్ వెన్యూ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ సమయంలో వెన్యూ అమ్మకాలు 9 శాతం పెరిగి 10,321 యూనిట్ల నుండి 11,224 యూనిట్లకు పెరిగాయి. కియా సెల్టోస్ అమ్మకాలు 40.7 శాతం క్షీణించి 14,024 యూనిట్ల నుండి 8,305 యూనిట్లకు పడిపోయాయి.
Rank | Model | February 2021 | February 2020 | Growth (%) |
1 | Maruti Vitara Brezza | 11,585 | 6,866 | 69 |
2 | Hyundai Venue | 11,224 | 10,321 | 9 |
3 | Kia Sonet | 7,997 | 0 | - |
4 | Tata Nexon | 7,929 | 3,894 | 104 |
5 | Renault Kiger | 3,226 | - | - |
6 | Mahindra XUV300 | 3,174 | 2,431 | 31 |
7 | Ford Ecosport | 3,171 | 3,317 | -15 |
8 | Nissan Magnite | 2,991 | 0 | - |
9 | Toyota Urban Cruiser | 2,549 | 0 | - |
10 | Honda WR-V | 1,004 | 0 | - |
MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

గతేడాది మార్కెట్లోకి విడుదలైన కియా సోనెట్ ఈ జాబితాలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో కియా సోనెట్ అమ్మకాలు 7,997 యూనిట్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ అమ్మకాలు గరిష్టంగా 103 శాతం వృద్ధిని సాధించి 3,894 యూనిట్ల నుండి 7,929 యూనిట్లకు పెరిగాయి.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల ఎమ్‌జి హెక్టర్ అమ్మకాలు జోరందుకున్నాయి. గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 3,662 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2020లో ఇదే మోడల్ అమ్మకాలు 1,218 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో హెక్టర్ అమ్మకాలు 200 శాతం పెరిగాయి.
MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

ఇకపోతే, మహీంద్రా స్కార్పియో అమ్మకాలు 134 శాతం వృద్ధి చెంది 1,505 యూనిట్ల నుండి 3,532 యూనిట్లకు పెరిగాయి. గత నెలలోనే మార్కెట్లోకి విడుదలైన రెనో కైగర్ ఈ జాబితాలో 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సమయంలో కైగర్ అమ్మకాలు 3,226 యూనిట్లుగా నమోదయ్యాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 అమ్మకాలు 30 శాతం వృద్ధి చెంది 2,431 యూనిట్ల నుండి 3,174 యూనిట్లకు పెరిగాయి. గత నెలలో 3,171 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లు అమ్ముడయ్యాయి. ఇకపోతే, నిస్సాన్ మాగ్నాట్, మహీంద్రా థార్ మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్ మోడళ్ల అమ్మకాలు వరుసగా 2,991, 2,842 మరియు 2,549 యూనిట్లుగా నమోదయ్యాయి.
MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే
Source: Autopunditz