ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, ఇటీవలే తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్ యొక్క కొత్త పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చిన ఈ కొత్త వేరియంట్‌తో రాబోయే నెలల్లో ఫోర్డ్ ఫిగో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని ఫోర్డ్ ఇండియా ఆశాభావంతో ఉంది.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌కు భారత మార్కెట్లో గట్టి పోటీనే ఉంది. ఇది ఈ విభాగంలో నేరుగా మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. స్విఫ్ట్ మరియు గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లు రెండూ కూడా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తున్నాయి. మరి ఈ మూడు మోడళ్లలో ఉన్న తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ఇంజన్ మరియు గేర్‌బాక్స్

ఫోర్డ్ ఫిగో ఈ విభాగంలోని ఇతర రెండు మోడళ్ల కంటే శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌లో 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 96 హెచ్‌పి శక్తిని మరియు 119 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

మారుతి సుజుకి స్విఫ్ట్ ఆటోమేటిక్ వేరియంట్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 88 హెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ఇకపోతే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆటోమేటిక్ వేరియంట్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 83 హెచ్‌పి శక్తిని 114 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

మైలేజ్

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరుకు 16 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. అలాగే, మారుతి సుజుకి స్విఫ్ట్ ఏఎమ్‌టి వేరియంట్ లీటరుకు 23.7 కిలోమీటర్ల మైలేజీని మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లీటరుకు 20.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. మైలేజ్ పరంగా స్విఫ్ట్ ముందంజలో ఉండగా, ఫిగో చివరిలో ఉంటుంది.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ఫీచర్లు

ఇంజన్ పరంగా ఫోర్డ్ ఫిగో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మెరుగ్గా ఉంటుంది.

గ్రాండ్ ఐ 10 నియోస్‌లో 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రియర్ ఏసి వెంట్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు / ఫాగ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ఇక మారుతి స్విఫ్ట్ విషయానికొస్తే, ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఆటోమేటిక్ ఏసి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ మరియు ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు మొదలైనవి ఉన్నాయి.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్‌లో ఫోర్డ్ పాస్ కెనెక్టింగ్ టెక్నాలజీ, నావిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాకపోతే, సేఫ్టీ పరంగా ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌పి, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఇతర కార్లలో అందుబాటులో ఉండవు.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

అంతేకాకుండా, ఫోర్డ్ ఫిగో కారులో రిమోట్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రిమోట్ లాక్ / అన్‌లాక్, ఓటిఎ అప్‌డేట్స్, వెహికల్ లొకేషన్ డిటెక్షన్, మొబైల్ ఫోన్ ద్వారా కారు యొక్క ఆటోమోటివ్ మరియు రీఫ్యూయలింగ్, ఆయిల్ మార్పిడి రిమైండర్స్, లో టైర్ ఎయిర్ ప్రెజర్ అలారం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

కొలతలు

ఫోర్డ్ ఫిగో 2490 మిమీ వీల్‌బేస్‌తో ఈ సెగ్మెంట్లోని ఇతర రెండు మోడళ్ల కన్నా విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఫోర్డ్ ఫిగో ఇతర రెండు కార్ల కన్నా పొడవు ఎక్కువగా ఉన్నప్పటికీ, బూట్ స్థలం విషయంలో మాత్రం సుమారు 10 లీటర్లు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడు మోడళ్లలో మారుతి స్విఫ్ట్ కాస్తంత వెడల్పుగా మరియు ఎక్కువ బూట్ స్పేస్ స్థలాన్ని కలిగి ఉంటుంది.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ధర

ధర పరంగా చూసుకుంటే, ఈ మూడు మోడళ్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఏఎమ్‌టి కారు చాలా చౌకైనది. మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఏఎమ్‌టి ధరలు రూ.6.62 లక్షల నుండి రూ.7.86 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

గ్రాండ్ ఐ10 నియోస్ తర్వాత అత్యంత సరసమైన మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్ ఏఎమ్‌టి. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.7.01 లక్షల నుండి రూ.8.42 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఫిగో vs స్విఫ్ట్ vs గ్రాండ్ ఐ10 నియోస్: ఏ ఆటోమేటిక్ వేరియంట్ బెస్ట్?

ఇకపోతే, ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.7.75 లక్షల నుంచి రూ.8.20 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Comparison Between Ford Figo, Maruti Swift And Hyundai Grand i10 Nios Automatic Models. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X