మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

హ్యాచ్‌బ్యాక్‌లను నడిపి బోర్ కొట్టి, కారును అప్‌గ్రేడ్ కావాలనుకునే వారి కోసం ప్రస్తుతం మార్కెట్లో పలు కాంపాక్ట్ సెడాన్లు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి అందిస్తున్న డిజైర్ మొదటి స్థానంలో ఉండగా, హ్యుందాయ్ అందిస్తున్న ఔరా ద్వితీయ స్థానంలో ఉంది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

మారుతి సుజుకి బ్రాండ్ పట్ల కస్టమర్ల ఎక్కువ విశ్వసనీయత ఉంది. అలాగే, హ్యుందాయ్ అందిస్తున్న కార్లు కూడా మంచి ప్రీమియం ఫీచర్లతో ధరకు మించిన వ్యాల్యూని అందిస్తాయి. మరి ఈ కథనంలో మారుతి సుజుకి డిజైర్ మరియు హ్యుందాయ్ ఔరా కాంపాక్ట్ సెడాన్ల మధ్య ఉన్న తేడాలు ఏమిటి, వీటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: ధరలు

మారుతి సుజుకి డిజైర్ ధర విషయానికి వస్తే, కంపెనీ ఈ కాంపాక్ట్ సెడాన్‌ను రూ.5.98 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే విక్రయిస్తోంది. ఇది నాలుగు ట్రిమ్స్‌లో మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.02 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

ఇక హ్యుందాయ్ ఔరా విషయానికి వస్తే, మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.5.97 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది కూడా నాలుగు ట్రిమ్‌లలో మొత్తం 12 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.31 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఒక పెట్రోల్, ఒక డీజిల్ మరియు ఒక టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఆరా: ఇంజన్

మారుతి సుజుకి డిజైర్‌లో 1.2-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఔరాలో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 171 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

ఇకపోతే, హ్యుందాయ్ ఔరాలోని 1.2-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 74 బిహెచ్‌పి పవర్‌ను మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ ఔరా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ సిఎన్‌జి ఆప్షన్‌లో కూడా లఊిస్తుంది. సిఎన్‌జి ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్‌పి పవర్‌ను మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

డిజైర్ vs ఔరా: సైజ్, డిజైన్ & ఎక్స్‌టీరియర్స్

మారుతి సుజుకి డిజైర్ కొలతలను గమనిస్తే, ఈ కారు పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,735 మిమీ, ఎత్తు 1,515 మిమీ మరియు వీల్‌బేస్ 2,450 మిమీగా ఉంటుంది. ఇందులో 378 లీటర్ల బూట్-స్పేస్ ఉంటుంది. కంపెనీ ఇటీవలే ఈ మోడల్ డిజైన్‌కు స్వల్ప అప్‌డేట్స్ చేసింది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

మారుతి డిజైర్ స్టైలిష్‌గా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు చాలా చోట్ల క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది. ఇది కారుకి మరింత ప్రీమియం అప్పీల్‌ను ఇస్తుంది. ఈ కారులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక భాగంలో ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఔరా కొలతల విషయానికి వస్తే, ఈ కారు పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,680 మిమీ, ఎత్తు 1,520 మిమీ మరియు వీల్‌బేస్ 2,450 మిమీగా ఉంటుంది. ఇందులో 402 లీటర్ల పెద్ద బూట్-స్పేస్ లభిస్తుంది. గడచిన జనవరి 2020 లో కంపెనీ ఈ కారును మార్కెట్లో విడుదల చేసింది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

ఔరా డిజైన్ కూడా చాలా స్పోర్టీగా ఉంటుంది. కంపెనీ ఇటీవలే ఈ కారులో రియర్ స్పాయిలర్‌ను కూడా జోడించింది. అంతే కాకుండా, ఈ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, వెనుకవైపు ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

డిజైర్ vs ఔరా: ఇంటీరియర్స్ మరియు ఫీచర్లు

మారుతి సుజుకి డిజైర్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్‌తో లభిస్తుంది. ఇందులో బ్లాక్ అండ్ బేజ్ కలర్ ఇంటీరియర్ థీమ్ ఉంటుంది. ప్రీమియం ఫీల్ కోసం కంపెనీ ఈ కారు లోపలి భాగంలో డ్యాష్‌బోర్డుపై మోడ్రన్ ఉడ్ యాక్సెంట్స్‌ను కూడా ఉపయోగించింది. ఇది కారు లోపలి అందాన్ని మరింత పెంచుతుంది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

ఫీచర్ల విషయానికి వస్తే, స్విఫ్ట్ డిజైర్‌లో యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచ్ టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆడియో సిస్టమ్ రిమోట్ కంట్రోల్, లెథర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఔరా విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ సెడాన్ లోపలి భాగం ఆల్ బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. ఈ కారులో చాలా చోట్ల రెడ్ ఇన్సర్ట్స్ కనిపిస్తాయి. ఇవి స్పోర్టీ ఫీల్‌ను మరింత పెంచుతాయి. ఇందులో స్టీరింగ్ వీల్ మాత్రమే లెథర్‌కో చుట్టబడి ఉంటుంది. కంపెనీ ఇందులో ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీని ఉపయోగించింది.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

ఈ కారులోని ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, 4 స్పీకర్లు, 4 పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ ట్రంక్ ఓపెనర్, రియర్ ఏసి వెంట్స్, సీట్ లంబార్ సపోర్ట్ మరియు స్మార్ట్ యాక్సెస్ కార్డ్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

మారుతి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: సేఫ్టీ ఫీచర్లు

మారుతి సుజుకి డిజైర్‌లో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబిఎస్ విత్ ఈబిడి, సెంట్రల్ లాకింగ్, బ్రేక్ అసిస్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్, సీట్ బెల్ట్ రిమైండర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఔరాలో ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ తెఫ్ట్ అలారం, చైల్డ్ సేఫ్టీ లాక్, రియర్ సీట్ బెల్ట్, సైడ్ ఇంపాక్ట్ బీమ్, క్రాష్ సెన్సార్, కెమెరా మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి డిజైర్ vs హ్యుందాయ్ ఔరా: వీటిలో ఏది బెస్ట్?

మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ?

ధర పరంగా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ మరియు మరియు హ్యుందాయ్ ఔరా కాంపాక్ట్ సెడాన్లు రెండూ ఇంచు మించు ఒకే రేంజ్‌లో ఉన్నాయి. కానీ ఫీచర్ల పరంగా చూసుకుంటే మారుతి డిజైర్ కన్నా హ్యుందాయ్ ఔరా ముందంజలో ఉంటుంది.

Most Read Articles

English summary
Comparison Between Maruti Suzuki Dzire And Hyundai Aura: Price, Specs And Features. Read in Telugu.
Story first published: Friday, July 30, 2021, 17:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X