భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

ఒకప్పుడు భారతదేశంలో డీజిల్ కార్లకు భలే గిరాకీ ఉండేది. పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే, డీజిల్ కార్ల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం ఎక్కువగా డీజిల్ కార్లకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇందుకు ప్రధాన కారణంగా, డీజిల్ కార్లు ఎక్కువ మైలేజీని ఆఫర్ చేయడం మరియు ఆ సమయంలో పెట్రోల్ కన్నా డీజిల్ ఇంధన ధరలు చాలా తక్కువగా ఉండటం.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

కస్టమర్లు ఎక్కువగా మైలేజీకి ప్రాధాన్యత ఇచ్చే మనదేశంలో, గడచిన దశాబ్ద కాలంగా డీజిల్ కార్ల అమ్మకాలు భారీగా క్షీణించాయి. భారతదేశంలో డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం, ఇటీవలి కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరల మధ్య తగ్గుతున్న వ్యత్యాసమే. ప్రస్తుతం, ఈ రెండు ఇంధనాల ధరలు ఇంచుమించు ఒకే రేంజ్ లో కొనసాగుతున్నాయి.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

ప్రజలు చౌక ధరకు లభించే ఇంధనం మరియు అధిక మైలేజ్ వంటి అంశాల నేపథ్యంలో డీజిల్ కార్లను కొనుగోలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో ఇంధన ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరలను దాదాపు సమాన స్థాయికి వచ్చాయి. ప్రత్యేకించి బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, డీజిల్ కార్లు మరింత ప్రియమయ్యాయి మరియు మరికొన్ని కంపెనీలు అసలు డీజిల్ కార్లను తయారు చేయడమే నిలిపివేశాయి.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

ప్యాసింజర్ కార్ విభాగంలో డీజిల్ కార్ల హవా తగ్గుతున్నప్పటికీ, లగ్జరీ కార్ల విభాగంలో మాత్రం డీజిల్ కార్లు ఇప్పటికీ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.

భారత మార్కెట్లో తగ్గిన డీజిల్ కార్ల వాటా

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) వెల్లడించిన వివరాల ప్రకారం, 2012-13 సమయంలో భారత ప్యాసింజర్ కార్ విభాగంలో డీజిల్ కార్ల వాటా 58 శాతంగా ఉండేది. కాగా, ఇప్పుడు అది 17 శాతానికి పడిపోయింది. ఆ సమయంలో డీజిల్ ధర పెట్రోల్ ధర కంటే సుమారు 25-30 రూపాయలు తక్కువగా ఉండేది, ఇదే అప్పట్లో డీజిల్ కార్ల పట్ల ఆకర్షణకు అతిపెద్ద కారణం.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

అయితే, కాలక్రమేనా, పెట్రోల్ మరియు డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గడంతో, వినియోగదారులు డీజిల్ కార్లకు దూరమయ్యారు. సియామ్ వెల్లడించిన డేటా ప్రకారం, ప్రస్తుతం, డీజిల్ ధర పెట్రోల్ ధర కంటే సుమారు 7-9 రూపాయలు మాత్రమే తక్కువగా ఉంటోంది. ఇదే మార్కెట్లో డీజిల్ కార్ల వాటా భారీగా తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

సాధారణంగా డీజిల్ కార్ల ధరలు, వాటి పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, పెట్రోల్ కార్లకు అయ్యే మెయింటినెన్స్ ఖర్చుతో పోల్చుకుంటే, డీజిల్ కార్లకు అయ్యే మెయింటినెన్స్ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, కస్టమర్లు మాత్రం కేవలం ఇంధన వ్యయాన్ని ఆదా చేయడం కోసం మాత్రమే డీజిల్ కార్లను ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ, ఇప్పుడు పెట్రోల్-డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గిపోతున్నందున, డీజిల్ కార్ల పట్ల ఆకర్షణ కూడా తగ్గిపోతోంది.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా CNG మరియు ఎలక్ట్రిక్ కార్లు

మార్కెట్లో డీజిల్ హవా తగ్గిపోతుండటంతో, కస్టమర్లు వాటికి ప్రత్యామ్నాయంగా CNG (కంప్రెస్ట్ న్యాచురల్ గ్యాస్) తో నడిచే కార్లను మరియు విద్యుత్‌శక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకుంటున్నారు. మరోవైపు వాయు కాలుష్యం అధికంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో డీజిల్ వాహనాలపై కఠినమైన నిషేధం కూడా డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రజలు కూడా స్వచ్ఛమైన ఇంధనంతో నడిచే వాహనాలను స్వీకరిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో విధివిధానాలు కూడా రూపొందించబడ్డాయి. ఇందులో, భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీలను మరియు రోడ్ టాక్స్ లో తగ్గింపులు వంటి రాయితీలను అందిస్తున్నారు. ఫలితంగా తక్కువ ధరలకే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

ఇదే కాకుండా, ప్రస్తుతం తక్కువగా ఉన్న సిఎన్‌జి ఇంధన ధర కూడా కస్టమర్లను ఆకర్షిస్తోంది. డీజిల్ కార్ల మాదిరిగానే సిఎన్‌జితో నడిచే కార్లు ఎక్కువ మైలేజీనిస్తాయి. అంతేకాకుండా, దీని ధర పెట్రోల్ ధర కన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనదేశంలో మారుతి సుజుకి అత్యధికంగా సిఎన్‌జి మోడళ్లను అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) మారుతి సుజుకి 1.57 లక్షల సిఎన్‌జి కార్లను విక్రయించింది. ఈ సంఖ్య 2019-20 సంవత్సరంలో విక్రయించిన CNG కార్ల కంటే 45 శాతం ఎక్కువ.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

డీజిల్ కార్లపై అధిక పన్ను

పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే, డీజిల్ కార్లు ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి కాబట్టి, వాటిపై పన్ను ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రస్తుత పన్ను విధానం ప్రకారం, 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న పెట్రోల్‌ కార్లపై 29 శాతం జీఎస్టీ విధిస్తుండగా, డీజిల్ కార్లపై 31 శాతం పన్ను విధిస్తున్నారు. అలాగే, 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు వాహనాల విషయంలో పెట్రోల్ కార్లపై 43 శాతం మరియు డీజిల్ కార్లపై 48 శాతం జీఎస్టీ పన్నును విధిస్తున్నారు. ఫలితంగా, పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

డీజిల్ కార్లకు తక్కువ జీవితకాలం

కాలుష్యాన్ని మరియు పాత వాహనాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విధానాల ప్రకారం, ఇప్పుడు దేశంలో పెట్రోల్ కార్ల రిజిస్ట్రేషన్ పరిమితి 15 సంవత్సరాలుగా ఉంటే, డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్ పరిమితి 10 సంవత్సరాలుగా ఉంది. అంటే, డీజిల్ కార్ల వినియోగదారులు తన డీజిల్ కారును 10 సంవత్సరాల తర్వాత ఉపయోగించలేరు లేదా వేరొకరికి విక్రయించలేరు. వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం, ఇలాంటి పాత కార్లను స్క్రాప్ చేయడం తప్పనిసరి చేయబడింది.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

అదనపు మెయింటినెన్స్ ఖర్చు

సాధారణంగా, పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లపై నిర్వహణ వ్యయం (మెయింటినెన్స్ కాస్ట్) ఎక్కువగా ఉంటుంది. ఈ ధర పెట్రోల్ కారు యొక్క మెయింటినెన్స్ ఖర్చు కంటే సుమారు 10-15 శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, డీజిల్ కార్లలో ఉపయోగించే విడిభాగాలు (స్పేర్స్) రేటు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వలన కూడా కస్టమర్లు పెట్రోల్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు.

భారతదేశంలో డీజిల్ కార్లు పూర్తిగా అంతం కాబోతున్నాయా..?

నిలిచిపోతున్న డీజిల్ కార్ల ఉత్పత్తి

పైన తెలిపిన పరిమాణాల నేపథ్యంలో, భారతదేశంలోని కార్ కంపెనీలు డీజిల్ కార్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, గత సంవత్సరం నుండి డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసి, కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే తయారు చేస్తోంది. హ్యుందాయ్, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు కూడా బడ్జెట్ కార్ విభాగంలో డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేశాయి.

Most Read Articles

English summary
Diesel car market share in india slips to 17 percent reports siam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X