కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

ఇప్పటి వరకూ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందటం చాలా సులభంగా ఉండేది. అయితే, ఇకపై కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకువారు మాత్రం తప్పనిసరిగా కఠినమైన డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

కొత్తగా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే పరీక్షలో 69 శాతం ఉత్తీర్ణత పొందడం అవసరమని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో తెలియజేశారు. అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి అర్హత సాధించడంలో ఉత్తీర్ణత శాతాన్ని 69 శాతంగా నిర్ణయించామని ఆయన తెలిపారు.

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంలో భాగంగా, అనర్హులకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా ఉండేలా చేసేందుకు గాను డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షను కఠినతరం చేయడానికి కొత్త చర్యలు, మార్గదర్శకాలను కేంద్రం నిర్దేశించింది. తాజా నియమ నిబంధనల గురించి ఇప్పటికే అన్ని ఆర్టీఓలకు కూడా సమాచారం అందించడం జరిగింది.

MOST READ:మానవత్వం చాటుకున్న మంచి పోలీస్ & బైక్ రైడర్.. వీడియో చూస్తే మీరు కూడా మెచ్చుకుంటారు

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

ఈ విషయం గురించి నితిన్ గడ్కరీ లోక్‌సభలో మాట్లాడుతూ, "రివర్స్ గేర్ ఉన్న వాహనం విషయంలో, వాహనాన్ని వెనుకకు నడపుతున్నప్పుడు దానిని కుడి వైపుకు లేదా ఎడమవైపుకు నియంత్రించడంలో సరైన ఖచ్చితత్వాన్ని పాటించడం అవసరం" అని, డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలో అర్హత సాధించే పారామితులలో ఇది కూడా ఒకటని ఆయన చెప్పారు.

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

ఈ నిబంధన సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు, 1989లో పేర్కొనబడి ఉందని కూడా ఆయన వివరించారు. "అన్ని ఆర్టీఓలలో ఉత్తీర్ణత శాతం 69 శాతంగా ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ యొక్క ఉద్దేశ్యం అర్హత కలిగిన / ప్రతిభావంతులైన డ్రైవర్లను తయారు చేయడమే" అని గడ్కరీ అన్నారు. ఇందుకోసం ఢిల్లీలో 50 మోటారు డ్రైవింగ్ శిక్షణా పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

MOST READ:గెలియోస్ హోప్ ఎలక్ట్రిక్ స్కూటర్; ధర తక్కువ, డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

డ్రైవింగ్ ట్రాక్‌లో లైవ్ డెమోతో పాటు, అసలు డ్రైవింగ్ టెస్ట్ నైపుణ్యం ప్రారంభమయ్యే ముందు అన్ని ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో ఎల్‌ఈడీ తెరపై డెమో చూపబడుతుంది అని నితిన్ గడ్కరీ చెప్పారు. డ్రైవింగ్ నైపుణ్య పరీక్షను బుక్ చేసే సమయంలో, దరఖాస్తుదారునికి డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ డెమో యొక్క వీడియో లింక్ కూడా ఇవ్వబడుతుంది.

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

ఆధార్ అథెంటికేషన్ సహాయంతో డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కొన్ని సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ విషయానికి వస్తే, దాని గడువుకు ఒక సంవత్సరం ముందు లేదా ఒక సంవత్సరం తరువాత రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సేవలను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

MOST READ:తలకిందులుగా నడుస్తూ కారునే లాగేసిన యోగా గురువు.. ఎందుకో తెలుసా..!

కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇకపై అంత సులువు కాదు

కరోనా మహమ్మారి నేపథ్యంలో, దేశ పౌరులకు ఈ సేవలను ఇబ్బంది లేని రీతిలో అందించడానికి మరియు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో రద్దీని తగ్గించడానికి మరియు ఆర్టీఓ అధికారుల సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఈ ఆన్‌లైన్ సేవలు సహకరిస్తాయని ఆయన అన్నారు. - ఆన్‌లైన్‌లో లభిస్తున్న 18 రకాల ఆర్టీఓ సేవల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Driving License Test To Be More Stringent, Says Nitin Gadkari. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X