కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ వినియోగదారులు ఎస్‌యూవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేకించి కాంపాక్ట్ ఎస్‌యూవీల విభాగంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మొదటిసారిగా కారు కొనేవారు మరియు హ్యాచ్‌బ్యాక్ నుండి అప్‌గ్రేడ్ కోరుకునే కస్టమర్లు ఎక్కువగా ఈ చిన్న ఎస్‌యూవీలను ఎంచుకుంటున్నారు.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

ఈ నేపథ్యంలో, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుత పండుగ సీజన్ లో కొన్ని పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లపై డిస్కౌంట్లను మరియు వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్ లో కొత్త సబ్ 4 మీటర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, ఏయే కార్లపై ఎలాంటి ఆఫర్లు లభిస్తున్నాయో తెలుసుకోండి..!

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

1. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 పై కంపెనీ ఈ నెలలో మొత్తం రూ. 44,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు రూ. 4,000 కార్పోరేట్ బోనస్ మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో, కంపెనీ ఈ కారుపై రూ. 5,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

దేశీయ విపణిలో Mahindra XUV300 W4, W6, W8 మరియు W8 (O) అనే నాలుగు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. మార్కెట్లో వీటి ధరలు రూ .7.96 లక్షల నుండి రూ. 13.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. ఈ కారులో ఈబిడితో కూడిన ఏబిఎస్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్, ఇంపాక్ట్ సెన్సిటివ్ డోర్ లాక్ మరియు డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఎక్స్‌యూవీ300 కూడా ఒకటి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

2. రెనో కైగర్ (Renault Kiger)

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్ పై కంపెనీ ఈ నెలలో మొత్తం రూ. 1.05 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 95,000 వరకు లాయల్టీ బెనిఫిట్స్, మరియు రూ. 10,000 వరకూ కార్పోరేట్ డిస్కౌంట్ లు ఉన్నాయి. మార్కెట్లో రెనో కైగర్ ధరలు రూ. 5.64 లక్షల నుండి రూ. 10.09 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ యాక్సెస్ కార్డ్, ఆర్కామిస్ 3డి ఆడియో సిస్టమ్ మరియు యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇది 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

3. టాటా నెక్సాన్ (Tata Nexon)

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ విక్రయిస్తున్న సబ్-4 మీటర్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌పై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ. 20,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 వరకు కార్పోరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ధరలు రూ. 7.28 లక్షల నుంచి రూ. 13.23 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

టాటా నెక్సాన్ కారులో 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-స్టీరింగ్ వీల్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో ఏబిఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ అసిస్ట్, జియో-ఫెన్స్ అలర్ట్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

4. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (Maruti Suzuki Vitara Brezza)

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి సుజుకి విటారా బ్రెజ్జాపై కంపెనీ ఈ నెలలో రూ. 17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 5,000 నగదు తగ్గింపు మరియు రూ. 10,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ. 2,500 కార్పోరేట్ డిస్కౌంట్ లు కలిసి ఉన్నాయి. మార్కెట్లో విటారా బ్రెజ్జా ధరలు రూ. 7.61 లక్షల నుండి రూ. 11.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ టెక్నాలజీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, కీలెస్-ఎంట్రీ, పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, బాహ్య ఉష్ణోగ్రత ప్రదర్శన, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు మరియు 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో ఏబిఎస్ విత్ ఈబిడి, రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు చైల్డ్ సేఫ్టీ లాక్, కెమెరాతో కూడిన వెనుక పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్-అసిస్ట్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మొదలైనవి ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఫెస్టివల్ ఆఫర్స్.. ఎక్స్‌యూవీ300, నెక్సాన్, బ్రెజ్జా, కైగర్..

5. టొయోటా అర్బన్ క్రూయిజర్ (Toyota Urban Cruiser)

మారుతి సుజుకి వితారా బ్రెజ్జా యొక్క రీబ్యాడ్డ్ వెర్షనే ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్. గతేడాది సెప్టెంబర్ 2020 నెలలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ పండుగ సీజన్‌లో కంపెనీ ఈ మోడల్ పై కేవలం 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ ను మాత్రమే అందిస్తోంది. దేశీయ మార్కెట్లో టొయోటా అర్బన్ క్రూయిజర్ ధరలు రూ. 8.72 లక్షల నుండి రూ. 11.40 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)లో ఉన్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే, విటారా బ్రెజ్జాలో లభించే అన్ని ఫీచర్లు కూడా ఈ కారులో లభిస్తాయి.

Most Read Articles

English summary
Festive offers on mahindra xuv300 tata nexon maruti brezza renault kiger details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X