ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. క్లీన్ ఎనర్జీ మరియు పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుండటం మరియు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటు ధరలోకి వస్తుండటంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు అంతరించిపోతుండటం మరియు వాటి ధరలు కూడా అమాంతం పెరిగిపోతుండటంతో వచ్చే 10-15 ఏళ్లలో భారతదేశంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

అయితే, ప్రస్తుతం చాలా మంది వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అనేక అపోహలు ఉన్నాయి. ఫలితంగా, వీటిని స్వీకరించే వారి సంఖ్య ఆశించిన దాని కన్నా తక్కువగా ఉంటోంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించవని, మధ్యలోనే ఆగిపోతాయని, బ్యాటరీ చార్జింగ్ సమస్యలు ఉంటాయని, ఇలా మరెన్నో సందేహాలు వారిలో ఉన్నాయి. మరి ఆ అపోహలు, వాస్తవాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

ఎలక్ట్రిక్ వాహనాలపై దూర ప్రయాణాలు సాధ్యమా?

ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రధాన సమస్య వాటి రేంజ్. సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్ల విషయంలో అయితే, మనకు దేశంలోని ప్రతిచోటా ఈ బంకులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి, ఫ్యూయెల్ ఫిల్లింగ్ పెద్ద సమస్య కాదు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చార్జింగ్ పెద్ద సమస్యగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

ఎలక్ట్రిక్ కార్లను ఒక్కసారి చార్జ్ చేస్తే కొంత దూరం మాత్రమే ప్రయాణించగలుగుతాం. ఆ తర్వాత మరింత దూరం ప్రయాణించాలంటే, మీరు ప్రయాణించే రూట్‌లో చార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి మరియు బ్యాటరీ చార్జ్ అయ్యే సమయం వరకూ అదే చార్జింగ్ స్టేషన్‌లో వేచి ఉండాలి. ఇది కాస్తంత ఇబ్బందికరమైన విషయమే.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

అయితే, ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో, ఎలక్ట్రిక్ కార్ కంపెనీలు ఇప్పుడు అధిక రేంజ్‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో తెస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లు పూర్తి చార్జ్‌పై 300 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాటరీలను త్వరగా చార్జ్ చేసేందుకు దేశంలో ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

ఎలక్ట్రిక్ కార్ల వేగం తక్కువగా ఉంటుందా?

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లపై ఉండే అపోహలలో వాటి వేగం కూడా ఒకటి. చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు తక్కువ వేగంతో ప్రయాణిస్తాయని భావిస్తుంటారు. కానీ, ఇది నిజం కాదు. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈ.వి టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు, ఇది కేవలం 9 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని చేరుకుంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

అలాగే, ఎమ్‌జి మోటార్స్ అందిస్తున్న జిఎస్ ఈవీ కేవలం 8.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ రోజుల్లో, చాలా ఎలక్ట్రిక్ కార్లు కేవలం 2-3 సెకన్లలోనే గంటకు సున్నా నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. నిజానికి పెట్రోల్/డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లే వేగంగా స్పందిస్తాయి మరియు పవర్, టార్క్‌లను కూడా అధికంగానే ఉత్పత్తి చేస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

కారు బ్యాటరీలను ఛార్జ్ చేయటానికి ఎక్కువ సమయం పడుతుందా?

ఇందులో కొంచెం నిజం కొంచెం అపోహ కూడా ఉంది. నిజానికి హోమ్ చార్జర్ ద్వారా అయితే, కారు బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 6-10 గంటల సమయం పడుతుంది. కానీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ కంపెనీ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చాయి. కస్టమర్లు వీటిని తమ ఇళ్ల వద్ధ కూడా ఇన్‌స్టాల్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

ఫాస్ట్ చార్జర్ల సహాయంతో కేవలం 60 నిమిషాల్లోనే బ్యాటరీలను అత్యధిక స్థాయిలో ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటి సాయంతో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ మరింత సులువు కానుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

ఎలక్ట్రిక్ కార్లు ఖరీదైనవా?

వాస్తవానికి పెట్రోల్, డీజిల్ కార్ల ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగానే ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం వాటిలో ఉపయోగించే ఎలక్ట్రిక్ మోటార్లు మరియు బ్యాటరీలే. ప్రస్తుతం చాలా వరకూ ఆటోమొబైల్ కంపెనీలు బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడుతున్నాయి. అధిక దిగుమతి సుంఖాల కారణంగా, వీటి ధర కూడా పెరుగుతోంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

అదే, ఈ బ్యాటరీలను మనదేశంలోనే తయారు చేయగలిగినట్లయితే, అత్యంత సరసమైన ధరకే వీటిని అందించే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో దేశంలో ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే తక్కువ ధరకు లభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రిక్ కార్ల ధర అధికంగా ఉన్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో నడిచే వాహనాలతో పోలిస్తే, ఎలక్ట్రిక్ వాహనాలకు అయ్యే మెయింటినెన్స్ కాస్ట్ మరియు రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

బ్యాటరీ రీప్లేస్‌మెంట్ సమస్య ఉంటుందా?

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో లాంగ్ రన్‌లో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే, బ్యాటరీలు వీక్ అవ్వడం. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ కంపెనీలు ఆఫర్ చేసే బ్యాటరీలు 3 ఏళ్ల వారంటీతో వస్తాయి. అంటే మూడేళ్ల వరకూ కస్టమర్లు సదరు బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. మూడేళ్ల తర్వాత కూడా ఈ బ్యాటరీలు చక్కగానే పనిచేస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాలపై సాధారణంగా ఉండే ఐదు అపోహలు మరియు వాస్తవాలు!

సాధారణంగా, ఒక ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీ జీవితకాలం 1.5 లక్షల కి.మీ నుండి 2 లక్షల కి.మీ వరకూ ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత ఖరీదైనది మరియు ముఖ్యమైనది ఇందులోని బ్యాటరీలే. భవిష్యత్తులో వీటి లభ్యత పెరిగినట్లయితే, ఓఈఎమ్‌గా కానీ లేదా ఆఫ్టర్ మార్కెట్లో కానీ ఇవి సరసమైన ధరకే అందుబాటులోకి రావచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా స్థానికంగానే బ్యాటరీలను తయారు చేసేలా పలు కంపెనీలు ప్రోత్సహిస్తోంది.

Most Read Articles

English summary
Five Common Myths And Facts About Electric Cars, Details. Read in Telugu.
Story first published: Thursday, April 29, 2021, 11:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X