ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Force Motors (ఫోర్స్ మోటార్స్) యొక్క Force Gurkha ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త SUV ధర రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కంపెనీ ఈ కొత్త ఆఫ్ రోడర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కొత్త Force Gurkha కొనుగోలు చేయదలచిన వారు రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు రానున్న దసరా పండుగ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

Force Gurkha కలర్ ఆప్సన్స్:

కొత్త Force Gurkha 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

అవి:

  • రెడ్
  • గ్రీన్
  • వైట్
  • ఆరంజ్
  • గ్రే (బూడిద రంగు)
  • ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    కొత్త Force Gurkha యొక్క డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది విశాలమైన మరియు పొడవైన బాడీ కలిగి ఉంటుంది. ఇది కఠినమైన రోడ్డులో కూడా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండటం కోసం సి-ఇన్-సి చాసిస్ మరియు 4 చక్రాలపై కొత్త కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    కొత్త Force Gurkha యొక్క కొలతల విషయానికి వస్తే, 4,116 మిమీ పొడవు, 1,812 మిమీ వెడల్పు మరియు 2,075 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. అదే విధంగాఇది 2,400 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను పొందుతుంది. 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పొందుతుంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    కొత్త Force Gurkha అప్డేటెడ్ రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్ మీద Gurkha అని వ్రాయబడిన అక్షరాలు మరియు ఎల్ఈడీ స్టాప్ లాంప్‌తో పాటు నిలువుగా ఉంచిన టెయిల్ ల్యాంప్‌లు ఇందులో చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ కొత్త SUV కి దూకుడు రూపాన్ని అందిస్తాయి. అంతే కాకుండా ఇందులోని స్పోర్టి యాక్సెంట్స్ బ్లాక్ ఓఆర్‌విఎమ్‌ల వరకు విస్తరిస్తాయి. Force Gurkha యొక్క సైడ్ ఫ్రొఫైల్ లో 4x4x4 ఉండటం కూడా గమనించవచ్చు.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    ఇందులో దృఢమైన రూప్ రైల్ ఉంటుంది. దీనికి ముందు మరియు వెనుక వైపు టో టోక్స్ కనిపిస్తాయి. Gurkha 16 ఇంచెస్ స్టీల్ వీల్స్‌ పొందుతుంది, దాని ముందు మరియు వెనుక బంపర్‌లపై బ్లాక్ క్లాడింగ్‌తో పాటు ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ఉంటాయి. మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా Gurkha ఫ్రంట్ గ్రిల్ పై F లోగో కాకుండా కొత్త లోగో ఉంటుంది.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    కొత్త Force Gurkha యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, లోపల మొత్తం మిడ్ నైట్ బ్లాక్ కలర్ స్కీమ్ పొందుతుంది. వెనుక భాగంలో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటుగా త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. అంతే కాకుండా ఫ్లోర్ మ్యాట్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    Force Gurkha యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందించింది. ఇది పూర్తి మెటల్ టాప్ కలిగిన వాహనం. ఇది డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX సీటింగ్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివాటితో పాటు సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహనదారుల భద్రతను నిర్దారిస్తాయి.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    2021 Force Gurkha బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉండే, 2.6-లీటర్ ఫోర్-సిలిండర్ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 1,400-2,400 ఆర్‌పిఎమ్ వద్ద 115 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారును 4WD సిస్టమ్‌తో పాటు 5-స్పీడ్ మెర్సిడెస్ G-28 ట్రాన్స్‌మిషన్‌తో జతచేయవచ్చు.

    ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Force Gurkha; ధర & వివరాలు

    Force Gurkha పై కంపెనీ అద్భుతమైన వారంటీ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ 1.5 లక్షల కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. భారత మార్కెట్లో విడుదలైన కొత్త Force Gurkha మహీంద్రా థార్ మరియు మారుతి సుజుకి జిమ్నీ యొక్క రాబోయే 5 డోర్ వెర్షన్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే కంపెనీ Force Gurkha 5 డోర్ వెర్షన్ ను త్వరలో తీసుకురానుంది.

Most Read Articles

English summary
Force launched updated 2021 gurkha off roader suv in indian market
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X