Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

భారతీయ మార్కెట్లో ఆఫ్ రోడింగ్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీలు దేశీయ మార్కెట్లో ఆఫ్ రోడింగ్ వాహనాలు విడుదల చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి Force Gurkha (ఫోర్స్ గూర్ఖా) భారతదేశంలో విడుదల కావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇంతకు ముందు కూడా ఈ Force Gurkha అనేక సార్లు టెస్ట్ చేయబడింది.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

ఇటీవల కంపెనీ Force Gurkha కి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ కొత్త SUV త్వరలో భారతీయ మార్కెట్లో విడుదలకానున్నట్లు తెలుస్తుంది. Force Gurkha యొక్క టీజర్ ఇమేజ్ లో ఇది చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

సాధారణంగా కొత్త Force Gurkha 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. 2020 ఆటో ఎక్స్‌పోలోనే ఇది ఎంతోమంది మనసు దోచింది. అప్పటి నుంచి కూడా చాలామంది ఆఫ్ రోడింగ్ ప్రియులు ఈ వాహనం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ కొత్త SUV బాక్సీ డిజైన్ పొందుతుందని భావిస్తున్నాము.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

కొత్త Force Gurkha ను కంపెనీ కొత్త ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ పై నిర్మించింది. కావున ఈ SUV సరికొత్త మరియు బలమైన బాడీషెల్‌ను పొందుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న క్రాష్ టెస్ట్ నిబంధనలకు మరియు వాహనదారుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుందని భావిస్తున్నాము.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

కొత్త బిఎస్ 6 Force Gurkha అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ఒక్క సారికే ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది ఐస్ క్యూబ్ లాంటి డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో కొత్త గ్రిల్, కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. బంపర్‌లో చాలా కేడ్లింగ్ ఉంది మరియు వెనుక భాగంలో కొత్త టెయిల్‌ల్యాంప్‌లు, డోర్-మౌంటెడ్ స్పేర్ వీల్ మరియు స్టెప్ ల్యాడర్ వంటివి కూడా ఇందులో ఇవ్వబడ్డాయి.

కొత్త Force Gurkha మోడల్‌లో గుండ్రటి ఎల్ఈడి హెడ్‌లైట్స్, గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్, హై గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పెద్ద వీల్ ఆర్చెస్‌తో రగ్గడ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇదివరకు చూసిన ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీల కన్నా ఇది చాలా భిన్నంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

కొత్త Force Gurkha ఆకర్షణీయమైన 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతుంది. ఇది దాని ఆకర్షణీయమైన రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది. పవర్ విండోస్ మరియు 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఇంటీరియర్స్ కూడా బాగా అప్డేట్ చేయబడ్డాయి.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

Force Gurkha అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహనదారుని భద్రతను నిర్థారిస్తాయి. ఇది మహీంద్రా యొక్క థార్ కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

ఇక Force Gurkha యొక్క సీటింగ్ విషయానికొస్తే, మొదటి వరుసలో రెండు సీట్లు, రెండవ వరుసలో రెండు సీట్లు మరియు చివర్లో రెండు జంప్ సీట్లు ఉంటాయి. ఇవన్నీ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

Force Gurkha యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.6-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 89 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది, దీనిని ఆల్-వీల్-డ్రైవ్ ఎంపికలో కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

నిజానికి Force Gurkha మార్కెట్ వాటా తక్కువే అయినప్పటికీ, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల్లో ఇది Mahindra Thar కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. ఇందులోని మరో ప్రత్యేకమైన ఫీచర్ దాని విశాలమైన క్యాబిన్ మరియు అధిక సీటింగ్ సామర్థ్యం. అంతేకాకుండా, థార్ మాదిరిగానే గుర్ఖా కోసం కూడా అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు, ఆఫ్-రోడింగ్ యాక్ససరీలు అందుబాటులో ఉంటాయి.

Force Gurkha వచ్చేస్తోంది; Mahindra Thar పరిస్థితి ఏంటి?

కొత్త బిఎస్ 6 Force Gurkha SUV లో ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు దృఢమైన యాక్సిల్ అందుబాటులో ఉంటుంది. Force Gurkha యొక్క ధర గురించి ఖచ్చితమైన వివరాలు అందుబాటులో లేదు, అయితే దీని ధర రూ. 10 ;లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నాము. దేశీయ మార్కెట్లో కొత్త Force Gurkha విడుదలైన తర్వాత Mahindra Thar మరియు Suzuki Jimny వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Force motors revealed new gurkha teaser image details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X