Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ Ford (ఫోర్డ్) ఇటీవల భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. Ford (ఫోర్డ్) కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం డీలర్‌షిప్‌లలో అనేక మార్పులను తీసుకువచ్చింది. అంతే కాదు కంపెనీలలో ఉన్న కార్మికులపై కూడా చాలా ప్రభావం చూపింది.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

భారతదేశంలో విక్రయించిన Ford కార్లలో చాలా వరకు గుజరాత్‌లోని సనంద్ తయారీ కర్మాగారంలో తయారు చేయబడ్డాయి మరియు విక్రయించబడ్డాయి. అయితే ఇప్పుడు Ford కంపెనీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం చేత, ఉత్పత్తి కర్మాగారంలో కార్ల ఉత్పత్తి నిలిపివేయబడింది.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

నివేదికల ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి ప్లాంట్ మూసివేయబడుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది చెన్నై తయారీ కర్మాగారాన్ని మూసివేయనున్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఫోర్డ్ కంపెనీ ఉత్పత్తి భారతదేశంలో నిలిచిపోయిన కారణంగా డీలర్లు చాలా తక్కువ ఫోర్డ్ కార్లను మాత్రమే కలిగి ఉన్నారు.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

భవిష్యత్తులో కంపెనీ ఇప్పటికే విక్రయించిన కార్లకు సర్వీస్ మరియు విడి భాగాలు వంటివి అందుబాటులో ఉంటాయా అనే ప్రశ్న చాలామంది కొనువులుదారుల్లో ఉంది, కావున ఈ కార్లను కొనుగోలు చేయటానికి చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఫోర్డ్ ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కలిగి ఉన్నప్పటికీ, ఎంతమంది విక్రేతలు అమ్మకాల తర్వాత మరియు విడిభాగాలను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారో స్పష్టంగా తెలియదు.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో 170 ఫోర్డ్ డీలర్‌షిప్‌లు ఉన్నాయి. వీటిలో చాలా డీలర్‌షిప్‌లు కొత్తగా ప్రారంభించబడ్డాయి. ఈ 170 డీలర్లలో చాలామంది వందల కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసిన కారణంగా సర్వీస్ మరియు విడిభాగాల విక్రయాల నుంచి తమ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

అంతే కాకుండా, కార్ సర్వీస్‌లలో పనిచేసే కార్మికులకు మరియు డీలర్‌షిప్‌లలో పనిచేసే వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, కొంతమంది ఫోర్డ్ డీలర్లు కొత్త పని కోసం ప్రయత్నిస్తున్నారు. వారు తమ ఫోర్డ్ డీలర్‌షిప్‌ను మరో కార్ డీలర్‌షిప్‌గా మారుస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల, లక్నోలోని ఫోర్డ్ డీలర్‌షిప్‌లో Mahindra XUV 700 (మహీంద్రా ఎక్స్‌యువి700) కార్లు పార్క్ చేయబడ్డాయి. దీనికి సంబందించిన ఫొటోలు బయటపడ్డాయి.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

అస్సాంలోని మరో ఫోర్డ్ డీలర్‌షిప్ షోరూమ్‌లో Maruti Suzuki (మారుతి సుజుకి) యొక్క Dzire, Alto మరియు Baleno కార్లు కనిపించాయి. వీటితో పాటు Toyota Fortuner (టయోటా ఫార్చ్యూనర్) కార్లు కూడా ఫోర్డ్ షోరూమ్ వద్ద పార్క్ చేయబడ్డాయి. చాలా ఫోర్డ్ డీలర్లు ఫోర్డ్ షోరూమ్ లోపల ఇతర కంపెనీ కార్లను ప్రదర్శిస్తున్నారు.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

దీన్ని బట్టి చూస్తే, Ford షోరూమ్‌ల యజమానులు ఫోర్డ్ కార్లతో పాటు ఇతర కంపెనీ కార్లను విక్రయించే అవకాశం ఉంది. ఈ షోరూమ్‌ల యజమానులు ఇతర కార్ల తయారీదారులతో ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంది. కొన్ని రోజుల తర్వాత, ఈ డీలర్‌షిప్‌లు ఇతర కంపెనీల విక్రయాలను ప్రకటించవచ్చు.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

కావున షోరూమ్ లోపల పెద్ద మార్పులకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కంపెనీ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కొంతకాలం పాటు ఈ పేరుతో డీలర్‌షిప్‌లను నిర్వహించడానికి ఫోర్డ్ అనుమతించి ఉండవచ్చు. ఫోర్డ్ దేశీయ మార్కెట్‌ని విడిచిపెట్టినప్పటికీ, మునుపటిలాగా విక్రయాల తర్వాత సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ తన లగ్జరీ స్పోర్ట్స్ కార్లను భారతదేశంలో విక్రయించడం కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది, డీలర్లకు తమ వ్యాపారాలకు సేవ మరియు విడిభాగాలను అందించడానికి సరైన పరిష్కారాన్ని అందిస్తుంది.ఫోర్డ్ భారతదేశంలో ముస్తాంగ్ కూపే మరియు ముస్తాంగ్ మ్యాక్ ఎలక్ట్రిక్‌తో సహా అనేక కార్లను విడుదల చేయనుంది. ఇవి CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) రూపంలో విక్రయించబడతాయి.

Ford డీలర్‌షిప్‌లలో కనిపిస్తున్న ఇతర బ్రాండ్ కార్లు.. ఇక Ford సంగతి అంతేనా..!!

అంటే ఈ కార్లు విదేశాలలో తయారు చేయబడి, భారతీయ మార్కెట్ కోసం దిగుమతి చేయబడతాయి. ఈ విధానం ద్వారా దేశీయ మార్కెట్లో విక్రయించబడతాయి. అయితే దేశీయ మార్కెట్లో ఫోర్డ్ ప్రస్తుతం కొంతమంది డీలర్లకు ప్రీమియం కార్లను విక్రయించడానికి రిజర్వ్ చేసింది. కావున ఈ డీలర్లకు మాత్రమే ఈ లగ్జరీ కారు అందిస్తుంది, తద్వారా తమ విక్రయాలను కొనసాగిస్తోంది.

Source: Rushlane

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford dealers using ford showroom to display other company cars details
Story first published: Thursday, October 7, 2021, 9:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X