Just In
- 9 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
జగన్‌పై రఘురామ బిగ్‌బాంబ్- మీ కేసులకూ వందరోజులే- పిచ్చోళ్లకు నో ఛాన్స్-పది క్యాన్సిల్
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెబ్సైట్ నుండి మాయమైన మస్టాంగ్; భారత్‌లో డిస్కంటిన్యూ అయిందా?
అమెరికన్ కార్ బ్రాండ్ "ఫోర్డ్" భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఐకానిక్ స్పోర్ట్స్ కార్ "మస్టాంగ్"ను తమ ఇండియన్ వెబ్సైట్ నుండి తొలగించి వేసింది. అయితే, కంపెనీ ఈ మోడల్‌ను పూర్తిగా భారత్‌ను తొలిగించిందా లేక సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు పాత వెర్షన్‌ను నిలిపివేసిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఫోర్డ్ ఇండియా తమ మస్టాంగ్ కారును తొలిసారిగా 2016లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఫోర్డ్ సుమారు 450 యూనిట్లకు మస్టాంగ్ కార్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. అయితే, బిఎస్6 కాలుష్య నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో, కంపెనీ ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ కారుని భారత మార్కెట్లో విక్రయించడం లేదు.

అయితే, ఫోర్డ్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో తమ కొత్త తరం మస్టాంగ్ కారును విక్రయిస్తోంది. గతేడాది మధ్య భాగంలో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ కొత్త మస్టాంగ్ కారును ఫోర్డ్ భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఎప్పుడైనా కొత్త మస్టాంగ్ విడుదల కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

గ్లోబల్ మార్కెట్లలో కొత్త తరం ఫోర్డ్ మస్టాంగ్ విభిన్న ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 310 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేసే ఎంట్రీ లెవల్ 2.3-లీటర్ ఎకోబూస్ట్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 445 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేసే మిడ్-స్పెక్ 5.0-లీటర్ వి8 ఇంజన్ మరియు 525 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేసే టాప్-స్పెక్ షెల్బీ జిటి 350 వి8 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, భారత మార్కెట్లో విడుదలయ్యే ఫోర్డ్ మస్టాంగ్ కారులో 5.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 445 బిహెచ్పి శక్తిని మరియు 533 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ ఇంజన్లో కాస్ట్-అల్యూమినియం పిస్టన్స్, ఫోర్జ్డ్ కనెక్టింగ్ రాడ్స్, డ్యూయెల్ ఇంజెక్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, స్టీరింగ్ వీల్‌పై ప్యాడల్ షిఫ్టర్స్, బ్రెంబో నుండి సేకరించిన 6-పిస్టన్ కాలిపర్లతో పెద్ద డిస్క్ బ్రేక్‌లు ఈ కారుకి మరింత స్పోర్టీ ఫీచర్లను జోడిస్తుంది.

కొత్తగా వచ్చే ఫోర్డ్ మస్టాంగ్ మునుపటి తరం మోడళ్లతో పోల్చుకుంటే మరింత విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీని ఐకానిక్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలానే ఉంటుంది. ఇందులో ఎయిర్ ఫ్లో-షేపింగ్ వేన్లతో కూడిన కొత్త చిన్ డిజైన్, రియర్ ఫేసింగ్ వెంట్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బానెట్, కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ వంటి మార్పులు ఉన్నాయి.

ఈ కారులో సరికొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, డ్రైవర్ ఎంచుకునే డ్రైవింగ్ మోడ్‌ను బట్టి దీని లేఅవుట్‌ను కూడా ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటుంది. ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ఫీచర్లతో పాటుగా బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇంకా ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆల్-బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్స్, పవర్-అడ్జస్టబల్ సీట్స్, క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్‌తో కూడిన రియర్ వ్యూ కెమెరా, అనేక ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-కొల్లైజన్ అలెర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబిఎస్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నట్లు సమాచారం.