Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?
అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారతదేశంలో తమ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. కార్ల తయారీలో ఉపయోగించే ఓ కీలకమైన విడిభాగం కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి సందర్భంగా ఫోర్డ్ తమ చెన్నై ప్లాంట్‌ను జనవరి 14 నుండి మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పుడు ఈ షట్‌డౌన్‌ను జనవరి 24 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫోర్డ్ కార్ల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన సెమీకండక్టర్ (చిప్) కొరత కారణంగానే తమ ప్లాంట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు.
MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రయత్నిస్తోందని, వీలైనంత త్వరలోనే సరఫరాను పునరుద్ధరించి వాహనాల ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.

ఫోర్డ్ ఇండియాకు ప్రస్తుతం చెన్నై సమీపంలోని మరైమలై మరియు గుజరాత్‌లోని సనంద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ సెమీకండక్టర్ చిప్ కారణంగా రెండు ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి.
MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

ఈ పరిణామాల నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ఫోర్డ్ ఇండియా విక్రయిస్తున్న కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, గతేడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉత్పాదకత కూడా తగ్గే అవకాశం ఉంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, సెమీకండక్టర్ కొరత కారణంగా, ఫోర్డ్ ఇండియా దేశీయ మరియు ఎగుమతి మార్కెట్ రెండింటి కోసం తయారు చేసే వాహనాల ఉత్పత్తిని 50 శాతం వరకూ ప్రభావితం చేస్తుందని అంచనా.
MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

ఫోర్డ్ ఇండియా గడచిన డిసెంబర్ 2020 నెలలో కేవలం 7,000 వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. మొత్తంగా చూసుకుంటే, ఫోర్డ్ ఇండియా గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 65,000 కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది.

సెమీకండక్టర్ చిప్‌ల కొరత కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది గ్లోబల్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీల ఉత్పత్తికి సైతం అంతరాయాన్ని కలిగిస్తోంది. ఈ చిప్‌లను వాహనంలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ మరియు ఇతర ఎలక్ట్రికల్ భాగాలలో ఉపయోగిస్తారు.
MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

ఫోర్డ్ భారత్‌లోనే కాకుండా అమెరికాలో కూడా ఓ ప్లాంట్‌ను ఇదే కారణం చేత మూసివేసినట్లు సమాచారం. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా టొయోటా తమ చైనీస్ ప్లాంట్‌లో, ఆడి మరియు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు తమ జర్మనీ ప్లాంట్‌లో మరియు హోండా తమ యూకే ప్లాంట్‌లో ఉత్పత్తి అంతరాయాన్ని ఎదుర్కుంటున్నాయి.