షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారతదేశంలో తమ కార్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. కార్ల తయారీలో ఉపయోగించే ఓ కీలకమైన విడిభాగం కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

సంక్రాంతి సందర్భంగా ఫోర్డ్ తమ చెన్నై ప్లాంట్‌ను జనవరి 14 నుండి మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పుడు ఈ షట్‌డౌన్‌ను జనవరి 24 వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

ఫోర్డ్ కార్ల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన సెమీకండక్టర్ (చిప్) కొరత కారణంగానే తమ ప్లాంట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు వివరించారు.

MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రయత్నిస్తోందని, వీలైనంత త్వరలోనే సరఫరాను పునరుద్ధరించి వాహనాల ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది.

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

ఫోర్డ్ ఇండియాకు ప్రస్తుతం చెన్నై సమీపంలోని మరైమలై మరియు గుజరాత్‌లోని సనంద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ సెమీకండక్టర్ చిప్ కారణంగా రెండు ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి.

MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

ఈ పరిణామాల నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ఫోర్డ్ ఇండియా విక్రయిస్తున్న కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, గతేడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉత్పాదకత కూడా తగ్గే అవకాశం ఉంది.

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, సెమీకండక్టర్ కొరత కారణంగా, ఫోర్డ్ ఇండియా దేశీయ మరియు ఎగుమతి మార్కెట్ రెండింటి కోసం తయారు చేసే వాహనాల ఉత్పత్తిని 50 శాతం వరకూ ప్రభావితం చేస్తుందని అంచనా.

MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

ఫోర్డ్ ఇండియా గడచిన డిసెంబర్ 2020 నెలలో కేవలం 7,000 వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. మొత్తంగా చూసుకుంటే, ఫోర్డ్ ఇండియా గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 65,000 కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది.

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

సెమీకండక్టర్ చిప్‌ల కొరత కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది గ్లోబల్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీల ఉత్పత్తికి సైతం అంతరాయాన్ని కలిగిస్తోంది. ఈ చిప్‌లను వాహనంలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ మరియు ఇతర ఎలక్ట్రికల్ భాగాలలో ఉపయోగిస్తారు.

MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

షాకింగ్.. భారతదేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన ఫోర్డ్, కారణం అదేనా?

ఫోర్డ్ భారత్‌లోనే కాకుండా అమెరికాలో కూడా ఓ ప్లాంట్‌ను ఇదే కారణం చేత మూసివేసినట్లు సమాచారం. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా టొయోటా తమ చైనీస్ ప్లాంట్‌లో, ఆడి మరియు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు తమ జర్మనీ ప్లాంట్‌లో మరియు హోండా తమ యూకే ప్లాంట్‌లో ఉత్పత్తి అంతరాయాన్ని ఎదుర్కుంటున్నాయి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India Temporarily Stops Car Production In Chennai Plant Due To Parts Shortage. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X