Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) భారతదేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేసి, త్వరలోనే వాహనాల ఉత్పత్తిని కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. గత కొన్నేళ్లుగా ఈ అమెరికన్ అగ్రగామి కార్ బ్రాండ్ భారత మార్కెట్లో భారీ నష్టాలను భరిస్తూ వచ్చింది. ఇకపై నష్టాలను భరించడం తమ వల్ల కాదని, అందుకే తట్టాబుట్టా సర్దేస్తున్నామని తెలిపింది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

ఫోర్డ్ ఇండియా (Ford India) భారతదేశంలో అందించిన అత్యుత్తమ వాహనాలలో ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour) ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కంపెనీ లైనప్ లో సుధీర్ఘ కాలంగా మార్కెట్లో ఉన్న మోడల్ ఇది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ సుమారు 18 ఏళ్లుగా విక్రయానికి ఉంది. ఈ 18 ఏళ్ల కాలంలో కంపెనీ ఈ ఎస్‌యూవీ కొత్త తరం మోడళ్లను మరియు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను కూడా ప్రవేశపెట్టింది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

మార్కెట్లో టొయోటా ఫార్చ్యూనర్ వంటి పెద్ద ఎస్‌యూవీలకు పోటీగా నిలిచిన ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ఉత్పత్తిని భారతదేశంలో పూర్తిగా నిలిపివేయడానికి ముందు, కంపెనీ ఈ ఎస్‌యూవీని కాపాడుకనేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. కాకపోతే, అవేవీ పెద్దగా ప్రయోజనాన్ని అందించలేకపోయాయి. ఫలితంగా, ఈ ప్రీమియం ఎస్‌యూవీ భారత ఆటోమొబైల్ చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమైంది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

ఫోర్డ్ స్థానికంగా భారతదేశం కోసం వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది, కానీ తమ ఎండీవర్ ఎస్‌యూవీని మాత్రం మార్కెట్లో కొనసాగించడానికి, ఈ అమెరికన్ కంపెనీ పలు ఇతర ఆటోమొబైల్ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ఫోర్డ్ కు భారత మార్కెట్ నుండి ఎటువంటి పరిష్కారం లభించినట్లు కనిపించడం లేదు.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

భారతదేశంలో ఫోర్డ్ తమ కార్ ఫ్యాక్టరీలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది, కాబట్టి Endeavour ఎస్‌యూవీ కథ కూడా ముగిసినట్లే అని తెలుస్తోంది. గత నెలలో Ford Endeavour అమ్మకాలను పరిశీలించినట్లయితే, ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇది 44 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పుడు ఈ మోడల్ స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే విక్రయించబడుతుంది మరియు ఆ తర్వాత నిలిపివేయడం జరుగుతుంది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

ఫోర్డ్ భారతదేశానికి తన ప్రీమియం కార్లను ఎగుమతి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే. అయితే, ఎండీవర్ విషయంలో కంపెనీ ఈ ఎస్‌యూవీని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) మార్గంలో ఇండియాకు తీసుకువచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే దీని సుమారు రూ. 35 లక్షల రేంజ్‌లో ఉంది. అదే సిబియూ ద్వారా అయితే, దీని ధర సుమారు రూ.60 లక్షల నుండి రూ.70 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

ఫోర్డ్ ఇండియా తొలిసారిగా 2003 లో ఎండీవర్ ఎస్‌యూవీని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఇందులో రెండవ తరం (సెకండ్ జనరేషన్) మోడల్ ను 2016 లో విడుదల చేసింది. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్నది మూడవ తరం (థర్డ్ జనరేషన్) Endeavour. గతంలో కంపెనీ ఈ ఎస్‌యూవీలో కొన్ని ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను మరియు స్పెషల్ ఎడిషన్లను కూడా ప్రవేశపెట్టింది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

ప్రస్తుతం, దేశీయ విపణిలో ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 33.81 లక్షల నుండి రూ. 36.26 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఫోర్డ్ ఎండీవర్‌ లో పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3200 ఆర్‌పిఎమ్ వద్ద 158 బిహెచ్‌పి పవర్ ను శక్తిని మరియు 1600 ఆర్‌పిఎమ్ వద్ద 385 న్యూటన్ మీటర్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 10 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

ఫోర్డ్ ఎండీవర్ లోని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫోర్డ్ యొక్క సింగ్ 3 కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఫోర్డ్‌పాస్ సూట్, యాంబియంట్ లైటింగ్, హ్యాండ్స్‌ఫ్రీ టెయిల్‌గేట్ ఓపెనింగ్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్, 8-వే అడ్జస్టబుల్ పవర్ సీట్, డ్యూయల్ జోన్ ఎయిర్ కండీషనర్, పనోరమిక్ సన్‌రూఫ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్ మరియు పవర్-అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, హిల్ డీసెంట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 70 లీటర్లు మరియు ఇది లీటరుకు సగటున 12 నుండి 14 కిమీ మైలేజీనిస్తుంది.

Endeavour ఎస్‌యూవీని కాపాడటానికి Ford చేసిన ప్రయత్నాలు ఫలించలేదు!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

భారతదేశంలో Ford Endeavour ఫుల్ సైజ్ ఎస్‌యూవీని ఒక ప్రత్యేకమైన కస్టమర్ బేస్ మరియు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో, కంపెనీ హఠాత్తుగా ఈ మోడల్ ను మార్కెట్ నుండి తొలగించడంపై చాలా మంది అసహనానికి మరియు నిరాశకు గురవుతున్నారు.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford india tried to save the endeavour suv before ending its production details
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X