బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ Ford Motor భారతీయ మార్కెట్లో తన కార్య కలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి 2 బిలియన్ డాలర్ల నష్టం రావడం మాత్రమే కాకుండా భారతదేశంలో అమ్మకాలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు 4,000 మందికి పైగా ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

భారతదేశంలోని ప్రముఖ మోడల్స్ అయిన ఫోర్డ్ ఫిగో త్వరలో ఫోర్డ్ ఫ్రీస్టైల్ కార్ల ఉత్పత్తిని తగ్గిస్తుందని తెలిపింది. ఫోర్డ్ ఇండియా ఇండియన్ యూనిట్ భారతదేశంలో తగిన అమ్మకాలను చూపలేకపోవడం వల్ల మరియు అధిక నష్టాల బాటలో పయనించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

ఫోర్డ్ మోటార్ కంపెనీ దేశీయ మార్కెట్లో తక్కువ అమ్మకాలను మాత్రమే కాకుండా, ఎగుమతులు సంఖ్య కూడా తక్కువగానే ఉండటం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఫోర్డ్ మోటార్ కంపెనీ జనరల్ మోటార్స్ మార్గాన్ని అనుసరిస్తోంది. జనరల్ మోటార్స్ 2017 లోనే దేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

అయితే కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో స్టాక్ ఉన్నంత వరకు భారతదేశంలో తన ఫోర్డ్ ముస్టాంగ్ మరియు ఫోర్డ్ ఎండీవర్ కార్లను విక్రయిస్తూనే ఉంటుందని కూడా తెలిపింది. గత రెండేళ్లలో దేశీయ మార్కెట్‌లో కంపెనీ 1 బిలియన్ డాలర్ల నుండి 1.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని పొందింది.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

కంపెనీ తన భవిష్యత్తు కార్యకలాపాలను స్వతంత్రంగా నిలుపుకోవడం అసాధ్యమైన తర్వాత తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఫోర్డ్ యొక్క చెన్నై తయారీ కర్మాగారం మరికొన్ని నెలలు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఫోర్డ్ మోటార్ కంపెనీ తన రెండు ఉత్పత్తి కర్మాగారాల కొనుగోలుదారుల కోసం ప్రస్తుతం శోధిస్తోంది.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

ఇందులో భాగంగానే 10% కంటే తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్న సనంద్ తయారీ కర్మాగారాన్ని ఫోర్డ్ మూసివేసే అవకాశం ఉంది. 2022 రెండవ త్రైమాసికం తర్వాత చెన్నై తయారీ కర్మాగారం కూడా మూసివేయబడుతుంది. ఫోర్డ్ ఇకపై భారతదేశంలో కొత్త కార్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉండదు.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

భారతదేశంలో కంప్లీట్ నాక్ డౌన్ లేదా కంప్లీట్లీ బిల్ట్ ద్వారా మాత్రమే ప్రధాన మోడళ్లతో కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అదనంగా, కంపెనీ తన ప్రస్తుత వినియోగదారులకు సర్వీస్ అందిస్తుంది. కావున ఇది కంపెనీ కార్ల కొనుగోలుదారులకు ఒక గొప్ప ఉపశమనం అనే చెప్పాలి.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

ఫోర్డ్ బిజినెస్ సెంటర్ మరియు గ్లోబల్ డెవలప్‌మెంట్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగుతాయి. గ్లోబల్ ఆపరేషన్ కోసం మధ్య తరహా పాంథర్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసే ఇంజిన్ యూనిట్ కూడా పనిచేస్తుంది. మహీంద్రా మరియు మహీంద్రాతో ఫోర్డ్ జాయింట్ వెంచర్ ముగిసినప్పటి నుండి ఫోర్డ్ భారతదేశంలో అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేకపోతోంది.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

ఈ సంవత్సరం ప్రారంభంలో, కంపెనీ భారతదేశంలో కొత్త భాగస్వాములతో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని తెలిపింది. ఈ లోపు కంపెనీ యొక్క కార్య కలాపాలు భారతదేశంలో నిలిపివేస్తుందనే పుకార్లు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. కానీ ఈ రోజు, ఫోర్డ్ ఇండియా భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

ఫోర్డ్ తన ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను దేశీయ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ ఎడిషన్ TVC ఇటీవల విడుదలైంది. అయితే ఫోర్డ్‌కు పెట్టుబడి లాభదాయకం కాదని భారత్ స్పష్టం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

భారతదేశంలో కార్యకలాపాలను మూసివేయడం గురించి ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ మరియు సీఈఓ జిమ్ ఫార్లే మాట్లాడుతూ, భారతదేశంలో గణనీయమైన పెట్టుబడి ఉన్నప్పటికీ, ఫోర్డ్ గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చవిచూసింది. కొత్త వాహనాల డిమాండ్ కూడా తక్కువగా ఉంది. కావున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా మరియు ఫోర్డ్ 2017 లో ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందం ద్వారా రెండు కంపెనీలు విలీనమయ్యాయి. టెక్నాలజీ, ఇంజిన్, కనెక్టివిటీ మరియు ఎలక్ట్రిక్ వాహనాలను పంచుకోవడానికి ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నేపథ్యంలో, రెండు కంపెనీల మధ్య వివిధ సాంకేతిక మార్పిడులు 5 సంవత్సరాల పాటు సజావుగా సాగాయి. మధ్యలో, రెండు కంపెనీలు కొన్ని డెలివరీలను నిలిపివేశాయి. కానీ ఇంజిన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి ఇతర ఎక్స్ఛేంజీలు కొనసాగాయి.

బ్రేకింగ్ న్యూస్.. భారతదేశంలో కార్యకలాపాలను చెక్ పెట్టిన Ford Motor.. కారణం ఇదే

ఇంజిన్ ఎక్స్ఛేంజ్ కొన్ని రోజుల క్రితం ముగియాల్సి ఉందని ఫోర్డ్ తెలిపింది. ఫోర్డ్ తన రెండు వాహనాల విడుదలను నిలిపివేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీలో ఉన్న ఎంతోమంది జీవితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford motor to shut down its operations in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X