క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ (ఎకోస్పోర్ట్) మరియు ఫుల్-సైజ్ ఎస్‌యూవీ (ఎండీవర్) విభాగాల్లో రెండు ఎస్‌యూవీలను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఫోర్డ్ ఇండియా ఎలాంటి ఉత్పత్తులను అందించడం లేదు.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

ఈ నేపథ్యంలో, భారత కార్ మార్కెట్లో మంచి పాపులారిటీని దక్కించుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేందుకు ఫోర్డ్ తమ టెరిటరీ ఎస్‌యూవీని దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

మరికొద్ది నెలల్లోనే ఫోర్డ్ టెరిటరీ మిడ్-సైజ్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫోర్డ్ ఇండియా ఈ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ ఎస్‌యూవీని తొలిసారిగా 2018లో ఆసియన్ మార్కెట్లకు పరిచయం చేశారు. ప్రస్తుతం ఇది చైనా, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా మార్కెట్లలో విక్రయించబడుతోంది.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఫోర్డ్ టెరిటరీని భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రారంభించవచ్చు. ఈ ఎస్‌యూవీ పరిమాణం గురించి మాట్లాడుకుంటే, ఇది 4580 మి.మీ పొడవు, 1936 మి.మీ వెడల్పు, 1674 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2761 మి.మీగా ఉంటుంది, ఇది టాటా హారియర్ ఆకారాన్ని పోలి ఉంటుంది.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

ఫోర్డ్ టెరిటరీ ఎస్‌యూవీలో ఆఫర్ చేయబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్లలో ఇందులో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ ఎకోబూస్ట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 4500 - 2000 ఆర్‌పిఎమ్ వద్ద 143 బిహెచ్‌పి శక్తిని, 1500 - 4000 ఆర్‌పిఎమ్ వద్ద 225 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. భారత మార్కెట్లో కూడా ఇదే ఇంజన్‌ను కొనసాగించవచ్చని సమాచారం. అయితే, ఇక్కడి మార్కెట్ కోసం ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో ఇది కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

ఫోర్డ్ టెరిటరీలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, పానరోమిక్ సన్‌రూఫ్, 10-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, హీటెడ్ అండ్ కూల్డ్ ఫ్రంట్ సీట్స్, యాంబియంట్ లైటింగ్, 8 స్పీకర్లు, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబల్ స్టీరింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

ఇంకా ఇందులో లభిస్తున్న 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 10 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు పడల్ ల్యాంప్స్ మొదలైన ఫీచర్లను ఇండియన్ స్పెక్ మోడల్‌లో కూడా ఆశించవచ్చు.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలెర్ట్, యాక్టివ్ పార్కింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్, ఏబిఎస్ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ లాంచ్ అసిస్ట్, 6 ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైనవి ఉన్నాయి.

క్రెటా, సెల్టోస్ కార్లకు పోటీగా వస్తున్న ఫోర్డ్ టెరిటరీ; మరికొద్ది నెలల్లోనే లాంచ్!

ఫోర్డ్ టెరిటరీ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీని ఫిలిప్పీన్స్‌లో పిహెచ్‌పి 12.77 లక్షలకు విక్రయిస్తున్నారు. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు 19 లక్షలుగా ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford Territory To Be Launched In India; Top Things To Know About It. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X